"మంత్రి శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (→‎రంగస్థల ప్రస్థానం: AWB తో "మరియు" ల తొలగింపు)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
అదే సమయంలో [[అబ్బూరి వరదరాజేశ్వరరావు]] తో ఏర్పడిన పరిచయం శ్రీనివాసరావులో ప్రపంచ నాటక రంగం వైపు ఆసక్తిని పెంపొందింపజేసింది. [[ఎ.ఆర్.కృష్ణ]] తో పరిచయం, సాన్నిహిత్యం 1952లో ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌ స్థాపనకు దారితీసింది.
 
జాతీయ నాట్య సంఘానికి [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆమె ప్రోత్సాహంతో సిటీ కాలేజి వేదికగా నాటకోత్సవాలు నిర్వహించారు. [[తెలంగాణ]]<nowiki/>లో ఈ తొలి నాటకోత్సవానికి [[మర్రి చెన్నారెడ్డి]] అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నాటకోత్సవంలో [[బెల్లంకొండ రామదాసు]] రాసిన ‘మాష్టార్జీ’ నాటకాన్ని మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్.కృష్ణ, తురగా కృష్ణమోహన్‌ రావు, పన్నూరి రామారావు మొదలగువారు ప్రదర్శించారు. దీని తరువాత తెలంగాణలో అనేక నాటకాలు ప్రదర్శితమయ్యాయి.
 
[[అబ్బూరి రామకృష్ణారావు]] నటాలి పేరుతో నెలకొల్పిన నటశిక్షణ సంస్థలో మంత్రి శ్రీనివాసరావు నట [[శిక్షణ]] తరగతులు నిర్వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత జాతీయ నాట్య సంఘానికి అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ నాట్య విద్యా సంఘాన్ని మంత్రి శ్రీనివాసరావు స్థాపక సభ్యులుగా సేవలందించారు.
 
'[[ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం)|ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌]]' నాటకంలో తెలుగు-తమిళ యాసతో పోస్ట్‌మాస్టర్‌ పాత్రను శ్రీనివాసరావు పోషించారు. [[తెలంగాణ]] లోని అనేక ప్రాంతాల్లోనూ, [[గుడివాడ]], ఆంధ్ర నాటకకళా పరిషత్‌ లలో ఆ నాటకానికి మంచి పేరు వచ్చింది. 1957లో ఐ.ఎన్‌.టి నాటకోత్సవాల్లో కుందుర్తి రచించిన 'ఆశ' నాటకాన్ని, శ్రీశ్రీ రచించిన 'విదూషకుడి ఆత్మహత్య' వంటి నాటకాలను ప్రయోగాత్మక [[నాటకాలు]]<nowiki/>గా మలచి ప్రదర్శించారు.
 
మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ మాండలికంలో 1950–60 మధ్యకాలంలో అనేక రేడియో నాటకాలను అందించి శ్రవ్య నాటకానికి ఒక దారి ఏర్పరిచారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987936" నుండి వెలికితీశారు