బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
 
==జీవిత ప్రథమార్థం==
ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్ని [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[హిందీ]] భాషల్లో తీసిన రంగాగారి పూర్తి పేరు '''బిండిగణవలే శ్రీనివాస అయ్యంగార్ రంగా'''. ఆయన 1917, నవంబరు 11న అప్పటి మైసూరు రాజ్యంలోని [[బెంగుళూరు]] సమీపములోని మగడి గ్రామంలో జన్మించారు. ఆయన [[మాతృభాష]] కన్నడం. చదువుకుంటూనే ఫోటోగ్రఫీ మీద శ్రద్ధ చూపించి ఆ కళలో కృషి చేశారు. 17వ ఏటనే ఆయన తీసిన ఛాయాచిత్రాలు రాయల్ సెలూన్ ఆఫ్ [[లండన్|లండన్‌]]<nowiki/>లో ప్రదర్శితమయ్యాయి. ఫెలో ఆఫ్ ది రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీగా ఎన్నికయ్యారాయన. దేశాలు పర్యటీంచి, ఛాయాచిత్రాల నాణ్యతను పరిశీలించి, [[బొంబాయి]] చేరి సినిమాటోగ్రఫిలో చేరారు. ఆ సమయంలోనే స్క్రిప్ట్ రయిటింగ్ మీద అధ్యయనం చేశారు. కొన్ని కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలకు [[ఛాయాగ్రాహకుడు]]<nowiki/>గా పనిచేసి, దర్శకనిర్మాతగా, స్టూడియో అధిపతిగా మారారు. [[విక్రమ్‌ ప్రొడక్షన్స్‌]] పేరిట [[మా గోపి]] (1954), [[భక్త మార్కండేయ]] (1955), [[తెనాలి రామకృష్ణ]] (1956), [[కుటుంబ గౌరవం]] (1957), పెళ్ళి తాంబూలం (1961), [[అమరశిల్పి జక్కన్న]] (1964), [[వసంతసేన]] (1967) వంటి చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలలో కొన్నింటిని [[కన్నడ భాష|కన్నడం]]<nowiki/>లోనూ, [[తమిళ భాష|తమిళం]]<nowiki/>లోనూ తీశారు. అసలు 1940లోనే ఆయన పరదేశి, ప్యాస్, ప్రకాష్ అనే హిందీ చిత్రాలు డైరెక్టు చేశారు.
 
మొదట్లో జెమిని స్టూడియోలో కొంతకాలం పనిచేసి, తరువాత విక్రమ్ స్టూడియో ఆరంభించారు. అక్కినేని నాగేశ్వరావు, [[ఎన్.టి.రామారావు]], [[శివాజీ గణేశన్]], [[రాజ్‌కుమార్]], [[ఎం.జి.రామచంద్రన్]], కల్యాణ్ కుమార్ మొదలైన నటులందరితోనూ రంగా చిత్రాలు తీశారు. రంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్ కలర్ లాబొరేటరీని నెలకొల్పారు. ఈ లాబొరేటరీ బెంగళూరు సమీపంలోని నయనదహళ్లి అనే ఊర్లో ఉండేది. వాహినీ స్టూడియోలోని లాబొరేటరీ అధిపతిగా పనిచేసిన సేన్‌గుప్తాప్త మొదట్లో అక్కడే పనిచేసేవారు. [[బి.యన్.రెడ్డి]] గారి సలహాతో రంగాగారు లాబొరేటరీని [[మద్రాసు]]కు మార్చారు. అప్పుడే సేన్‌గుప్తా వాహినీలో చేరారు. కన్నడంలో తొలి వర్ణ చిత్రం అమరశిల్పి జక్కనాచారి, అది నిర్మించిన ఘనత కూడా రంగాగారిదే. అప్పట్లో ఆ చిత్ర నిర్మాణానికి కేవలం 11 లక్షల రూపాయిలు మాత్రమే వ్యయమయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు