పిండి పదార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవ ప్రాముఖ్యం: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Wheat products.jpg|thumb|[[తిండి గింజలు|తిండి గింజల]]తో తయారు చేసిన ఆహారపదార్ధాలలో సంక్లిష్ట పిండిపదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి]]
[[Image:Lactose.svg|thumb|right|310px|లాక్టొస్ పాలలో దొరికే ఒక కార్బోహైడ్రేటు.దాని యొక్క ఫార్ములా C<sub>12</sub>H<sub>22</sub>O<sub>11</sub>.]]
పిండి పదార్థాలను [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో [[కార్బోహైడ్రేట్లు]] అంటారు. నిజానికి పిండి పదార్థం - అంటే starchy substance - ఒక రకం కర్బనోదకం. '''పిండి పదార్ధాలు''', [[చక్కెర]]లు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>లే. కార్బోహైడ్రేట్లు అంటే కార్బన్ యొక్క హైడ్రేట్లు అని అర్థం. కార్బోహైడ్రేట్లు అనే పేరు వల్ల ఇవి కార్బన్, నీరు (హైడ్రేట్) సంయోగ పదార్థాలు లేదా జలయుత కార్బన్ పదార్థాలనే అర్థం వస్తుంది. కార్బోహైడ్రేట్లను శాకరైడులు అని కూడా పిలుస్తారు.
 
కార్బోహైడ్రేట్లు రెండు కంటే ఎక్కువ హైడ్రాక్సీ సమూహాలు కలిగిన ఆల్డిహైడ్‌లు లేదా కీటోన్‌లు. వీటి సాధారణ ఫార్ములా C<sub>n</sub> (H<sub>2</sub>O) y. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ (చక్కెర), లాక్టోజ్, సెల్యులోజ్, స్టార్చ్ (పిండి పదార్థం) కార్బోహైడ్రేట్లకు కొన్ని ఉదాహరణలు. వీటిని పిండి పదార్థాలు ([[బియ్యం]], పప్పు ధాన్యాలు, [[ఆలుగడ్డలు]], రొట్టె) లేదా చక్కెరలు ([[పటిక బెల్లం]], [[జామ్]], స్వీట్స్ లాంటివి) రూపంలో మనం [[ఆహారం]]<nowiki/>గా తీసుకుంటాం. [[పత్తి]], [[కలప]] వృక్షాల్లోని సెల్యులోజ్ వల్ల ఏర్పడుతున్నాయి.
 
== చరిత్ర ==
పంక్తి 12:
== నామకరణాలు ==
 
కర్బనోదకాల పేర్లన్నీ "-ఓజు" శబ్దంతో అంతం అవాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. ఉదాహరణకి కర్బనోదకాలన్నిటిలోనూ అతి చిన్న బణువు గ్లూకోజు. [[రక్తం]]<nowiki/>లో ఉండే [[చక్కెర]] ఇదే. పళ్ళకి తీపినిచ్చేది ఫ్రూక్టోజు (ప్రూట్ అంటే పండు, ప్రూట్ + ఓజు = ఫ్రూక్టోజు). మనం సాధారణంగా కాఫీ, టీ లలో వేసుకునేది సుక్రోజు. పాలకి తియ్యదనాన్నిచ్చేది లేక్టోజు. మన జన్యు పదార్థంలో ఉండేది రైబోజు. [[పీచు]], పిప్పి పదార్ధాలలో ఉండేది కణోజు (కణం + ఓజు = కణోజు, లేదా సెల్‌ + ఓజు = సెల్యులోజు). మనం ఏ భాషలో మాట్లాడినా, ఏ కొత్త పేర్లు పెట్టినా ఈ ఒప్పందం [[మనస్సు]]<nowiki/>లో పెట్టుకుంటే సర్వదా క్షేమకరం. అదే విధంగా కుడిచేతి వాటం ఉన్న చక్కెరలని డెక్‌స్ట్రోజు (dextrose) అనీ, ఎడమ చేతి వాటం ఉన్న చక్కెరలని లీవోజు (levose) అనీ అంటారు. (లేటిన్‌లో Dextro అంటే కుడి, levo అంటే ఎడమ.) వీటిని కావలిస్తే మనం దక్షిణోజు, వామోజు అని అనొచ్చు.
 
== cells lines ==
 
ఆంగిక రసాయనంలో పేర్లు ఎంత ముఖ్యమో, ఒక బణువులో ఉన్న [[అణువు]]ల అమరిక వైఖరి కూడా అంతే ముఖ్యం. ఈ అణువుల అమరికని నిర్మాణక్రమం (structural formula) అంటారు. ఈ నిర్మాణక్రమంలో చిన్న మార్పు వచ్చినా బణువు లక్షణం మారిపోతుంది. ఉదాహరణకి గ్లూకోజు బణువులో ఉన్న అణువులు తిన్నటి గొలుసు (straight-chain) [[ఆకారం]]<nowiki/>లో ఉండొచ్చు, చక్రం (ring) ఆకారంలో ఉండొచ్చు. కొన్ని అమరికలలో సౌష్టత (symmetry) ఉండొచ్చు, కొన్ని అమరికలలో ఉండక పోవచ్చు. కొన్ని అమరికలకి 'కుడిచేతి వాటం' ఉండొచ్చు, కొన్నింటికి ఎడం చేతి వాటం' ఉండొచ్చు. ఈ 'వాటం' ని సాంకేతిక పరిభాషలో కరత్వం (handedness or chirality) అంటారు. ఈ కరత్వం అన్న మాటలోంచి వచ్చినదే chirality అనే ఇంగ్లీషు మాట!
 
ఈ అమరికలన్నిటినీ చూపటం కష్టం కనుక, మచ్చుకి, [[గ్లూకోజ్]] నిర్మాణక్రమాల్లో ఒక దానిని ఇక్కడ చూపటం జరుగుతోంది.
పంక్తి 23:
 
== వర్గీకరణ ==
రసాయనులు కర్బనోదకాలని [[నాలుగు]] ప్రధాన వర్గాలుగా విభజించారు. ఈ విధంగా మనకు తిండి, బట్ట, నివాసం అందించడంలో కార్బోహైడ్రేట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జీవ క్రియలన్నింటికీ కావలసిన [[శక్తి]]<nowiki/>ని సమకూర్చుతున్నాయి.ఒక కార్బోహైడ్రేట్ జల విశ్లేషణలో విడుదలయ్యే మోనోశాకరైడ్ అణువుల సంఖ్యను బట్టి కార్బోహైడ్రేట్‌లను విభజించవచ్చు. శాకరైడ్ అనే పదం గ్రీకు పదమైన Sakkharon నుంచి వచ్చింది. Sugar అని దీనికి అర్థం. మోనోశాకరైడ్, డైశాకరైడ్‌లలో చివర - ose అని వస్తుంది.
 
ఉదా: బ్లడ్‌షుగర్ అనేది మోనోశాకరైడ్ గ్లూకోజ్ (Glucose), మనం తినే చక్కెర డైశాకరైడ్ సుక్రోజ్ (Sucrose), పాలలోని చక్కెర డైశాకరైడ్ లాక్టోజ్ (Lactose).
పంక్తి 54:
== పోషక సామర్థ్యం ==
 
కర్బనోదకాలు జీవికి శక్తిని ఇచ్చే పోషక పదార్ధాలు. వీటిని తక్కువ నీటితో జీర్ణం చేసుకోవచ్చు. ప్రాణ్యము (protein) లని, కొవ్వు (fat) లని జీర్ణించుకుందుకి ఎక్కవ నీరు కావాలి. ప్రాణ్యములు, [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]]<nowiki/>లు ఆవం (oven) నిర్మించటానికి వాడే ఇటికలు, [[సున్నం]] అనుకుంటే కర్బనోదకాలు ఆవంలో కాలే ఇంధనం (fuel) అవుతుంది. అంటే శరీరంలో జీవకణాల నిర్మాణానికి కణజాల (tissue) నిర్మాణానికి ప్రాణ్యములు, [[కొవ్వు]]లు అవసరం, శక్తిని ఇవ్వటానికి కర్బనోదకాలు అవసరం.
 
కర్బనోదకాలు [[జీవి]] మనుగడకి తప్పనిసరి కాదు. కర్బనోదకాల సరఫరా లేకపోతే జీవి కొవ్వుల నుండి, ప్రాణ్యాల నుండి కర్బనోదకాలని తయారుచేసుకో ఉంది.
 
స్థూలకాయంతో (obese) కాని, డయబెటీస్ (diabetes) తో కాని బాధ పడే ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతూన్న ఈ రోజులలో పోషకాహారం (diet) ఎటువంటిది తినాలన్నది ఒక జటిలమైన ప్రశ్నగా పరిణమించింది. ఐశ్వర్యవంతమైన దేశాలలో ఎదిగిన వ్యక్తులు తమకి కావలసిన [[శక్తి]]<nowiki/>లో 40 నుండి 65 శాతం మేరకి కర్బనోదకాల నుండి లభించేలా చూసుకోవాలని ఒక మార్గదర్శిక సూచిక (guideline) ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) వారు మనకి లభించే శక్తిలో 55 నుండి 75 శాతం మేరకి కర్బనోదకాల నుండి పొందాలని వక్కాణించేరు. ఈ రెండింటిలో ఏ మార్గదర్శిక సూచిని వాడినా అందులో 10 శాతం మాత్రమే సాధారణ కర్బనోదకాలు (simple carbohydrates, అంటే, చక్కెర, గ్లూకోజు వగైరాలు) నుండి ఉండాలి అని, మిగిలినవి సంక్లిష్ట కర్బనోదకాలు (complex carbohydrates, అంటే, [[ధాన్యాలు]], పళ్ళు, [[రొట్టె]]<nowiki/>లు, మొదలైన పిండి పదార్ధాలు) అయి ఉండాలని సిఫారుసు చేశారు. [[ఆరోగ్య సూత్రాలు]] పాటించే వారు ఈ సంక్లిష్ట కర్బనోదకాలనే మంచి కర్బనోదకాలు (good carbs) అనిన్నీ, సాధారణ కర్బనోదకాలని చెడ్డ కర్బనోదకాలనిన్నీ (bad carbs) అంటూ ఉంటారు. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఏక చక్కెరలు, జంట చక్కెరలు సాధారణ కర్బనోదకాలు. స్వల్ప చక్కెరలు, బహు చక్కెరలు సంక్లిష్ట కర్బనోదకాలు. ఇవి [[కాయగూరలు]], [[ధాన్యాలు]], పండ్లు, మొదలైన వాటిల్లో ఉంటాయి.
 
ఆరోగ్య పరిరక్షణకి మన అసలు గమ్యం [[రక్తం]]<nowiki/>లో ఉన్న [[గ్లూకోజు]] మట్టాన్ని అదుపులో పెట్టగలగటం. కనుక ఏయే పదార్ధాలు తింటే రక్తంలో గ్లూకోజు మట్టం ఎంతెంత పెరుగుతుందో తెలిస్తే అప్పుడు ఏయే వస్తువులు తింటే మంచిదో తేల్చి చెప్పొచ్చు. ఈ కోణంలో ఆలోచించి కొందరు గ్లయిసీమిక్‌ సూచిక (glycemic index) అని ఒక కొత్త సూచికని ప్రవేశ పెట్టేరు. ఈ పద్ధతి ప్రకారం ఏయే కర్బనోదకాలని తింటే రక్తంలో గ్లూకోజు మట్టం ఎంతెంత పెరుగుతుందో లెక్క కట్టి, ఆ లెక్క ప్రకారం కర్బనోదకాలని వర్గీకరిస్తారు. మరొక పద్ధతిలో ఇన్సులిన్‌ సూచిక (insulin) అనే మరొక కొత్త సూచిక వాడతారు. గ్లయిసీమిక్‌, ఇన్సులిన్‌ సూచికలు శాస్త్రవేత్తలకి అర్ధమయినంత తేలికగా సామాన్యులకి అర్ధం కావు. కనుక ప్రస్తుతం బాగా పలుకుబడిలో ఉన్న పద్ధతి 'మంచి, చెడ్డ' అని కర్బనోదకాలని వర్గీకరించటమే.
== బెనెడిక్ట్ పరీక్ష : ==
50 మి.లీ. ఫ్లాస్కులో 8.65 గ్రాముల సోడియం సిట్రేట్, 5 గ్రాముల సోడియం కార్బోనేట్, 35 మి.లీ.ల నీటిని పోసి కలపాలి. మరో పరీక్ష నాళికలో 0.87 గ్రాముల [[కాపర్ సల్ఫేట్‌]]ను 5 మి.లీ. నీటిలో కరిగించాలి. ఈ రెండు ద్రావణాలను కలపగా ఏర్పడిన ద్రావణాన్ని [[బెనెడిక్ట్ ద్రావణం]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/పిండి_పదార్థాలు" నుండి వెలికితీశారు