నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ణంను → ణాన్ని , → , , → , (2), ( → ( (2) using AWB
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
 
===పరీక్షించు విధానం<ref>Methods of Sampling and test for oils and fats,IS:548(partI-1964)by Indian standards,Determination of unsaponifiable matter,pagenO.31</ref> ===
కచ్చితంగా తూచిన సుమారు 5 గ్రాం, ల [[నూనె]]ను B24 మూతి వున్న కోనికల్ ఫ్లాస్కు లేదా చదునైన అడుగు భాగం వున్న రిసివరు ఫ్లాస్కులో తీసుకోవాలి. దానికి 50 మి.లీ.ల ఆల్కహాలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని [[పిపెట్]]<nowiki/>తో కొలచి కలపాలి. ఫ్లాస్కునకు B 24 కోన్ వున్న ఎయిర్/లెబెగ్ కండెన్సరును అమర్చాలి. నూనె+అల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని సుమారు గంటసేపు సపోనిపికేషను పూర్తయ్యే వరకు హాట్‍ప్లేట్ పై వేడి చెయ్యాలి. సపోనిఫికేషను పూర్తయ్యాక హీటరును ఆపివేసి, కండెన్సరు లోపలి అంచులు తడిసేలా 10 మి.లీ.ల అల్కహాల్‌తో కడగాలి. ఫ్లాస్కు గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు చల్లార్చాలి. ఫ్లాస్కులోని చల్లారిన ద్రవాన్ని ఒక 500 మి.లీ.ల సెపరేటింగ్ ఫన్నలుకు చేర్చాలి. సెపరేటింగ్ ఫన్నల్‌లోని ద్రవానికి ఇంచుమించు 50 మి.లీ.ల డిస్టిల్ వాటరును కలపాలి. ఇప్పుడు 50మి.లీ.ల పెట్రోలియం ఈథరును సెపరేటింగ్ ఫన్నల్‌కి చేర్చాలి. సెపరేటింగ్ ఫన్నల్ మూతికి బిరడాను బిగించి ఒకనిమిషం సేపు ఫన్నల్‌ను కలయతిప్పాలి. ఫన్నల్‌ను రింగ్ స్టాండులో వుంచి, సెపరేటింగ్ ఫన్నల్‌లోని ద్రవం రెండు ద్రవభాగాలుగా విడిగా ఏర్పడు వరకు వేచివుండాలి. సెపరేటింగ్ ఫన్నల్‌లో ఏర్పడిన రెండు ద్రవభాగాలలో క్రిందిభాగంలో సోప్ వాటరు, పైభాగాన పెట్రోలియం ఈథరు వుంటాయి. (నీటికన్న పెట్రోలియం ఈథరు తక్కువ సాంద్రత కలిగివుండటం వలన, పెట్రోలియంఈథరు నీటిలో కలవదు కనుక సోప్‌వాటరు పైన పెట్రోలియం ఈథరు తేలుతుంది).సెపరేటింగ్ ఫన్నల్ అడుగు భాగంలోని సోప్ వాటరును మరో సెపరేటింగ్‌ ఫన్నల్‌కు మొదటి సెపరేటింగ్ ఫన్నల్ క్రింద వున్న కాక్ ద్వారా వదలాలి. ఇప్పుడు సోప్‌వాటరు వున్న సెపరేటింగ్ ఫన్నల్‌కు 50 మి.లీ.ల పెట్రోలియం ఈథరును చేర్చి ఇంతకు ముందులా బిరడా బిగించి బాగా కలయతిప్పాలి. ఒక నిమిషం పాటు కలయతిప్పి, రింగ్ స్టాండులో ఉంఛాలి. కొద్దిసేపటి తరువాత సెపరేటింగ్ ఫన్నల్‌లోని ద్రవం రెండు పొరలుగా/మట్టాలుగా విడిపోతుంది. పైన ఉన్న పెట్రోలియం ఈథరు ద్రవాన్ని అంతకుముందు పెట్రోలియం ఈథరు వున్న సెపరేటింగ్ ఫన్నల్‍కు చేర్చవలెను. మరల సోఫ్ వాటరును సెపరేటింగ్ ఫన్నల్‍లో తీసుకొని దానికి 50 మి.లీ.ల పెట్రోలియం ఈథరును చేర్చి పైవిధంగా చెయ్యాలి. ఇలా కనీసం 4-5 సార్లు చెయ్యాలి. పెట్రోలియం ద్రవభాగాలను మొదటి సెపరేటింగ్ ఫన్నల్‍లో జమ చెయ్యాలి. ఇప్పుడు సెపరేటింగ్ ఫన్నల్‍లో చేరుకున్న పెట్రోలియం ఈథరుకు 25 మి.లీ.ల 10% అల్కహాల్ను కలిపి ఫ్లాస్కును బాగా కలయ తిప్పి, సెట్లింగ్ కు వదలాలి.
 
సెపరేటింగ్ ఫన్నల్‌లో రెండు లేయరులు ఏర్పడతాయి. పెట్రోలియం ఈథరులోని సోప్ 10% అల్కహాల్‌లో కరగిపోతుంది. సెపరేటరులో దిగువన సెటిల్ అయ్యిన సోప్ వాటరును తొలగించాలి. ఇలా కనీసం 3 సార్లు 10% ఆల్కహాల్ వాటరు వాషింగ్ లు యివ్వాలి. ఇప్పుడు సెపరేటింగ్ ఫన్నల్‌లోని పెట్రోలియం ఈథరుకు 20 మి.లీ.ల డిస్టిల్డ్ వాటరును చేర్చి బాగా కలయతిప్పి, సెటిలింగ్ చేసి, దిగువన చేరుకున్న నీటిని తొలగింఛాలి. ఇలా వాటరు, ఫినాప్తలిన్ ఇండికేటరుతో తటస్థంగా మారువరకు (వాటరులో సోప్ పార్టికలు వున్నచో వాటరు ఫినాప్తలీన్ వలన పింక్‌రంగుకు మారును) చెయ్యాలి. సోప్ పార్టికల్స్ తొలగింపబడిన పెట్రోలియం ఈథరును, అంతకుముందే తూచి, భారాన్ని నమోదుచేసిన 250 మి.లీ.రిసివరులో వెయ్యాలి. రిసీవరును హీటరుమీద వేడి చేసి పెట్రోలియం ఈథరును, ఆవిరి రూపంలో తొలగించాలి. రిసీవరులో వున్న పదార్థమే అన్ సపొనిఫియబుల్ పదార్థం. అయితే ఇందులో సపొనిఫికెసన్ చెందకుండ వున్న [[కొవ్వు ఆమ్లాలు]] కూడా ఉండే ఆవకాశం ఉంది.