నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 35:
 
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర '''మోదీ''' భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య [[రథయాత్ర]]కు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇన్‌చార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">{{Cite web |url=http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel12.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2019-09-11 |archive-url=https://web.archive.org/web/20110901224501/http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel12.htm |archive-date=2011-09-01 |url-status=dead }}</ref>. [[1998]]లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన [[కేశూభాయి పటేల్]] ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను [[భూకంపం]] తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం [[2001]] [[అక్టోబర్|అక్టోబరు]]<nowiki/>లో నరేంద్ర మోదీని గుజరాత్ [[ముఖ్యమంత్రి]] పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు.
 
=== ముఖ్యమంత్రిగా '''మోదీ''' ===
పంక్తి 47:
'''2012 ఎన్నికలు:''' 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదుచేసింది. నరేంద్రమోదీ స్వయంగా మణినగర్ నుంచి 86వేలకు పైగా ఓట్ల మెజారిటితో గెలుపొందినారు. వరసగా 4వ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్రమోదీ దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది.
 
'''ప్రధానమంత్రి అభ్యర్థిగా:''' 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వాని<ref>సాక్షి దినపత్రిక, తేది 18-05-2014</ref> అడ్డుతగిలినప్పటికీ అనంతరం ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోడర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా [[కాశీ|వారణాసి]]<nowiki/>లో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.
 
=== చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు