దూసి బెనర్జీ భాగవతార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవార్డులు: AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 36:
}}
 
రంగస్థల నటుడు, భక్తిగీతాల [[గాయకుడు]], [[వ్యాఖ్యాత]], [[తబలా]] కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌.. ఇవన్నీ కలబోసి పోతపోసిన బహుముఖ ప్రజ్ఞాశీలి '''దూసి బెనర్జీ'''. హరికథా కళారూపం పేరు చెప్పగానే గుర్తొచ్చేది బెనర్జీయే. కాగా మంచినటుడిగా సుకుమార్‌ ఆర్కెస్ట్రా నిర్వహకుడిగా తెలిసేది కొందరికే. [[1948]]లో కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్రతో ప్రారంభమైన ఆయన నటజీవన ప్రస్థానం [[జె.వి.సోమయజులు]], [[జె.వి.రమణమూర్తి]] (నటరాజ్‌ కళాసమితి), రావికొండలరావుల శిష్యరికంలో ఎన్నో పాత్రలు ధరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన సొంత గ్రామం దూసి. అసలు పేరు కూర్మనాధశర్మ. [[తూర్పు భాగవతం]] పాడడం వల్ల సురేంద్రనాధ్‌ బెనర్జీ అని పిలిచేవారని గతంలో ఆయన 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. [[1946]] నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు వేశారు. [[కన్యాశుల్కం]] నాటకంలో వెంకటేశం పాత్రతో నటజీవితం ప్రారంభమైంది. [[1955]]లో బండారు చిట్టిబాబు, [[రావి కొండలరావు]]<nowiki/>లతో కలిసి బెనర్జీ సుకుమార ఆర్కెస్ట్రాను ప్రారంభించారు. కొన్నాళ్లు [[ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌|ఖాదీ]] పరిశ్రమలో ఉద్యోగం చేశారు. [[1956]]లో [[బుర్రకథ]] ప్రదర్శనలు, [[1970]] నుంచి హరికథాగానం చేయడం ప్రారంభించారు.
 
==చిన్ననాటి నుంచే సంగీత సాధన==
చిరుప్రాయం నుంచే సంగీతం, పాటలు పాడటం మొదలుపెట్టిన ఆయన తబలా వాయిద్యం కూడా స్వయంకృషితో నేర్చుకున్నదే. 'రాధామనసు' లలిత గీతాలు పుస్తకం రాయడమే కాకుండా కొన్ని పాటలు రేడియోలో ప్రసారమయ్యాయి. గీతోపదేశం పేరిట భగవద్గీతను పాటల రూపంలో రాసి ప్రచురించారు. సుధా బిందువులు సినిమాలో సంగీతం నిర్వహిస్తూ పాటలు పాడారు. [[అరసవల్లి]]<nowiki/>లో ఏటా జరిగే స్వామివారి [[ఏకాంత సేవ|ఏకాంతసేవ]] సంగీత [[రూపకం]]<nowiki/>లో సూత్రధారునిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాన్నారు.
 
==సుకుమార ఆర్కెస్ట్రాలో==
పంక్తి 45:
 
==హరికథా భాగవతార్‌గా==
దానయ్య భాగవతార్‌ వద్ద హరికథా ప్రక్రియ నేర్చుకున్న బెనర్జీ కొన్నివేల ప్రదర్శనలించారు. ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళిక కోసం బుర్రకథా కళాబృందాన్ని తీసుకువెళ్లి బంగారు పతకం పొందారు. [[సీతాకల్యాణం]], దక్షయజ్ఞం, [[శ్రీనివాస కళ్యాణం|శ్రీనివాస కల్యాణం]] వంటి కథలను గానం చేశారు. ఆయన [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోను, [[హిందీ భాష|హిందీ]]<nowiki/>భాషలో కూడా హరికథాగానం చేసి [[జాతీయ]] స్థాయిలో గుర్తింపు పొందారు. తను స్వయంగా రచించి గానం చేసిన గీతోపదేశం, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్|దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌]], రాణిరుద్రమ, షిరిడీసాయిబాబా కథలు గానం చేశారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ, మాజీ [[ముఖ్యమంత్రి]] [[ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు|ఎన్‌.టి.రామారావు]]<nowiki/>ల ప్రశంసలు పొందారు.
 
==అవార్డులు==