బాల సాహిత్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
బాలల సాహిత్యాన్ని నిర్వచించడం చాల క్లిష్టమైన పని. ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వారినందరినీ [[పిల్లలు|బాలల]] కిందే పరిగణిస్తారు. భిన్న వయస్సు కల బాలలు భిన్న రకాలైన పుస్తకాలను చదువుతారు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లలు చిత్రపటాలు చూస్తూ [[భాష]]<nowiki/>ను నేర్చుకోవదానికి ప్రయత్నం చేస్తారు. కానీ టీనేజి పిల్లలు కాల్పనిక సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. సాధారణంగా బాలల కోసం వ్రాయబడిన, ప్రచురితమైన సాహిత్యాన్ని [[బాల సాహిత్యం]]<nowiki/>గా నిర్వచించవచ్చు.
==తెలుగు భాషలో బాలసాహిత్యం==
పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చు. నాచన సోమనాథుడు, [[శ్రీనాథుడు]], మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కన్పిస్తాయి<ref>[http://www.namasthetelangaana.com/editpage/article.aspx?category=4&subCategory=1&ContentId=490490 బాల సాహిత్య వైశిష్ట్యం- పెందోట వెంకటేశ్వర్లు]</ref>.
 
[[మహా భారతము|మహాభారతం]], [[రామాయణము|రామాయణం]], [[బసవపురాణం]], కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం [[కాశీమజిలీ కథలు|కాశీ మజిలీ]] కథలు, [[పంచతంత్రం|పంచతంత్ర]] కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది. [[పాట|గేయ]], [[పద్య కవిత|పద్య]], గద్య, రూపాలలో [[బాల సాహిత్యం]] కన్పిస్తున్నది. చిన్నయ సూరి [[నీతిచంద్రిక]]<nowiki/>లో కథలుగా వ్రాశాడు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
 
==కొందరు ప్రముఖ బాల సాహిత్యకారులు==
"https://te.wikipedia.org/wiki/బాల_సాహిత్యం" నుండి వెలికితీశారు