"నోము" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (replacing dead dlilinks to archive.org links)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
'''[[నోము]]''' అనగా దీర్ఘకాలాను పాలనీయమైన [[సంకల్పము]]. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. దీనినే '''వ్రతము''' అని కూడా అంటారు. జీవితపు [[నాలుగు]] దశలలో ఆచరించు నోములున్నవి. [[సంస్కృతము|సంస్కృత]] సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.
 
[[ఆంధ్ర దేశము]]న [[స్త్రీలు]], [[పిల్లలు]] నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉంది. [[స్త్రీ|స్త్రీల]]<nowiki/>కు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు ఉన్నాయి.
 
మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు [[త్రిమూర్తులు]] దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా ఉన్నాయి. [[త్రిలోకాలు|త్రిలోక]] సంచారియైన [[నారదుడు]] చెప్పినవి కొన్ని ఉన్నాయి. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986459" నుండి వెలికితీశారు