మంగు రాజా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 13:
రాజా రాసిన పరిశోధనా వ్యాసాలు ప్రతి ఒక్కరి మనసును చూరగొంటాయి. ఆయన పనిచేసిన సంస్థలకు ఆయన ఒక గర్వ కారణంగా పరిగణించబడ్డారు. వార్త దినపత్రికలో వచ్చిన 'ఆపాతమధురం ' అనే శీర్షిక ఆ దిన పత్రిక యొక్క సర్కులేషన్ ను పెంచింది. రాజా సంపాదకత్వంలో వచ్చిన [[హాసం]] అనే తెలుగు పక్ష పత్రిక ది బెస్ట్ మ్యాగజైన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈయన 800 లకు పైగా గుర్తించదగ్గ వ్యాసాలను, సన్మాన పత్రాలను కూడా రాశారు. వందకు పైగా సినీ సంగీత పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. [[యస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] నిర్వహించిన పాడాలని ఉంది (మా టీవీ) కార్యక్రమ పరంపరలో రెండు ఎపిసోడ్ లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
 
రాజా ప్రస్తుతం [[మా టీవీ]]<nowiki/>లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ ఛానల్ కోసం రాజా రూపొందించిన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంతో పాటు వివిధ బాషల ([[తెలుగు]], తమిళ్, కన్నడ, హిందీ, [[బెంగాలి]], ఇంగ్లీష్) సంగీతం పై సృజనాత్మ పరిశోధన 'మధుర క్షణాలు' ఆ ఛానల్ కు అర్కివల్ వాల్యూని తెచ్చిపెట్టింది.
 
==అవార్డులు, సన్మానాలు==
రాజా అందుకున్న అవార్డులు, సన్మానాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఇవీ : .
* 2002లో అనేక మంది సంగీతాభిమానుల అభిమానాన్ని పొందేలా హాసం అనే పత్రికను రూపొందించి నడిపినందుకు యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఈటా) నుండి అవార్డును రాజా గెలుచుకున్నారు.
* 2007లో మ్యూజిక్ [[పాత్రికేయవిద్య|జర్నలిజం]]<nowiki/>లో అందించిన సేవలకుగాను మద్రాస్ తెలుగు అకాడమీ రాజాకు 'సమైక్య భారత్ గౌరవ సత్కార' అవార్డును అందించింది.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ ఏటా ఇచ్చే టీవీ నందీ అవార్డులలో 2006 సంవత్సరానికి గాను రాజా రూపొందించిన 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమం ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గ్ గా బంగారు నందిని పొందింది...అందుకు గాను మెగాస్టార్ శ్రీ [[చిరంజీవి]], శ్రీ నాగార్జున గారి చేత రాజా ప్రత్యేకంగా సన్మానించబడ్డారు కూడా.
* శ్రీకాకుళం నుండి నంది అవార్డును గెలుచుకున్న మొదటి మీడియా వ్యక్తీ అయినందుకు [[శ్రీకాకుళం]] యునియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వారు, ధర్మాన ప్రసాద్ రావు (MLA, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్, మరియూ రెవిన్యూ మంత్రి) రాజాను సన్మానించారు.
పంక్తి 24:
 
==కొనసాగుతున్న ప్రయాణం==
* సినీ సంగీత శిఖరాన్ని అధిరోహించే [[ప్రయాణం]]<nowiki/>లో రాజా ఎప్పుడూ అలసటను అనుభవించలేదు. అతని నిబద్దతా, అంకిత భావం, కృత నిశ్చయం భావి తరాలకు మార్గదర్శకం.
* 40,000 పైచిలుకు ఉన్న పాటల లైబ్రరి రాజా సొంతం. రెండు వేల పైగా సినిమాలు, వేయికి పైగా రెఫరెన్సుపుస్తకాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి.
* క్లుప్తంగా, రాజాను తెలుగు సినిమా యొక్క వాకింగ్ ఎన్సైక్లోపీడియాగా పిలవచ్చు. తను రాసిన చరిత్రను తనే తిరిగి రాయగల చరిత్రకారుడు ఉన్నందుకు తెలుగు సినిమా గర్విస్తుంది.
* మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా ఒక [[బ్లాగు]]<nowiki/>ను ఏర్పాటు చేసి దానిని వ్యక్తిగత డైరీగా నిర్వహిస్తున్నారు.
* అతి తొందర్లో, రాజా తన సొంత వెబ్ సైట్ ద్వారా ఏళ్ళ తరబడి తెలుగు సంగీతం పై చేసిన పరిశోధనా ఫలితాల వల్ల వచ్చిన పరిజ్ఞానాన్ని సంగీత ప్రియులకు అందించనున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/మంగు_రాజా" నుండి వెలికితీశారు