దీవి గోపాలాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 24:
ఆయా ప్రాంతములలోని ప్రకృతివనరులను, మూలికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ సమయంలో (1894-95) [[కలరా]], [[ప్లేగు]] వ్యాధులు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. సరైన చికిత్స, ప్రామాణిక మందులు లేక వందలాది మంది మృత్యువాత పడటం చూసిన ఈయన మనసు తల్లడిల్లిపోయింది.
 
[[బెంగళూరు]] లోని ధియోసాఫికల్ సొసైటీ వారి [[ఆసుపత్రి]]<nowiki/>లో వైద్యులుగా చేరి చాలాకాలం వైద్య సేవలు అందిస్తూ, ప్రత్యక్ష శాస్త్రానుభవాన్ని సంపాదించారు. 1898-99 లో బెంగళూరు నగరాన్ని కూడా గొప్ప భయంకర ప్లేగు వ్యాధి చుట్టుముట్టింది. ప్రజల్లో భయాందోళనలు నెలకొని హాహాకారాలు చేసారు. ఇదే సమయంలో మైసూరు [[మహారాజు]] ఈయనను రాష్ట్ర ఆస్థాన చికిత్సకులుగా నియమించారు.
==ప్లేగు మందు ఆవిష్కణ==
[[ప్లేగు]], [[కలరా]] వ్యాధుల నిరోధానికి ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్యాన్ని ఉపయోగించుకొని "శతధౌత ఘృతం" "హైమాది పంక్రమ్‌ (పానకం)" అనే రసాయనాలను సృష్టించి ఔషధ రూపంలో వ్యాధిగ్రస్తులకు అందించారు. ఆ విధంగా ప్రజలకు ఎంతో మేలు ఒకకూర్చారు.
==ఆయుర్వేదాశ్రమము==
తర్వాత కొద్దికాలానికి [[చెన్నై|చెన్నపట్టణం]] చేరి, శ్రీకన్యకా పరమేశ్వరి ఆయుర్వేద కాలేజి అండ్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గా, వైద్యులుగా పనిచేశారు. [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] రాకున్నా ఎనిమిది భారతీయ భాషలు మీద సాధికారత సంపాదించుకున్నారు. వైద్యులుగా పనిచేస్తున్న సమయంలోనే గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదించుకొని, [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లోనే ఆయుర్వేదాశ్రమమును నెలకొల్పారు. మరణించేవరకు అక్కడే ఉన్నారు. మద్రాసు ఆయుర్వేద కాలేజీకి కొంతకాలం ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఆయుర్వేదాంగ శల్యతంత్రము<ref>{{cite book|last1=గోపాలాచార్యులు|first1=దీవి|title=ఆయుర్వేదాంగ శల్యతంత్రము|url=https://archive.org/details/in.ernet.dli.2015.388483}}</ref> అనే గ్రంథం రచించారు.
 
==రచనలు==
పంక్తి 36:
 
==వైద్యసేవలకు గుర్తింపు==
ఈయన వైద్య సేవలు గుర్తింపు పొందగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈయనకు అపూర్వమైన ఘన సన్మానాలు చేశారు. నాసిక్ (ప్లేగు వ్యాధితో అట్టుడికి పోయిన పట్టణం) లో "ఆయుర్వేద మార్తాండ", [[కోల్‌కాతా|కలకత్తా]]<nowiki/>లో "భిషజ్ఞణి" బిరుదులు అందుకున్నారు (1907), అయిదవ జార్జి బ్రిటీష్ పాలక ప్రభుత్వం తరపున "వైద్యరత్న" బిరుదును అందించి (1913) ప్రతిష్ఠాత్మక గౌరవ మన్ననలు అందించారు.
==సేవలు==
ఆయుర్వేద వైద్య జగత్తుకు ప్రచారం కల్పించటానికి అహరహం కష్టించారు. ఈయన జీవితమే భారతదేశ ఆయుర్వేద చరిత్రగా భాసిల్లింది. ఏక సంధాగ్రాహి, అవిశ్రాంత వైద్య పరిశోధకులు కావటంతో 1919 లో "శ్రీ ధన్వంతరి" పక్ష పత్రికను స్థాపించి ఆంధ్ర దేశమంతటా వ్యాపింపజేశారు. ఆయుర్వేద వైద్య ప్రచారానికి అహరహం కష్టిస్తూ తమ సంపాదనంతటినీ వ్యయపరిచారు. "ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్"కు అధ్యక్షులుగా కొద్దికాలం ఉన్నారు. ముఖ్యంగా దక్షిణా పథంలో ఆయుర్వేద వైద్యానికి పునఃప్రాణప్రతిష్ఠ చేసి, యావధ్భారత ఖ్యాతి గాంచిన ఏకైక [[ఆంధ్రుడు]]. అయితే, ఈ మాత్రం చారిత్రక గుర్తింపుకు నోచుకోలేదు.