పంబల వారు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
[[దస్త్రం:Pommalu..JPG|thumb|left|పొమ్మల జోడు. వాయిద్య పరికరము/దామలచెరువు గ్రామం సమీపాన మొరవపల్లిలో తీసిన చిత్రము]]
[[దస్త్రం:Pujaku.JPG|thumb|right| ఒక గ్రామ దేవత పూజకు సంబంధించిన ఊరేగింపులో పొమ్మలు వాయిస్తున్న దృశ్యము.చిత్తూరు జిల్లా..... మొగరాలలో తీసిన చిత్రము]]
;[[సర్కారు]] ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే [[దేవతలు|దేవతల]] కొలువుల్లోనూ, జాతర్ల లోనూ [[పంబల]] వారి [[కథలు]] ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈ నాటికీ గ్రామ దేవతలను కొలిచే ప్రతి చోటా ఈ [[కథలు]] జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలు కనుమరుగు ఔతున్నాయి. ప్రస్తుతము [[చిత్తూరు జిల్లా]]<nowiki/>లో గ్రామ దేవతల పూజలలో ఈ వాయిద్యాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంటి వారు [[పూజ]]<nowiki/>కు ఇంటినుండి బయలు దేరి నప్పటినుండి [[దేవాలయము]] వరకు ముందు పంబల వారు పంబల వాయిస్తూ ముందు నడవాల్సిందే. (మొగరాల గ్రామంలో తీసిన చిత్రము చూడుము) ఈ వాయిద్యము వీరావేశాన్ని రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా కొందరికి పూనకం రావడం కూడా జరుగుతుంది.
 
పంబల వారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం ''పంబ జోడనీ, వీరు ఎక్కువగా '' [[అంకమ్మ]] '' కథలను పాదుతారనీ, వీరు కొలిచే అంకమ్మకు, ''మురాసపు అంకమ్మ '' అని పేరనీ వంతలు పంబ జోడును వాయిస్తూ [[శ్రుతి]] కి [[తిత్తి]] ఊదుతూ వుంటే కథకుడు రాజ కుమారునిలా వేషాన్ని ధరించి కుడి చేతితో పెద్ద కత్తినీ, ఏడమ చేతితో ''అమజాల '' అనే చిన్న కత్తిని పట్టుకుని వీరా వేశంతో [[చిందులు]] తొక్కుతూ కథను పాడుతారనీ, డా: [[తంగిరాల వెంకట సుబ్బారావు]] గారు జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.
"https://te.wikipedia.org/wiki/పంబల_వారు" నుండి వెలికితీశారు