బ్రహ్మచారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{అయోమయం}}
బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిని '''బ్రహ్మచారి''' అంటారు. మనస్సూ, శరీరం ఆరోగ్యంగా ఉంచి ఉన్నత శిఖరాలకు అధిరోహింపజేసేది [[బ్రహ్మచర్యం]]. కనుకనే మానవులు ఆచరింపవలసిన చతుర్విధ కర్మలలో బ్రహ్మచర్యాన్ని మొదట చెబుతారు. బ్రహ్మచర్యం స్త్రీ పురుష సంబంధానికి మాత్రమే చెందినది కాదు. బ్రహ్మచర్యమనేది ఒక జీవన విధానం. తమ ఎనిమిదో ఏట ఆచార్యుని ఉపదేశం పొందినప్పటి నుంచి బాలకుల్ని [[బ్రహ్మచారులు|బ్రహ్మచారు]]<nowiki/>లుగా, బాలికలని బ్రహ్మచారిణులుగా పిలుస్తారు. వారు [[గురుకులం]]<nowiki/>లో ఉన్న మొదటి మూడు రోజులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. బ్రహ్మచర్యాశ్రమంలో అమ్మాయి బాగా చదువుకొని యువావస్థను పొందిన తర్వాతే యువకుణ్ణి వివాహమాడాలి. అబ్బాయి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి, సుశీల అయిన యువతిని [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడాలి. <br />
బ్రహ్మచారి దినచర్య కఠినమైనది. అతడు సూర్యోదయానికి తర్వాతగానీ, సూర్యాస్తమయానికి ముందుగానీ నిద్రించరాదు. బ్రహ్మచర్యం ఎనిమిదో ఏట మొదలై వివాహం వరకు ఉంటుంది. ఈ కాలంలో విద్యాబోధన ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. విద్యలో గొప్పవాడై సమాజానికి ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం సమయంలో ఇంద్రియ నిగ్రహం కావాలి. అందుకు తగ్గటు ఆహారాది నియమాలను పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్య సమయంలో ఆరోగ్యవంతంగా, శక్తివంతంగాను, పుష్టిగానూ ఉండాలి. తల్లి, తండ్రి, ఆచార్యుడు ఎంత కష్ట స్థితిలో ఉన్నా వారిని ఆదుకోవాలిగానీ వారిని నిందించరాదు. ఆచార్యుడు బ్రహ్మకు ప్రతిరూపం. బ్రహ్మ ఏవిధంగా తన శిష్యులకు వేదాన్ని బోధించాడో, అదే విధంగా ఆచార్యుడు వేదోపదేశం చేస్తాడు కాబట్టి అతడిని బ్రహ్మలాగా గౌరవించాలి. తల్లి తనను నవమాసాలు గర్భంలో ధరించి రక్షిస్తుంది కనుక ఆమెను పృథ్విలాగా గౌరవించాలి. ఆచార్యునితో పాటు తల్లితండ్రులకు బ్రహ్మచారులెప్పుడూ ప్రియమే ఆచరించాలి. వారు ముగ్గురూ సంతోషిస్తే బ్రహ్మచారి దీక్ష ఫలించినట్లే.
 
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మచారి" నుండి వెలికితీశారు