మాలిక్ మక్బూల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
 
[[బొమ్మ:Malik Maqbool tomb Delhi.jpg|250px|right|thumb|ఢిల్లీలో జీర్ణావస్థలో ఉన్న మాలిక్ మక్బూల్ సమాధి.]]
'''మాలిక్ మక్బూల్''' లేక '''దాది గన్నమ నాయుడు''' / యుగంధర్ (ఆంగ్లము: GannayanaayakuDu) కమ్మ దుర్జయ వంశము. [[కాకతీయ సామ్రాజ్యం|కాకతీయ]] ప్రభువైన [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] సేనాని. [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రు]]<nowiki/>ని ఓటమి తరువాత [[ఢిల్లీ]] సైన్యాలకు పట్టుబడి, అక్కడ [[ఇస్లాం మతం|మహ్మదీయ]] మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ [[ఓరుగల్లు]]కే పాలకునిగా వచ్చాడు. [[మారన]] రచించిన [[మార్కండేయ పురాణం]] గ్రంథాన్ని అంకితమొందినాడు.
 
గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు [[గణపతి దేవుడు|గణపతి దేవుని]] కడ, [[రుద్రమదేవి]] కడ సేనాధిపతిగా ఉన్నాడు. దాది వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు [[కాకతీయులు|కాకతీయ]] చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. [[కొత్త భావయ్య]] పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల.
పంక్తి 10:
1323వ సంవత్సరములో [[ముస్లిములు|ముస్లిముల]] ధాటికి [[ఓరుగల్లు]] తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు, పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కారు. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు [[నర్మదా నది]]లో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. [[ఢిల్లీ]] చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చింది. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట [[ఢిల్లీ]] సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడ్డాడు. సుల్తాను మక్బూల్ ను [[పంజాబ్]] పాలకునిగా ముల్తాను పంపాడు.
 
ఉలుఘ్ ఖాను ([[మహమ్మద్ బిన్ తుగ్లక్]]) [[ఓరుగల్లు]]<nowiki/>ను 1323లో [[దౌలతాబాదు]] అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచాడు. అటుపిమ్మట ముసునూరి నాయకుల విప్లవముతో తెలుగునాడు విముక్తమైంది. 1335లో [[మధుర]] సుల్తాను జలాలుద్దీను కూడా [[తిరుగుబాటు]] బావుటా ఎగురవేశాడు. ఇది సహించని తుగ్లకు పెద్దసైన్యముతో మక్బూల్ ను తొడ్కొని ఓరుగల్లు చేరాడు. అచట ప్రబలుతున్న మహమ్మారి వల్ల సుల్తానుకు అంటుజాడ్యము సోకింది. భయపడిన సుల్తాను తూర్పు [[తెలంగాణ]]మును మక్బూల్ ను అధిపతిగా చేసి [[ఢిల్లీ]] తిరిగి వెళ్ళాడు. 1336లో కాపానీడు మక్బూల్ ను ఓరుగంటినుండి తరిమివేసి కోటను జయించాడు.
 
అటు పిమ్మట మక్బూల్ తిరిగి ఢిల్లీ దర్బారు చేరి [[గుజరాత్]], [[సింధు]] దేశములలో పెక్కు విజయములు సాధించాడు. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారులో వజీరు (ప్రధాన మంత్రి) గా నియమించబడ్డాడు. భాషాప్రాంతమతభేధములను అధిగమించి ఢిల్లీ దర్బారులో క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.
పంక్తి 16:
ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు. విషమపరిస్థితులలో ఢిల్లీని పలువురి కుతంత్రములనుండి కాపాడి సుల్తానుకు మక్బూల్ మరింత విశ్వాసపాత్రుడయ్యాడు. సంతసించిన సుల్తాను మక్బూలే నిజమైన సుల్తాను అని పొగిడాడు. ఒక సందర్భమున తురుష్క కోశాధికారి ఐన్ ఇ మహ్రుతో విభేదములు వచ్చి అతనిని తొలగించుటకు మక్బూల్ పట్టుబట్టగా సుల్తానుకు అలా చేయక తప్పలేదు. అప్పటినుండి మక్బూలే కోశాధికారిగా వ్యవహరించాడు. ఈతని జెనానాలో 2,000 మంది ఉంపుడుగత్తెలున్నారు.
 
మక్బూల్ 1372లో చనిపోయాడు. ఈతని సమాధి [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లోని మొదటి అష్టకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో [[హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా]] దర్గా సమీపములో ఉంది.<ref>Tomb of Telanga Nawab: Anon (1997) Delhi, The Capital of India; Asian Educational Services. pp. 85. ISBN 81-206-1282-5, 9788120612822</ref>.ఆక్రమణలవల్ల, నిర్లక్ష్యమువల్లను సమాధి శిథిలావస్థలో ఉన్నది<ref>http://thespeakingarch.com/tomb_of_tilangani/</ref>.
 
"https://te.wikipedia.org/wiki/మాలిక్_మక్బూల్" నుండి వెలికితీశారు