పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

36 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
[[ఫైలు:TeluguBookCover Sakshi Essays.jpg|right|thumb|250px|[[సాక్షి]] పుస్తకం ముఖచిత్రం మీద పానుగంటి వారి చిత్రం.]]
'''పానుగంటి లక్ష్మీ నరసింహారావు''' ( [[నవంబర్ 2]],[[1865]] - [[జనవరి 1]], [[1940]]) [[తెలుగు]] సాహితీవేత్త. [[సాక్షి]] ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ [[బిరుదు]]<nowiki/>లతో అభినందించింది.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
రచయితగా పేరుపడిన నరసింహరావు [[రక్తాక్షి]] సంవత్సరం [[మాఘ బహుళ పాడ్యమి]] నాడు అనగా [[1865]], [[నవంబర్ 2]]న [[రాజమండ్రి]] తాలూకా [[సీతానగరం]]లో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు.
 
వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. [[పరీక్ష]]<nowiki/>లలో ఉత్తీర్ణులైనారు. తరువాత [[పెద్దాపురం]] హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.
 
==రచనలు==
పానుగంటి పంతులు శబ్దవైచిత్రవలచినకవి. ఆంధ్ర వచనరచనలో వీరొక క్రొత్తదారి త్రొక్కిరి. కందుకూరి వీరేశలింగము పంతులుగారు గద్యతిక్కనయేగాని యావిషయము వేఱు. చిలకమర్తికవి పెద్దనవలా రచయితేగాని యదియునువేఱే. పానుగంటివారి రచన మఱియొక విలక్షణమైనది. వీరు వ్యావహారికమునకు దగ్గఱగనుండు గ్రాంథికము వ్రాయుదురు. ప్రతిపదము పరిహాసగర్భితము. ఆక్షేపణ భరితము. చెప్పినదే మార్చి మార్చి భంగ్యంతరముగా జెప్పుట వీరి రచనలో గ్రత్తదనము. చదివినకొలదిని జదువుట కుత్సాహము పుట్టించు రచనమే రచనము. అది పానుగంటికవి సొమ్ము. విషయము గప్పిపుచ్చకుండ, విసుగుపుట్టింపకుండ వేలకొలది నిదర్శనముల జూపుచు వ్రాయుటలో బానుగంటి వారిదే పై చెయ్యి. పాఠకున కొకవిధమైన యుత్సాహము చిత్తసంస్కృతి యావేశము గలిగింపజేయుట కీయన రచన యక్కటైనది.
 
శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి [[నాటకము]]<nowiki/>లలోని [[పద్యము]]<nowiki/>లు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చింది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి. పానుగంటివారి నాటకములకు కూచి నరసింహముగారు 'నాంది' వ్రాయుట యొక యాచారము. పంతులుగా రాంగ్లవిశేఖరుడగు 'షేక్‌స్పియరు' వ్రాసిన యన్నినాటకములు వ్రాయవలె నని సంకల్పించి యొకటిరెండించు మించులో దమ సంకల్పము పూరించుకొనిరి. వానిలో నయిదాఱు 'నాటకములకు--------వచ్చింది. 'రాధాకృష్ణ' వీరి నాటకములలో నాయక రత్నము దానియందు వీరి కవిత పండినది.<ref name=madhuna/>
 
==సంస్థానాల దివాను==
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986619" నుండి వెలికితీశారు