మాంసకృత్తులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 1:
[[దస్త్రం:Myoglobin.png|thumb|200px|[[మయోగ్లోబిన్]] యొక్క 3D నిర్మాణం. ఇందులో [[ఆల్ఫా హెలిక్స్]] రంగులతో అద్దబడింది. ఇది [[X-రే క్రిస్టల్లోగ్రఫి]] ద్వారా నిర్మాణం కనుగొనబడిన మొట్టమొదటి ప్రోటీన్.]]
 
'''మాంసకృత్తులు''' జీవుల [[శరీరం|శరీర]] నిర్మాణంలో ముఖ్యమైన పదార్ధాలు. [[మాంసకృత్తుల ఆకృతి|మాంసకృత్తుల]]<nowiki/>ని '''ప్రాణ్యములు''' అనీ, లేదా '''ప్రోటీన్‌లు''' (Proteins) అనీ కూడా పిలుస్తారు. గ్రీకు భాషలో protos అంటే 'ముఖ్యమైనది' అనే అర్ధం వస్తుంది. సంస్కృతంలోనూ, [[తెలుగు]]<nowiki/>లోనూ ప్రాణ్యాక్షరాలు అంటే ముఖ్యమైన అక్షరాలు - లేదా - అచ్చులు అనే వాడుక ఉంది. భాష కట్టడికి అచ్చులు ఎంత ముఖ్యమో శరీర నిర్మాణానికి అంతే ముఖ్యమయిన ఈ రసాయనాలని 'ప్రాణ్యములు' అనటం సముచితం. పోషక పదార్ధాలయిన ఈ ప్రాణ్యములు మాంసంలో ఉంటాయి, పప్పులలో ఉంటాయి, పాలల్లో ఉంటాయి - ఆఖరికి చిన్న చిన్న మోతాదులలో [[బియ్యము|బియ్యం]]<nowiki/>లోనూ, [[గోధుమ]]<nowiki/>లలోనూ కూడా ఉంటాయి.
 
== చరిత్ర ==
కర్బన రసాయనం (organic chemistry), జీవ రసాయనం (biochemistry) దరిదాపుగా ఒకే సారి పుట్టేయనవచ్చు. సర్వసాధారణంగా వేడి చేసినప్పుడు ఘన పదార్ధాలు కరిగి ద్రవ రూపం చెందుతాయి. మంచు కరిగి నీరు అవుతుంది. వెన్న కాచితే నెయ్యి అవుతుంది. కాని కోడి గుడ్డుని కొట్టి సొనని పెనం మీద వేస్తే గట్టిపడుతుంది. రక్తాన్ని వేడి చేస్తే గడ్డ కడుతుంది. పాలని ఇగరబెడితే కోవా అవుతుంది. అంటే కొన్ని పదార్ధాలు వేడి చేస్తే కరుగుతాయి, కొన్ని [[వేడి]] చేస్తే పేరుకుంటాయి. ఇలా వేడి చేస్తే పేరుకునే పదార్ధాలకి సొనలు (albumins) అని పేరు పెట్టేరు. సొనల మీద [[పరిశోధన]] సాగిన కొత్తలో సొనలలో ఒక కొత్త రకం రసాయనం పదే పదే కనిపించటం మొదలయింది. దానిని విశ్లేషించి చూడగా దాని సాంఖ్యక్రమం (empirical formula) C<sub>40</sub>H<sub>62</sub>O<sub>12</sub>N<sub>10</sub> అని తేలింది. అంటే ఒక బణువు (molecule)లో 40 కర్బనపు అణువులు, 62 ఉదజని అణువులు, 12 ఆమ్లజని అణువులు, 10 నత్రజని అణువులు ఉన్నాయన్న మాట. సొనలన్నిటిలోనూ తారసపడుతూన్న ఈ పదార్థం కర్బనోదకం (carbohydrate) కాదు, కొవ్వు (fat) కాదు - ఎందుకంటే కర్బనోదకాలలోనూ, కొవ్వులలోనూ నత్రజని (nitrogen) ఉండదు. ఈ సొనలలో నత్రజని కనిపిస్తోంది. అంతే కాదు. ఈ కొత్త రకం బణువులు చాల పెద్దవిగా కూడా కనిపిస్తున్నాయి. ఇదేదో ముఖ్యమైన పదార్థం అయి ఉండాలనిన్నీ, జీవి యొక్క జన్మ రహశ్యం మూడొంతులు ఇందులో ఇమిడి ఉండొచనిన్నీ ఊహించి బెర్‌జీలియస్‌ (Berzelius) దీనికి ప్రోటీన్‌ (అంటే, ముఖ్యమైనది) అని [[నామకరణము|నామకరణం]] చేసారు. బెర్‌జీలియస్‌ ఊహించినట్లుగా ఈ ప్రాణ్యం మన మనుగడకి చాల ముఖ్యమయిన పదార్థం అని తేలింది. కాని, బెర్‌జీలియస్‌ అనుకున్నట్లు జీవి యొక్క రహశ్యం ఈ బణువులో లేదని కూడా తేలింది. ఆ గౌరవం DNA అనబడే మరొక బృహత్‌ బణువుకి దక్కింది.
== మూలకణాలతో మాంసం తయారీ ==
[[హాలెండ్]] దేశ పరిశోధకులు పంది మూలకణాలతో [[మాంసము|మాంసం]] తయారు చేశారు.అంటే ఓ నగ రానికి సరిపడా మాంసం ఉత్పత్తి చేసేందుకు వందలకొద్దీ జంతువు లను పెంచాల్సిన అవసరం లేదు.ప్రయోగశాలలో పదో,ఇరవయ్యో పెంచితే చాలు.అయితే.. ప్రస్తుతం ఈ విధానంలో సెంటీమీటరు పొడవై న మాంసం ముక్కలను మాత్రమే తయారుచేయగలిగారు.ఒక మనిషికి సరిపడినంత తయా రుకావడానికి 30 రోజులైనా పడుతుందని మార్క్‌ వివరించారు. త క్కువ వ్యవధిలో ఎక్కువ మాం సం ఉత్పత్తి చేసేలా ఈ విధానా న్ని అభివృద్ధి చేస్తున్నామని పోస్ట్‌ చెప్పారు.మాంసం కోసం [[జంతువులు|జంతువుల]]<nowiki/>ను పెద్ద సంఖ్యలో పెం చడంకూడా పర్యావరణానికి తీవ్ర హాని చేస్తోందట. (ఆంధ్రజ్యోతి 18.1.2010)
 
== రసాయనాలకి నామకరణాలు ==
ప్రాణ్యం అనే పదార్థం ఉందని తెలియగానే దాని రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న ఆవేదనతో వేట మొదలయింది. అప్పటికే కర్బనోదకాల అధ్యయనంలో నేర్చుకున్న ఒక పద్ధతి ఈ [[వేట]]<nowiki/>లో ఉపయోగపడింది. కణోజు లేదా సెల్యులోజు (cellulose) ని ఆమ్లంలో వేసి వేడి చేసినప్పుడు [[గ్లూకోజు]] (glucose) వచ్చింది కనుక కణోజు బణువుని గ్లూకోజు బణువులతో కట్టిన దండలా ఊహించుకున్నారు. అదే విధంగా జెలటిన్‌ (gelatin) అనే ప్రాణ్యపు పదార్ధాన్ని ఆమ్లంలో వేసి వేడి చెయ్యగా తెల్లని, తియ్యనయిన స్పటికాలు వచ్చేయి. రుచికి కొంచెం తియ్యగా ఉన్నా ఈ స్పటికాలు [[చక్కెర]] జాతి కర్బనోదకాలు కాదని తేలిపోయింది. ఎందుకంటే ఈ స్పటికాలని తరచి తరచి పరిశోధించి చూడగా వాటినుండి నవజని (ammonia, NH<sub>3</sub>) అనే వాయువు వచ్చింది. చక్కెరలలో C, H, O లు మాత్రమే ఉంటాయి, నత్రజని (N) ఉండదు. కనుక ఈ కొత్త రకం స్పటికాలకి కొత్త పేరు పెట్టవలసి వచ్చింది.
 
[[దస్త్రం:AminoAcidball.svg|thumbnail|300px|అన్ని నవామ్లాలకి ఉమ్మడిగా ఉండే నిర్మాణక్రమం. ఇక్కడ ఎడం చివర ఉన్నది నవాంశ (amine group), కుడి చివర ఉన్నది కార్బాక్సిల్‌ గుంపు (carboxyl group). R ని పక్క గొలుసు అంటారు. ఈ పక్క గొలుసు మారినప్పుడల్లా మరొక నవామ్లం వస్తుంది.]]
 
[[రసాయన శాస్త్రము|రసాయనశాస్త్రం]]<nowiki/>లో పేర్లు పెట్టటం ఒక కళ. మామూలు కళ కూడా కాదు; ఒక శాస్త్రీయ పద్ధతిలో తీర్చిదిద్దబడ్డ కళ. ఈ పేర్లలో ఒక వరస ఉంది, ఒక బాణీ ఉంది. ఉదకం నుండి జనించినది (లేదా ఉదకానికి జన్మనిచ్చినది) ఉదజని. ఆమ్లానికి జన్మనిచ్చినది ఆమ్లజని. రవికి జన్మనిచ్చినది రవిజని (helium). అలాగే నవాసారం (ammonium chloride, NH<sub>4</sub>Cl) కి [[జన్మ]]<nowiki/>నిచ్చినది నవజని (ammonia). ఈ నవజని బణువు సాంఖ్యక్రమం NH<sub>3</sub> - అంటే ఒక బణువులో ఒక నత్రజని అణువు, మూడు ఉదజని అణువులు ఉంటాయి. ఏ కర్బన రసాయన పదార్థంలో అయినా నత్రజని ఉంటే ఆ పదార్ధానికి పెట్టే పేరులో చివర -యీన్‌ (-ine) శబ్దం రావాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. గ్రీకు భాషలో 'గ్లక్‌-' అనే పూర్వప్రత్యయం తియ్యదనాన్ని సూచిస్తుంది. కనుక ఈ గ్లక్‌కి -యీన్‌ అనే [[తోక]] తగిలించి గ్లయిసీన్‌ (glycine) అనే కొత్త మాటని తయారు చేసి జెలటిన్‌ లోంచి వచ్చిన కొత్త స్పటికాలని గ్లయిసీన్‌ అనమన్నారు.
 
ఇదే గ్లక్‌ శబ్దానికి -ఓజు (-ose) అనే ఉత్తరప్రత్యయం తగిలిస్తే గ్లూకోజు (glucose) వస్తుంది. కనుక గ్లూకోజు కర్బనోదకం అయింది, గ్లయిసీను ప్రాణ్యములలో ఉండే మరేదో కొత్త పదార్థం అయింది. తీపికి సంస్కృత పదం మధురం కనుక కావలిస్తే గ్లూకోజుని మధురోజు అనిన్నీ, గ్లయిసీన్‌ని మధురీన్‌ అనిన్నీ అనొచ్చు; కాని ఇక్కడ ఇంగ్లీషు మాటలే వాడుదాం.
పంక్తి 19:
గ్లయిసీన్‌ ఉనికి తెలిసిన తర్వాత ప్రాణ్యముల విశ్లేషణ పుంజుకుంది. మాంసపు ముక్కలని ఆమ్లంలో కలిపి మరొక తెల్లని పదార్దాన్ని విడదీశారు. గ్రీకు భాషలో 'లూకో' అంటే [[తెలుపు]] కనుక దీనికి [[లూసీన్‌]] (lucine) అని పేరు పెట్టేరు. కావలిస్తే దీనిని తెలుగులో శ్వేతీన్‌ అనొచ్చు. ఆ తరువాత పాల నుండి మరొక పదార్ధాన్ని విడదీశారు. గ్రీకు భాషలో 'జున్ను' అనే అర్ధం వచ్చే మాట నుండి దీనికి టైరోజీన్‌ (tyrosine) అని పేరు పెట్టేరు.
 
ఇవన్నీ కొత్త జాతి పదార్ధాలు. కనుక ఈ జాతికి కూడా ఒక పేరు పెట్టవలసిన అవసరం వచ్చింది. ఈ కొత్త జాతి బణువులన్నిటిలోనూ కొన్ని ఉమ్మడి లక్షణాలు కనబడ్డాయి. వీటన్నిటికి ఒక పక్క -NH<sub>2</sub> సమూహం, మరొక పక్క -COOH సమూహం ఉండటం ఈ ఉమ్మడి లక్షణం. -NH<sub>2</sub>ని ఇంగ్లీషులో ఎమైన్‌ గ్రూపు (amine group) అంటారు. ఈ ఎమైన్‌ (amine) అనే మాట అమ్మోనియా (ammonia) నుండి వచ్చింది. అమ్మోనియాని నవజని అన్నాం (నవాసారం నుండి పుట్టింది నవజని) కనుక ఎమైన్‌ గ్రూప్‌ని నవాంశ అందాం. ఇక రెండవ పక్క ఉన్న -COOH సంగతి. దీనిని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లో కార్బాక్సిల్‌ గ్రూపు (carboxyl group)అంటారు. ఈ కార్బాక్సిల్‌ గుంపు ఉన్న పదార్ధాలన్నీ ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటాయి. కనుక వీటి పేర్ల చివర 'ఆమ్లం' అని వస్తే బాగుంటుంది. మాట మొదట్లో ఎమైన్‌-, చివర -ఏసిడ్‌. లేదా, మాట మొదట నవ-, చివర -ఆమ్లం. కనుక ఈ కొత్త జాతిని ఇంగ్లీషులో ఎమైనో ఏసిడ్ (amino acid) అనిన్నీ, [[తెలుగు]]<nowiki/>లో నవ + ఆమ్లం = [[నవామ్లం]] అనిన్నీ అనొచ్చు. నవ అంటే కొత్త అనే అర్ధం కూడా ఉంది నవామ్లం అంటే కొత్తగా కనిబెట్టబడ్డ ఆమ్లం అన్న అర్ధం కూడా వస్తోంది. కనుక ఇంగ్లీషులో amino acid అని రాసి దానిని తెలుగులో ఎమైనో ఏసిడ్‌ అని కాని, ఎమీనో ఏసిడ్ అని కాని ఉచ్చరించవచ్చు లేదా తేలికగా నవామ్లం అని తెలుగు పేరు వాడొచ్చు.
 
== ప్రాణ్యముల కట్టడి ==
పంక్తి 26:
ఇప్పటి వరకు దరిదాపు 100 నవామ్లాల ఉనికిని గుర్తించినప్పటికీ ప్రస్తుతపు అవసరాలకి పనికొచ్చేవి 20 మాత్రమే; ప్రాణ్యముల కట్టడికి ఉపయోగపడేవి ఈ ఇరవై నవామ్లాలే. కనుక మరే విశేషణాలనీ చేర్చకుండా 'నవామ్లాలు' అన్నప్పుడు ఈ 20 నవామ్లాల గురించే ప్రస్తావన. ఈ ఇరవై నవామ్లాల పూర్తి ఇంగ్లీషు పేర్లు, మూడక్షరాల పొట్టి పేర్లు, అవసరం వెంబడి వాటిని గుర్తించటానికి ఒకే ఒక [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] అక్షరం గుర్తు దిగువ పట్టికలో ఇవ్వబడ్డాయి. జీవరసాయన రంగంలో పని చేసేవారికి ఈ పేర్లు, పొట్టిపేర్లు, ఒంటి అక్షరాలు కంఠతా వచ్చి ఉంటాయి - అందరికీ ఒ, న, మలు వచ్చినట్లు.
 
మనుష్యులందరికి ఒక తల, రెండు చెవులు, రెండు కళ్ళు, వగైరా జాతి పోలికలు ఉన్నప్పటికీ ప్రతి మనిషికి పోల్తి పట్టటానికి ప్రత్యేకమైన గుర్తులు ఉన్నట్లే నవామ్లాలన్నీటికి కొన్ని ఉమ్మడి లక్షణాలు, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఊన్నాయి. బొమ్మలో చూపిన విధంగా ప్రతి నవామ్లంకీ ఒక చివర ఎమైన్‌ గుంపు, ఒక చివర కార్బాక్సిల్‌ గుంపు ఉంటాయి. ఇది ఉమ్మడి లక్షణం. ప్రతీ నవామ్లపు బణువులోనూ ఎమైన్‌ గుంపు వైపు ఉన్న కర్బనపు [[అణువు]]<nowiki/>ని అంటిపెట్టుకుని ఒక పక్క గొలుసు (side chain) ఉంటుంది. బొమ్మలో ఈ పక్క గొలుసుని R అనే అక్షరంతో చూపడమయింది. ఈ పక్కగొలుసు రకరకాలుగా ఉంటుంది. ఇది మారినప్పుడల్లా నవామ్లం పేరు, లక్షణాలు మారుతూ ఉంటాయి.
 
[[దస్త్రం:Protein primary structure.svg|thumb|300px|right|A [[బహుజీర్ణమాల]] అనేది నవామ్లాల గొలుసు.]]
 
ప్రతి నవామ్లాన్ని ఒక పూసలా ఊహించుకుంటే ఈ [[పూసల]]<nowiki/>తో గుచ్చిన నవామ్లాల దండ (లేదా మాల, పూల మాలలా; లేదా పేరు, కాసుల పేరులా) ని జీర్ణమాల అని తెలుగులోనూ peptide chain అని ఇంగ్లీషులోనూ అంటారు. కడుపులో ఊరే జీర్ణ రసం pepsin కీ, ఇక్కడ తారసపడుతూన్న peptide కి మూలం గ్రీకు భాషలో 'జీర్ణ' అనే శబ్దం.
అందుకనే pepsin ని జీర్ణరసం అనిన్నీ, peptide chain ని జీర్ణమాల అనీ పిలవటం సమంజసం. జీర్ణమాలలో ఉన్న 'పూసలు' అన్నీ గ్లయిసీను బణువులే అయిన యెడల దానిని బహుగ్లయిసీను (polyglucine) అంటారు. కణోజు (cellulose) గ్లూకోజుతో గుచ్చిన దండ అయినట్లే బహుగ్లయిసీను గ్లయిసీనులతో గుచ్చిన దండ. కొన్ని జీర్ణమాలల్లో రెండే రెండు రకాల పూసలు ఉండొచ్చు. ఉదాహరణకి గ్లయుసీను, అలనీను (alanine) అనే నవామ్లాలు ఉపయోగించి మాత్రమే కట్టిన దండని మనం 'పట్టు' (silk) అంటాం. పట్టు పురుగులు తయారుచేసిన ప్రాణ్యమే పట్టు. ఈ రకం జీర్ణమాలలని బహుగ్లయిసీను అనటానికీ వీలు లేదు, బహుఅలనీను అనటానికీ వీలు లేదు. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కనుక వీటిని బహుజీర్ణమాలలు (polypeptide chains) అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/మాంసకృత్తులు" నుండి వెలికితీశారు