మాధవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 13:
'''మాధవి''' ([[ఆంగ్లం]]: Madhavi) దక్షిణ [[భారత దేశం|భారత]] సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షిణాదిలోని నాలుగు భాషలు [[తెలుగు]], [[తమిళ్]], [[కన్నడ]], [[మళయాళం]] [[భాష|భాషా]] చిత్రాలతో పాటు అనేక [[హిందీ]] భాషా చిత్రాలలో కూడా నటించింది.
 
దర్శకుడు [[కె.బాలచందర్]] 1979లో అత్యద్భుత విజయం సాధించిన [[మరో చరిత్ర]] సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో "ఏక్ ధూజే కేలియే"గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ [[విజయం]] సాధించింది.
 
== తొలిదశ ==
 
మాధవి [[హైదరాబాదు]]లో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చిన్నతనంలోనే ఉమా మహేశ్వరి వద్ద [[భరతనాట్యం]], భట్ వద్ద [[జానపద నృత్యం]] నేర్చుకొని వేలాది [[నృత్యం|నృత్య]] ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె విద్యాభ్యాసం హైదరాబాదు అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.<ref>{{cite web |url=http://maadhavi.com/about_childhood.html |title=Maadhavi |publisher=Maadhavi |date= |accessdate=2012-06-09 |website= |archive-url=https://web.archive.org/web/20130114005440/http://maadhavi.com/about_childhood.html |archive-date=2013-01-14 |url-status=dead }}</ref> ఎనిమిదో తరగతి చదువుతుండగా [[రవీంద్రభారతి]]<nowiki/>లో నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని [[దాసరి నారాయణరావు]] చూసి, తను తీయబోయే కొత్త సినిమాకో నూతన నటి కావాలని ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సినిమా రంగంలో ప్రవేశపెట్టాడు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండటంతో కనక విజయలక్ష్మిని ఆయన 'మాధవి' అని సినీనామకరణం చేశాడు.<ref>[http://telugukichidi.blogspot.com/2012/09/blog-post.html ఐదో పడిలో అందాల భరిణ .... 'మాధవి' - కనకదుర్గ ఇంటర్వ్యూ]</ref>
 
1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి [[న్యూజెర్సీ]]లో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత, [[జర్మనీ|జర్మన్]] సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.<ref>http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html</ref>
"https://te.wikipedia.org/wiki/మాధవి" నుండి వెలికితీశారు