మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 36:
}}
 
'''మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి''' ([[మార్చి 5]], [[1920]] - [[నవంబర్ 7]], [[1992]]) తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు [[సాహిత్యం]]<nowiki/>లో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. ఆంధ్ర కల్హణ, [[కళా ప్రపూర్ణ]] బిరుదాంకితుడు.ఇతడు [[సిధ్ధార్థి]] నామ సంవత్సరం [[ఫాల్గుణ పౌర్ణమి]]నాటికి సరి అయిన [[1920]], [[మార్చి 5]]వ తేదీన తన మాతామహుడైన ఆకొండి రామ్మూర్తిశాస్త్రి ఇంట్లో ఐలెండు [[పోలవరం]] గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి లచ్చమ్మ, తండ్రి సత్యన్నారాయణమూర్తి. ఇతని బాల్యం పల్లిపాలెం గ్రామంలో గడిచింది. మహేంద్రవాడ సుబ్బరాయశాస్త్రి, [[ఓలేటి వెంకటరామశాస్త్రి]]ల వద్ద కావ్య, వ్యాకరణాలు చదివాడు. ఆంధ్ర భాషమీద ఉన్న అపారమైన ఆభిమానంతో 1939లో ఆంధ్రి అనే మాసపత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక ఆనాటి పండితుల, పరిశోధకుల అభిమానం చూరగొంది. ఈ పత్రిక సాహిత్య మాసపత్రికలలో మేల్తరమైనది, అందలి ప్రతి వ్యాసానికి, కవితలకు శాస్త్రి పుటకు దిగువ ''పాద గమనికలు'' వ్రాసేవాడు. ఈ పాద గమనికలలో వ్యాసంకాని, కవిత కాని బాగుగా ఉంటే వానిని శ్లాఘించే వాడు, లేకపోతే ఎంతటి [[మహాకవి]] రచయైన శాస్త్రి విమర్శకు లోనుకావలసిందే.ఇందులో ఆనాడు లబ్ధ ప్రతిష్ఠులైన పండితులు, కవులు, రచయితలనేకుల రచనలు ముద్రింపబడ్డాయి. ఈ పత్రిక 1941 నవంబర్ వరకు నడిచింది. ఈయన 1940లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. 1940-44ల మధ్యకాలంలో 'సూర్యరాయాంధ్ర నిఘంటువు' నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1947లో ఆయన నివాసం [[రాజమండ్రి]]కి మార్చి వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరి 1974 వరకు అ పాఠశాలలోనే పనిచేసి పదవీవిరమణ చేశాడు. ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికిగాను ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆంధ్ర పురాణము, [[ఆంధ్ర రచయితలు]] ఆయన రాసిన ఇతర ప్రముఖ రచనలు.
 
ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్త్రి ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి పింగళి-కాటూరి కవుల [[సౌందరనందము]], [[దుర్భాక రాజశేఖర శతావధాని]] [[రాణా ప్రతాప సింహచరిత్ర]], శతావధాని [[గడియారం వేంకట శేషశాస్త్రి]] [[శ్రీ శివభారతము]], [[తుమ్మల సీతారామమూర్తి]] [[బాపూజీ ఆత్మకథ]] అనేవి. శాస్త్రి రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైనా సాహితీ విలువలు కలిగిన కావ్యం.