యూ థాంట్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 25:
 
== జననం ==
ఇతడు [[1909]], [[జనవరి 22]] న దిగువ [[బర్మా]] (ప్రస్తుత [[మయాన్మార్]]) లోని పాంటనావ్‌లో జన్మించాడు. [[డాగ్ హమ్మర్స్ జోల్డ్]] [[సెప్తెంబర్]] [[1961]]లో [[విమానము|విమాన]] ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ [[1971]] వరకు [[ఐక్యరాజ్య సమితి]]<nowiki/>కి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి [[ఆసియా]] ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా నిల్చారు.
 
యూ థాంట్ రంగూన్ విశ్వవిద్యాలయం (ప్రస్తుత యాంగాంగ్ విశ్వవిద్యాలయం) లో ఉన్నత విద్య అభ్యసించాడు. [[1928]]-[[1931|31]] కాలంలో ఉపాధ్యాయుడిగా, [[1931]]-[[1947|47]] కాలంలో పాంటనావ్ జాతీయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసాడు. [[1948]]లో బర్మా [[గ్రేట్ బ్రిటన్]] నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రధానమంత్రి [[యు ను]] (U Nu) అభ్యర్థనపై [[1949]]లో యూ థాంట్ సమాచార శాఖ సంచాలకులుగా పనిచేసాడు. [[1949]]-[[1953|53]] కాలంలో సమాచార శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. 1953-[[1957|57]] వరకు ప్రధానమంత్రి కార్యదర్శిగా వ్యవహరించి యును ఉపన్యాసాలను, విదేశీ పర్యటనలను సిద్ధం చేయడం, వీదేశీ ప్రముఖుల సమావేశాలను సిద్ధం చేయుటలో సహకరించాడు. [[1955]]లో [[ఇండోనేషియా]]లోని [[బాండుంగ్]]లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ సదస్సుకు కార్యదర్శిగా వ్యవహరించాడు. ఈ సదస్సే [[అలీన రాజ్యాల ఉద్యమం]]కు ఊపిరిపోసింది. [[1957]]లో ఐక్యరాజ్య సమితిలో బర్మా శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డాడు. 1961లో డాగ్ హమ్మర్స్ జోల్డ్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత తదుపరి కాలానికి యూ థాంట్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. [[1966]]లో మళ్ళీ రెండవ పర్యాయము ఆ పదవికి ఎన్నికైనాడు. [[1971]]లో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించాడు.
"https://te.wikipedia.org/wiki/యూ_థాంట్" నుండి వెలికితీశారు