బొల్లిముంత శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కొండేపూడి సాహితీ సత్కార గ్రహీతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 52:
బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనులమీద తిరుగుతూ [[మునగాల]] పరగణాలోని [[జగ్గయ్య పేట]]కు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన యువకుడు బొల్లిముంత ఇరవై ఏడేళ్ళ వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధులై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది భాగస్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల, తిరునగరి, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ అక్షరాయుధాలతో ముందు నిలిచారు.
 
తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టోబరు 25న విడుదల చేశారు. ఒక రకంగా కవుల కంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టికోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’, మహీధర రామ్మోహనరావు ‘ఓనమాలు’, మృత్యు నీడల్లో’, తిరునగరి ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ ‘సింహ గర్జన’. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కానీ నాటి తెలంగాణలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పడించాల్సి వచ్చేది. అంతటి దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది మృత్యుంజయులు నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని దిన దిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లోని ముఖ్య పాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి.అంటే వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించినవారు, మృత్యుంజయులు అని అర్ధం. తెలంగాణ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజా పోరాటాన్ని నమోదు చేసిన నవలగా [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లో మృత్యుంజయులు నవలకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరు సార్లు తిరగరాయించారట! [[రావి నారాయణ రెడ్డి]] ఈ నవలకు ముందు మాట రాశారు.
==సినీ రచయితగా==
1964లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడుగా మద్రాసు వెళ్ళారు. మొదట్లో తమిళ సినిమాలకు అనువాదాలు చేస్తుండేవారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలో పెద్ద హిట్టయ్యింది. దాంతో బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సి వచ్చింది. సుమారు నలభై ఐదు సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని [[పాటలు]] కూడా రాశారు. ‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.