భూమి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 95:
సౌరకుటుంబం లోని గ్రహాల్లో '''భూమి''' ఒకటి. [[సూర్యుడు|సూర్యుడి]] నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది.<ref name="USGS1997">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|accessdate=10 January 2006|publisher=U.S. Geological Survey|year=1997|archiveurl=https://web.archive.org/web/20051223072700/http://pubs.usgs.gov/gip/geotime/age.html|archivedate=23 December 2005|url-status=live}}</ref><ref>{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Special Publications, Geological Society of London|year=2001|volume=190|issue=1|pages=205–21|doi=10.1144/GSL.SP.2001.190.01.14|bibcode=2001GSLSP.190..205D}}</ref><ref>{{cite journal|author=Manhesa, Gérard|author2=Allègre, Claude J.|author3=Dupréa, Bernard|author4=Hamelin, Bruno|last-author-amp=yes|title=Lead isotope study of basic-ultrabasic layered complexes: Speculations about the age of the earth and primitive mantle characteristics|journal=[[Earth and Planetary Science Letters]]|year=1980|volume=47|issue=3|pages=370–82|doi=10.1016/0012-821X(80)90024-2|bibcode=1980E&PSL..47..370M}}</ref> భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై, ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.
 
భూమి భ్రమణాక్షం దాన్ని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక, వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి.<ref name="yoder1995"><cite class="citation book">Yoder, Charles F. (1995). [https://web.archive.org/web/20090707224616/http://www.agu.org/reference/gephys/4_yoder.pdf "Astrometric and Geodetic Properties of Earth and the Solar System"] <span class="cs1-format">(PDF)</span>. In T. J. Ahrens. [http://www.agu.org/reference/gephys/4_yoder.pdf ''Global Earth Physics: A Handbook of Physical Constants''] <span class="cs1-format">(PDF)</span>. ''Global Earth Physics: A Handbook of Physical Constants''. Washington: American Geophysical Union. p.&nbsp;8. [[Bibcode]]:[[bibcode:1995geph.conf.....A|1995geph.conf.....A]]. [[International Standard Book Number|ISBN]]&nbsp;[[Special:BookSources/978-0-87590-851-9|978-0-87590-851-9]]. Archived from the original on 7 July 2009.</cite><span class="citation-comment" style="display:none; color:#33aa33; margin-left:0.3em">CS1 maint: BOT: original-url status unknown ([[:Category:CS1 maint: BOT: original-url status unknown|link]]) </span></ref> భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్ష్యలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూ భ్రమణ వేగం క్రమేపీ తగ్గుతోంది.<ref name="aaa428_261"><cite class="citation journal">Laskar, J.; et al. (2004). [https://hal.archives-ouvertes.fr/hal-00001603/document "A long-term numerical solution for the insolation quantities of the Earth"]. ''Astronomy and Astrophysics''. '''428''' (1): 261–85. [[Bibcode]]:[[bibcode:2004A&A...428..261L|2004A&#x26;A...428..261L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1051/0004-6361:20041335|10.1051/0004-6361:20041335]].</cite></ref> భూమి, [[సౌర కుటుంబం|సౌరవ్యవస్థ]]<nowiki/>లో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. సౌరవ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ (టెరెస్ట్రియల్ ప్లానెట్స్) ఇది అతి పెద్దది.<ref>{{cite news|url=https://www.universetoday.com/36935/density-of-the-planets/|title=How Dense Are The Planets?|last=Williams|first=Matt|date=17 February 2016|work=Universe Today|accessdate=24 November 2018}}</ref>
 
భూగోళపు బయటి పొరను [[పలక విరూపణ సిద్ధాంతం|ఫలకాలుగా]] (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా కదులుతూ ఉన్నాయి. భూమి ఉపరితలం దాదాపు 71 శాతం నీటితో కప్పబడి ఉంది.<ref>{{cite web|url=http://www.noaa.gov/ocean.html|title=Ocean|accessdate=3 May 2013|website=NOAA.gov|author=National Oceanic and Atmospheric Administration}}</ref> మిగిలిన భాగంలో ఖండాలు, [[ద్వీపం|ద్వీపాలూ]] ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా గాని, బాగా చల్లగా గానీ ఉంటాయి. అయితే పూర్వం [[అంగారకుడు|అంగారక గ్రహం]]<nowiki/>పై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించారు. ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి.
 
భూమి ధ్రువాల్లో అధిక భాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది. అంటార్కిటికా మంచు ఫలకం, ఆర్కిటిక్ సముద్రపు మంచు పలకలూ ఇందులో భాగం. భూమి అంతర్భాగంలో ఇనుముతో కూడిన కోర్ (గర్భం), దాని చుట్టూ ద్రవ ఇనుముతో ఉండే బాహ్య గర్భం ఉన్నాయి. ఈ ద్రవ ఇనుము కారణంగా భూమికి అయస్కాంత శక్తి ఏర్పడింది. బాహ్య గర్భం వెలుపల మ్యాంటిల్ ఉంటుంది. ఇదే టెక్టోనిక్ ప్లేట్లకు చలనం కలిగిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు