ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 73:
}}
 
'''ప్రణబ్ కుమార్ ముఖర్జీ''' (జ. 1935 డిసెంబరు 11) [[భారత దేశము|భారతదేశ]] రాజకీయ నాయకుడు. అతను [[భారత దేశము|భారతదేశానికి]] 2012 నుండి 2017 వరకు [[భారత రాష్ట్రపతులు - జాబితా|13వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]<nowiki/>గా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను [[భారత జాతీయ కాంగ్రెస్]]లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/india/in-coalition-govts-its-difficult-to-reconcile-regional-with-national-interests-pranab-mukherjee/articleshow/61139336.cms|title=In coalition govts, it's difficult to reconcile regional with national interests: Pranab Mukherjee}}</ref> రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటూంటాయి.
 
1969లో జరిగిన [[కాంగ్రెసు|కాంగ్రెస్]] సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున [[రాజ్యసభ సభ్యులు|రాజ్యసభ సభ్యుడ]]<nowiki/>య్యే అవకాశం కల్పించింది. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]]<nowiki/>కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలో స్థానం పొందాడు. 1976 –77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితిలో జరిగిన దురాగతాల విషయంలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]]<nowiki/>లోను మిగతా కాంగ్రెసు నాయకుల వలెనే అతను కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అనేక మంత్రి స్థాయి పదవులు నిర్వర్తించిన ముఖర్జీ సేవలు 1982–84 లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పనిచెయ్యడంతోముగిసాయి. 1980–85 లో రాజ్యసభ నాయకునిగా పనిచేసాడు.
 
1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్‌ [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినా [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌ గాంధీ]] హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో [[ఇందిరా గాంధీ హత్య]] తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌గాంధీ]]<nowiki/>తో రాజీ కుదరడంతో తన పార్టీని [[కాంగ్రెసు|కాంగ్రెస్‌]]<nowiki/>లో విలీనం చేశాడు. 1991లో [[రాజీవ్ గాంధీ హత్య]] జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రణబ్‌ను నియమించిన [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ అప్పటి నుంచీ కేబినెట్‌లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. [[సోనియా గాంధీ|సోనియా]] రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు.
 
అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖకు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో తాను రాజీనామా చేసేవరకు [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్నాడు.
పంక్తి 86:
 
== జీవిత విశేషాలు ==
ప్రణబ్ ముఖర్జీ [[డిసెంబర్ 11|డిసెంబరు 11]], [[1935]]<nowiki/>న [[పశ్చిమ బెంగాల్]] లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.<ref>{{cite news|url=http://www.hindustantimes.com/india-news/protocol-to-keep-president-pranab-off-puja-customs/article1-943150.aspx|title=Protocol to keep President Pranab off Puja customs|date=11 October 2011|work=Hindustan Times|accessdate=12 July 2012}}</ref> అతని తండ్రి కమద కింకర ముఖర్జీ [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్యోద్యమం]]<nowiki/>లో క్రియాశీల సభ్యుడు. అతని తండ్రి 1952 నుండి 1964 వరకు [[పశ్చిమ బెంగాల్]] లెజిస్లేటివ్ కౌన్సిల్ లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున సభ్యునిగా, ఎ. ఐ. సి. సి సభ్యునిగా ఉన్నాడు. అతని తల్లి రాజ్యలక్ష్మీ ముఖర్జీ.<ref name="NDTV">{{cite web|url=http://www.ndtv.com/article/people/who-is-pranab-mukherjee-231318|title=Who is Pranab Mukherjee?|date=15 June 2012|accessdate=11 July 2012|publisher=NDTV}}</ref><ref name="PMI">{{cite web|url=http://www.pranabmukherjee.in/|title=Biography|accessdate=11 July 2012|publisher=Pranab Mukherjee|archiveurl=https://web.archive.org/web/20100904170154/http://www.pranabmukherjee.in/|archivedate=4 September 2010}}</ref><ref name="europe.eu">{{cite web|url=http://www.feps-europe.eu/assets/5351e32e-1422-4ba2-b339-2dea6d38ddb1/2012%2007%2025%20pranab%20mukherjee%20-%2013th%20president%20of%20india%20-%20kv.pdf|title=About Pranab Mukherjee|date=22 June 2012|accessdate=11 July 2012|publisher=Europe.eu|website=|archive-url=https://web.archive.org/web/20150924011809/http://www.feps-europe.eu/assets/5351e32e-1422-4ba2-b339-2dea6d38ddb1/2012%2007%2025%20pranab%20mukherjee%20-%2013th%20president%20of%20india%20-%20kv.pdf|archive-date=24 సెప్టెంబర్ 2015|url-status=dead}}</ref>
 
అప్పటి కాలంలో [[కలకత్తా విశ్వవిద్యాలయం|కలకత్తా విశ్వవిద్యాలయా]]<nowiki/>నికి అనుబంధంగా ఉన్న సూరి (బిర్భుమ్) లోని సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివాడు. <ref name="GOVT">{{cite web|url=http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4195|title=Shri Pranab Mukherjee|accessdate=11 July 2012|publisher=Government of India|archiveurl=https://web.archive.org/web/20110514145924/http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4195|archivedate=2011-05-14}}</ref> తరువాత [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]], చరిత్రలో ఎం.ఎ. చేసాడు. [[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందాడు.<ref name="PMI" />
 
అతను 1963 లో కలకత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (తపాలా, టెలిగ్రాఫ్) కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యు. డి. సి) ఉద్యోగంలో చేరాడు. తరువాత విద్యానగర్ కళాశాలలో [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]] బోధించే అధ్యాపకునిగా విధులను నిర్వర్తించాడు.<ref name="No_surprises">{{cite web|url=http://www.tehelka.co/story_main53.asp?filename=Ws260612Presidential_polls.asp|title=Tehelka - India's Independent Weekly News Magazine|accessdate=29 June 2015|publisher=}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> అతను రాజకీయాలలోనికి రాక పూర్వం దేషెర్ దక్ పత్రికకు [[విలేఖరి|జర్నలిస్టు]]<nowiki/>గా ఉండేవాడు.<ref name="IE2">{{cite web|url=http://www.indianexpress.com/news/fm-pranabs-first-priority-presenting-budget-0910/464858/0|title=FM Pranab's first priority: Presenting budget 09-10|date=23 May 2009|accessdate=23 May 2009|work=The Indian Express}}</ref>
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
1969 లో మిడ్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి [[వి. కె. కృష్ణ మేనన్]]కు ప్రచార బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం ప్రారంభమయింది. అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ]] అతని ప్రతిభను గుర్తించి [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీలో స్థానం కల్పించింది. <ref name="Footsteps of Pranab">{{cite web|url=http://www.mathrubhumi.com/english/story.php?id=125466|title=Footsteps of Pranab|date=29 June 2012|accessdate=11 July 2012|publisher=Mathrubhumi|archiveurl=https://web.archive.org/web/20120711090242/http://www.mathrubhumi.com/english/story.php?id=125466|archivedate=11 July 2012|url-status=dead|df=dmy-all}}</ref> అతను 1969 లో [[భారత పార్లమెంటు|భారత పార్లెమెంటు]]<nowiki/>లో [[రాజ్యసభ]]<nowiki/>కు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చాడు.<ref name="GOVT" /> గాంధీ కుటుంబ విధేయునిగా అతను తనకు తాను "అన్ని ఋతువులలో మనిషి"గా అభివర్ణించుకున్నాడు. <ref name="Pranab Mukherjee's USP for President: sheer experience">{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-mukherjee-and-the-wealth-of-experience/254613-3.html|title=Pranab Mukherjee's USP for President: sheer experience|date=4 May 2012|accessdate=11 July 2012|work=ibnlive}}</ref> 1973లో తొలిసారిగా [[ఇందిరా గాంధీ]] కేబినెట్ లో పరిశ్రమల అభివృద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం వేగంగా ఎదిగింది. 1975–77 లలో వివాదాస్పద అంతర్గత అత్యవసర పరిస్థితి వచ్చినపుడు అతను కేబినెట్ లో క్రియాశీలకంగా ఉన్నాడు.
 
"సాంప్రదాయిక పరిపాలన నియమాలు, నిబంధనలను ఉల్లంఘించినందున" అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయనాయకులతో పాటు ముఖర్జీ కూడా అరోపణలు ఎదుర్కొన్నాడు. తరువాత జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కొత్తగా ఏర్పడిన జనతా ప్రభుత్వం ముఖర్జీపై నేరారోపణ చేస్తూ షా కమిషన్ ను నియమించింది. అయితే, 1979లో ఆ కమిషనే తన "అధికార పరిధిని అతిక్రమించిందని" ఆరోపణలు ఎదుర్కొంది. తనపై వచ్చిన ఆరోపణల నుంచి ముఖర్జీ సురక్షితంగా బయటపడ్డాడు. తరువాత 1982 నుండి 1984 మధ్య ఆర్థిక మంత్రిగా తన సేవలనంచించాడు.<ref name="Mitra">{{cite web|url=http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|title=The tallest short man|accessdate=27 February 2010|work=Sumit Mitra|publisher=The Hindustan Times, 26 February 2010|archiveurl=https://web.archive.org/web/20100305062958/http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|archivedate=5 March 2010|url-status=dead|df=dmy-all}}</ref><ref>[http://www.expressindia.com/ie/daily/20000704/ina04002.html How they buried Shah Commission report, even without an epitaph] Indian Express – 4 July 2000</ref>
 
ప్రభుత్వ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంలో అతని పనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇది భారత దేశానికి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యని]]<nowiki/>ధి (ఐ.ఎం.ఎఫ్) మొదటి ఋణం చివరి వాయిదా సొమ్ము రావడానికి దోహదపడింది.<ref name="Baru"/> ఒక ఆర్థిక మంత్రిగా అతను [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నరు]]గా [[మన్మోహన్ సింగ్]]ను నియమించే పత్రంపై సంతకం చేసాడు.<ref name="Footsteps of Pranab" />
 
1979లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ నాయకునిగా ఉన్నాడు. 1980లో సభా నాయకుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టాడు. <ref name="GOVT" />
పంక్తి 140:
[[దస్త్రం:Pranab_Mukherhee_escorts_Donald_H._Rumsfeld.jpg|కుడి|thumb|2004లో న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ భవనంలో డిఫెన్స్ సెక్రటరీ డోనాల్డ్ హెచ్. రమ్స్‌ఫెల్డ్ వెంట ఉన్న ముఖర్జీ ]]2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీని రక్షణ మత్రిగా నియమించింది. అతను 2006 వరకు ఈ శాఖా బాధ్యతలను చేపట్టాడు. అతను తన పదవీకాలంలో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]]తో సహకారాన్ని విస్తరించాడు. 2005 జూన్ లో ముఖర్జీ 10 సంవత్సరాల ఇండో-యుఎస్ డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేసాడు. <ref name="TOI">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-09-06/india/30118195_1_logistics-support-agreement-communication-interoperability-geo-spatial-cooperation|title=US preferred Pranab Mukherjee over AK Antony as defence minister|date=6 September 2011|work=Times of India|accessdate=12 July 2012}}</ref> యునైటెడ్ స్టేట్స్ తో సహకారం పెరుగుతున్నప్పటికీ, రష్యా భారతదేశ 'అగ్రశ్రేణి' రక్షణ భాగస్వామిగా ఉండేవిధంగా ముఖర్జీ సంబంధాలను కొనసాగించాడు.
 
అక్టోబరు 2005 లో భారతదేశంతోని [[రాజస్థాన్|రాజస్థాన్‌]]<nowiki/>లో మొదటి ఉమ్మడి వ్యతిరేక తీవ్రవాద యుద్ధ ఎత్తుగడలను రష్యా నిర్వహించింది. ఈ సమయంలో ముఖర్జీ, రష్యా రక్షణ మంత్రి సెర్జెల్ ఇవనోవ్ లు ఒక భారీ మోర్టార్ వారి వేదిక నుండి కొన్ని మీటర్ల పడిన దూరంలో పడిన సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు.<ref name="SW">{{cite web|url=http://www.spacewar.com/news/india-05zzs.html|title=Russia Hails Defence Cooperation With India|date=15 November 2005|accessdate=9 August 2012|publisher=Spacewar}}</ref>
 
=== విదేశీ వ్యవహారాల మంత్రి ===
పంక్తి 146:
ముఖర్జీ 1995 లో విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమింపబడ్డాడు. అతని నాయకత్వంలో ప్రధాని నరసింహారావు ప్రారంభించిన "లుక్ ఈస్ట్ ఫారిన్ పాలసీ"లో భాగంగా పశ్చిమాసియా దేశాల అసోసియేషన్ కు "పూర్తి సంభాషణ భాగస్వామి"గా తయారయ్యాడు. 1996లో అతను ఈ స్థానాన్ని విడిచిపెట్టాడు.
 
2006లో ముఖర్జీ రెండవ సారి ఈ పదవిని చేపట్టాడు. అతను [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రా]]<nowiki/>ల ప్రభుత్వంలో "యు.ఎస్-ఇండియా సివిల్ నూక్లియర్ అక్రిమెంటు" పై సంతకం చేసాడు. 2006 ఆగస్టులో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఈ ఒప్పందం <nowiki>''</nowiki>పూర్తి స్థాయి పౌర అణు సహకారానికి<nowiki>''</nowiki> అంటే అణు ఇంధనం, అణు రియాక్టర్ల నుంచి ఉపయోగించిన ఇంధన రీప్రాసెస్‌ వరకూ అంటే పూర్తి స్థాయి అణు ఇంధన చక్రంలోని అన్ని అంశాలకు సంబంధించి హామీ కల్పిస్తుందని పార్లమెంటుకు హామీ ఇచ్చాడు. అయితే వాస్తవానికి, అటువంటి పూర్తి స్థాయి అణు సహకారానికి హామీ ఏమీ ఇవ్వలేదని సంతకాలు జరిగిన 123 ఒప్పందం ద్వారా స్పష్టమైంది. దానికి బదులుగా, పూర్తి స్థాయి అంతర్జాతీయ రక్షణలు వున్నప్పటికీ అణు సరఫరాదారుల గ్రూపుతో కలిసి అమెరికా <nowiki>''</nowiki>ఎన్‌రిచ్‌మెంట్‌, రీప్రాసెసింగ్‌ పరిజ్ఞానానికి<nowiki>''</nowiki> సంబంధించిన సాంకేతికతను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. సాంకేతిక పరిజ్ఞానం నిరాకరణ ఇలానే కొనసాగుతోంది. రక్షణ సహకార ఒప్పందం కింద కూడా సున్నితమైన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంపై ఆంక్షలు తొలగింపచేయడంలో భారత్‌ విఫలమైంది.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/net-vyaasam/72645|title=అణు ఒప్పందం ఓ ధృతరాష్ట్రుడి కౌగిలి|website=www.navatelangana.com|www.NavaTelangana.com|access-date=2018-05-15}}</ref>
 
[[26/11 ముంబై పై దాడి|2008 ముంబయి దాడుల]] తరువాత [[పాకిస్తాన్]] పై ప్రపంచ అభిప్రాయాన్ని సమీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. <ref name="IE2" />
పంక్తి 159:
ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని మెరుగుపరుచుకోవటానికి, భారతదేశ మొట్టమొదటి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యనిథి]] అందిస్తున్న ఋణం చివరి విడతకు విజయవంతంగా తిరిగి రాబట్టడానికి అతను కృషిచేసాడు. <ref name="Baru"/> ఆతను 1982 లో [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నర్]]గా [[మన్మోహన్ సింగ్]] నియామక పత్రంపై సంతకం చేసాడు. <ref name="Footsteps of Pranab" /> అంబానీ-వాడియా పారిశ్రామిక కలహాలలో తను పోత్సాహం ఉన్నట్లు ఆరోపింపబడ్డాడు.<ref name="Aggarwal 1990">{{Cite book|url=https://books.google.com/?id=m0ZUwtiTCKYC&dq=Investigative+journalism+in+India|title=The Investigative journalism in India|last=Aggarwal|first=S. K.|publisher=Mittal Publications|year=1990|isbn=978-81-7099-224-0|postscript=<!-- Bot inserted parameter. Either remove it; or change its value to "." for the cite to end in a ".", as necessary. -->{{inconsistent citations}}|accessdate=10 October 2011}}</ref> భారతీయ ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదట సంస్కర్తగా ప్రణబ్ ముఖర్జీ గుర్తింపు పొందాడు. 1980లలో అతను [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]], [[మన్మోహన్ సింగ్|మన్‌మోహన్ సింగ్]] అధ్వర్యంలో ముఖర్జీ అప్పటి పారిశ్రామిక వంత్రి ఛరణ్‌జిత్ ఛనానాతో కలసి సరళీకృత విధానాలను ప్రారంభించినట్లు "ఇండియా టుడే" పత్రిక ప్రచురించింది.<ref name="IT" /> వామపక్ష పత్రిక "ముఖర్జీ ధూమపానం నుండి సోషలిజం పెరగలేదు" అని వ్యాఖ్యానించింది. <ref name="IT" />
 
1984లో [[రాజీవ్ గాంధీ]]<nowiki/>చే ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి తొలగించబడ్డాడు. భారతదేశాన్ని పాలించడానికి తన సొంత బృందాన్ని తీసుకురావాలని రాజీవ్ గాంధీ కోరుకున్నాడు. <ref name="TET" /> ప్రపంచంలోఅత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వేలో గుర్తించబడినప్పటికీ అతనిని పదవి నుండి తొలగించారు. <ref name="Baru" />
 
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టాడు. అతడు ప్లానింగ్ కమిషనుకు డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడ్డాడు. భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి, డిప్యూటీ చైర్ పర్సన్ స్థానం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 1991-96 మధ్య అతని పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలను లైసెన్సు రాజ్ వ్యవస్థ ముగిసే వరకు చేసాడు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగపరచడానికి దోహదపడింది.<ref name="BBC1">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3725357.stm|title=India's architect of reforms|last=Biswas|first=Soutik|date=14 October 2005|publisher=BBC News|accessdate=11 December 2008}}</ref>[[దస్త్రం:Pranab_Mukherjee_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009.jpg|thumb|2009లో న్యూఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సమ్మేళన్ లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ i]]
పంక్తి 176:
 
=== ఇతర స్థానాలు ===
[[దస్త్రం:President_Obama_and_the_First_Lady_with_Indian_President_Mukherjee_and_Vice-President_Ansari.jpg|thumb|[[బరాక్ ఒబామా]], మిచెల్లీ ఒబామా, [[ముహమ్మద్ హమీద్ అన్సారి|మొహమ్మద్ అన్సారీ]]<nowiki/>లతో ప్రబబ్ ముఖర్జీ ]]
ముఖర్జీ [[కోల్‌కాతా|కోల్‌కతా]] లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ కు చైర్మన్ గా ఉన్నాడు. అతను రవీంద్రభారతి విశ్వవిద్యాలయం, నిఖిల్ భారత్ బంగా సాహిత్య సమ్మేళన్ లకు చైర్మన్, అధ్యక్ష బాధ్యతనను నిర్వహించాడు. అతను భంగియా సాహిత్య పరిషత్ కు పూర్వపు ట్రస్టీ సభ్యునిగా ఉన్నాడు. ఆసియాటిక్ సొసైటీ ప్లానింగ్ బోర్డుకు తన సేవలనంచించాడు.<ref name="GOVT"/>
 
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు