పరుచూరి గోపాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
 
'''పరుచూరి బ్రదర్స్''' లో ఒకరైన '''పరుచూరి గోపాలకృష్ణ''' ఇద్దరిలో చిన్నవారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు. ఆయన అన్న [[పరుచూరి వెంకటేశ్వరరావు]]తో కలిసి వందలాది [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. 1990ల అనంతరం తెలుగు సినీ రంగంలో, మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమాలలో, వారు ఎన్నదగిన విజయాలను అందుకున్నారు. దర్శకత్వం చేసి మొదటి సినిమాతోనే నంది బహుమతిని అందుకున్నా, ఆనాటి ముఖ్యమంత్రి, తెలుగు సినీ ప్రముఖుడు [[నందమూరి తారక రామారావు]] సలహా మేరకు తాము అప్పటికే మంచి పేరు సంపాదించుకున్న రచన రంగంలోనే ఉండి దర్శకత్వానికి దూరమయ్యారు. గోపాలకృష్ణ పలు సినిమాలలో ప్రతినాయకుడు, ప్రాధాన్యపాత్రలను ధరించారు. సినీ నటునిగా కూడా సంభాషణలు వైవిధ్యభరితంగా చెప్పగలిగిన స్వతఃసిద్ధ [[ప్రతిభ]]<nowiki/>తో రాణించారు. ఎం.ఎ.(తెలుగు) చదివి ఆంధ్రోపన్యాసకునిగా [[తెలుగు]] బోధిస్తుండగా సినిమా అవకాశాలు వచ్చాయి. కొద్దికాలం అటు సినిమాలలో పనిచేస్తూనే ఇటు బోధన కూడా కొనసాగించారు. సినిమాలు విజయవంతం కావడంతో సినీరంగంలోనే భవిష్యత్తు నిర్ణయించుకుని ఆంధ్రోపన్యాసకునిగా వున్న ఉద్యోగాన్ని వదిలేశారు. సినీరంగంలో పనిచేసి, చాన్నాళ్లకు తిరిగి తల్లికోరికపై పీహెచ్‌డీ చేపట్టి '''డాక్టరేట్''' పట్టా పొందారు. ఆ క్రమంలోనే [[తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం]] అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పరుచూరి_గోపాలకృష్ణ" నుండి వెలికితీశారు