భావ కవిత్వం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 2:
'''భావ కవిత్వము''' (Lyrical poetry) నకు తత్త్వదృష్టిలో మాతృక '''కాల్పనిక కవిత్వం''' (Romantic poetry). దీనిని ఆంగ్లములో "లిరికల్ పోయిట్రీ" అన్నారు. లైర్ (Lyre) అనే వాద్య విశేషముతో పాడే [[కవిత]] కావున దీనికి "లిరిక్ పోయిట్రీ" (Lyric poetry) అనే పేరు వచ్చినది.
 
భావ కవిత్వము అనుపదము శ్రీ [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] గారిచే ప్రప్రథమమున వాడబడినదని శ్రీ[[రాయప్రోలు సుబ్బారావు]] గారు [[రాజమహేంద్రవరము]] ([[రాజమండ్రి]]) న జరిగిన ద్వితీయ అభినవాంధ్ర కవిపండిత సమావేశమందు చెప్పియున్నారు. ఆసమావేశమునే మాట్లాడుచు శ్రీశివశంకరశాస్త్రిగారు 'ఆత్మగౌరవము' అనుపదమునందువలనే 'భావకవిత్వం' అనుపదమునందున తమకు అభిమానము లేదనియు, ఆ [[పదములు|పదము]]<nowiki/>ను ఈనాటి [[కవిత]]కు వాడరాదనియు చెప్పియున్నారు.
 
భావకవిత్వమనుదానిని శ్రీ[[రాయప్రోలు సుబ్బారావు]] గారే ప్రారంభించిరి. అటుపై శ్రీ[[కృష్ణ శాస్త్రి]]గారిరందు పరమావధిని గాంచినదని చెప్పవచ్చును. వారి అనుకరించినవారు ఇప్పుడు చాలామంది యున్నారు. అటుపై కొద్ది కాలములోనే భావ [[కవిత్వము]] ప్రజాభిమతప్రాయమైనదని చెప్పవచ్చును. కానె కొంతమంది దీనిని యేవగించుకొనినారు. ఇందులకు ఒకటి రెండు కారణములు ఉన్నాయి. మొదటిది అర్ధములేని పదాడంబరము ఎక్కువుగా నుండుట. రెండవది ఏవిధమయిన సందరభము తెలియపరచకుండా అనిర్దిష్టమయినదేదియో భావమును విషయముగా చేసుకొని చెప్పుట. ఈ రెండు కారణములలో మొదటిదానివలన పండితులయినవారలకు భావకవిత్వమునందు అనిష్టత కలగినది. రెండవ కారణమువలన జన సామాన్యమునకు భావ కవిత్వమును [[అర్ధము]] చేసుకొనుట కష్టమై దానిపై అనిష్టిత ఏర్పడినది. ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనుచున్న వారు తిక్కనాదులు చెప్పిన కవిత్వములో భావము లేడా? భావము లేని కవిత్వముండునా ? కావునా భావ కవిత్వము అను పదము నందే అర్ధము లేదని వాదించెడివారును కలరు. అది ఒక వేళాకోళపుమాట అని కొందరనుచున్నెడివారు.
"https://te.wikipedia.org/wiki/భావ_కవిత్వం" నుండి వెలికితీశారు