మసూమా బేగం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
 
== జననం ==
మసూమా బేగం [[1901]], [[అక్టోబరు 7]] న [[హైదరాబాదు]]<nowiki/>లో విద్యావంతుల [[కుటుంబం]]<nowiki/>లో జన్మించింది. ఈమె తండ్రి ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తల్లి [[తయ్యబా బేగం బిల్‌గ్రామీ|తయ్యబా బేగం]] భారతదేశపు [[ముస్లిం]] మహిళలలో తొలి పట్టభద్రురాలు.<ref name=hh_tyaba>{{cite web|title=Tyaba Begum Sahaba Bilgrami|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Tyaba-Begum-Sahaba-Bilgrami.aspx|website=HelloHyderabad.com|accessdate=3 November 2014|archive-url=https://web.archive.org/web/20160306120149/http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Tyaba-Begum-Sahaba-Bilgrami.aspx|archive-date=6 మార్చి 2016|url-status=dead}}</ref> ఈమె [[మాతామహుడు]] హైదరాబాదులో [[రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం|రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ]] స్థాపకుడైన ఇమాదుల్ ముల్క్ [[సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ]]. ఈమె సోదరుడు [[అలీ యావర్ జంగ్]] హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. మసూమా విద్యాభ్యాసం మహబూబీయా బాలికల పాఠశాలలో జరిగింది. వీరు ఇరవై సంవత్సరాల వయసులో 1921లో ఈమె తల్లి తయ్యబా బేగం మరణించడంతో, <ref name=hh_tyaba /> తల్లిచే స్థాపించబడిన "అంజుమన్-ఏ-ఖవాతీన్" అనే జాతీయ మహిళా సంస్థకు<ref name=ray>{{cite book|last1=Ray|first1=Bharati|title=Women of India: Colonial and Post-colonial Periods|date=Sep 15, 2005|publisher=SAGE Publications India|isbn=8132102649|page=569|url=http://books.google.com/books?id=142HAwAAQBAJ&pg=PA569&dq=anjuman-e-khawateen#v=onepage&q=anjuman-e-khawateen&f=false|accessdate=3 November 2014}}</ref> అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1927లో హైదరాబాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.
 
1922లో ఈమె ఆక్స్‌ఫర్డులో చదివి తిరిగివచ్చిన తన కజిన్ హుసేన్ అలీఖాన్‌ను పెళ్ళి చేసుకొంది.<ref name=srivastava>{{cite book|last1=Srivastava|first1=Gouri|title=The Legend Makers: Some Eminent Muslim Women of India|date=Jan 1, 2003|publisher=Concept Publishing Company|location=New Delhi|isbn=8180690016|pages=90-92|url=http://books.google.com/books?id=ERavqiLTu7cC&pg=PA91&lpg=PA91&dq=Masuma+Begum+anjuman#v=onepage&q=Masuma%20Begum%20anjuman&f=false|accessdate=3 November 2014}}</ref> ఈమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ ఆ తరువాతి కాలంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] శాఖాధిపతిగా పనిచేశారు. వీరికి ఐదుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) - అలీఖాన్, అనీస్ హస్నైన్, మీర్జా ఆసిఫ్ అలీఖాన్, నాసిర్ అలీఖాన్, రషీద్ అజర్ అలీఖాన్
 
ఈమె 1952లో శాలిబండ నియోజకవర్గం నుండి, 1957లో పత్తర్ ఘట్టీ నియోజకవర్గం నుండి [[శాసన సభ]]<nowiki/>కు ఎన్నికయ్యారు. ఈమె [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసింది. 1962లో తిరిగి పత్తర్‌ఘట్టి నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ|సలావుద్దీన్ ఒవైసీ]] చేతిలో ఓడిపోయింది.
 
ప్రపంచంలో ద్వేషం, అసూయ నిర్మూలించేందుకు [[ఐక్యరాజ్య సమితి]] ఏర్పాటు చేసిన సంఘంలో వీరు సభ్యురాలు.
"https://te.wikipedia.org/wiki/మసూమా_బేగం" నుండి వెలికితీశారు