పారుపల్లి రామక్రిష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

45 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
==గురు పరంపర==
త్యాగరాజు ఒక గొప్ప కర్నాటక సంగీత విద్యాంసుడు. ఆయన తన జీవితంలో చాలాకాలం  [[తమిళనాడు]]<nowiki/>లోని [[తంజావూరు జిల్లా]] యం<nowiki/>దు నివసించి అనేకమంది మహావిద్వాంసులకు సంగీత శిక్షణనిచ్చి 1847 వ సంవత్సరంలో పరమపదించారు. అట్టివారిలో వారి జ్ఞాతి ఆకుమళ్ళ (మనంబుచావడి) వెంకటసుబ్బయ్య కూడా ఒకరు. వెంకటసుబ్బయ్య కూడా తన జీవితకాలంలో అనేక మంది శిష్యులను ఆకర్షించి సంగీతశిక్షణనిచ్చారు. వారిలో [[సుసర్ల దక్షిణామూర్తి]] శాస్త్రి (1860-1917) ఒకరు. శాస్త్రిగారి సంగీతానురక్తి ఆయన్ని స్వస్థలమైన [[కృష్ణా జిల్లా]] నుండి తమిళనాడు కాలినడక [[ప్రయాణం]] చేయించింది. వెంకటసుబ్బయ్య వద్ద సంగీతం నేర్చుకున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. త్యాగరాజు సంగీత పరంపరను ఆంధ్ర ప్రాంతానికి పరిచయంచేసిన శాస్త్రిగారి వలన చాలామంది విద్యార్థులు లభ్ది పొందారు. వారిలో [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] యొక్క [[గురువు]]<nowiki/>గా పేరుగాంచిన ప్రముఖ గాత్రవిధ్వాంసుడైన పారుపల్లి రామక్రిష్ణయ్య (1883-1951) ఒకరు.
 
==జీవిత సంగ్రహం==
వీరు [[కృష్ణా జిల్లా]] [[శ్రీకాకుళం]]<nowiki/>లో పారుపల్లి శేషాచలం, రంగమ్మ దంపతులకు [[వ్యయ]] నామ సంవత్సరం (1883)లో జన్మించారు<ref name="భారతి">{{cite journal |last1=కో.వేం.శ. |title=గాయక సార్వభౌమ బ్ర.శ్రీ. పారుపల్లి రామక్రిష్ణయ్య గారు |journal=భారతి మాసపత్రిక |date=1 February 1932 |volume=9 |issue=2 |pages=350-351 |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8019 |accessdate=24 May 2020 }}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. [[సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి]] గారి వద్ద శిక్షణ పొంది [[విజయవాడ]]<nowiki/>లో స్థిరనివాస మేర్పరచుకొని గురుకుల పద్ధతిలో ఉచితంగా విద్యాబోధన చేశారు.
 
పంతులుగారు జంత్రగాత్రములతో కచేరి చేసేవారు. సంగీత, సాహిత్య, లక్ష్యలక్షణాలను పోషిస్తూ బాగా పాడేవారు. వర్ణంతో ఆరంభమై, శ్రోతల అభిరుచిని గమనించి, రాగం, స్వరం, నెరవులు మోతాదు మించకుండా ఆద్యంతం కచేరీని రక్తిగా నడిపేవారు. ప్రక్కవాద్యాలను ప్రోత్సహిస్తూ పాడేవారు. కచేరీలో అన్ని అంశాలు ఉండేవి; అనగా తాళముల మార్పు, మధ్యమకాల కీర్తనలు, తక్కువకాల కీర్తనలు, [[రాగం]], [[తానం]], [[పల్లవి]], [[శ్లోకం]], [[రాగమాలిక]], [[పదం]], [[జావళి]], [[తిల్లాన]], [[మంగళం]]<nowiki/>తో కచేరిని ముగించేవారు.
 
==సన్మానాలు==
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986635" నుండి వెలికితీశారు