"యెరెవాన్" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
'''యెరెవాన్''' ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]], [[అర్మేనియన్ భాష]]: Երևան, [[అజర్‌బైజాన్ భాష]]: İrəvan, [[రష్యన్ భాష]]: Ереван) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ''ఎరెవాన్'' అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో, సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవది. ప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>
 
యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.<ref>{{Cite book|title=The Soviet Union: Empire, Nation and Systems|last=Katsenelinboĭgen|first=Aron|publisher=Transaction Publishers|year=1990|isbn=0-88738-332-7|location=New Brunswick|page=143}}</ref> ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.<ref name="Barnett">{{Cite book|url=https://books.google.com/books?id=vXljf8JqmkoC&pg=PA346&dq=Erebuni+776&hl=en&sa=X&ei=apvCUs-oMvHB7AaIl4G4AQ&ved=0CDQQ6AEwAA#v=onepage&q=Erebuni%20776&f=false|title=The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC|last=R. D. Barnett|publisher=Cambridge University Press|year=1982|isbn=978-0521224963|editor-last=John Boardman|edition=2nd|page=346|chapter=Urartu|editor-last2=I. E. S. Edwards|editor-last3=N. G. L. Hammond|editor-last4=E. Sollberger}}</ref> ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో [[ఇరాన్|ఇరానియన్]], [[రష్యా|రష్యన్]] పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తర్వాత [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]]<nowiki/>లో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం కారణంగా వలస వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.<ref>{{Cite book|title=The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I|last=Hovannisian|first=Richard G.|publisher=University of California Press|year=1971|isbn=0-520-01984-9|location=Berkeley|pages=126–127}}</ref> 20 వ శతాబ్దం నాటికి [[సోవియట్ యూనియన్]] లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది. నగరంలోని [[తిత్సర్నాబర్ద్ ను సందర్శించిన ముఖ్యమైన వ్యక్తులు|తిత్సర్నాబర్ద్ ను]] ఎంతో మంది ప్రముఖుల్లు సందర్శించారు.
 
ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంతో  యెరెవాన్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 21 వ శతాబ్దపు తొలినాళ్ళ నుండి నగరం అంతటా భారీ నిర్మాణాలు జరిగాయి. రెస్టారెంట్లు, దుకాణాలు, వీధి కెఫేలు వంటి వాణిజ్య సౌకర్యాలు బాగా పెరిగాయి. సోవియట్ కాలంలో ఇవి చాలా అరుదుగా ఉండేవి. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం నగర జనాభా 1,060,138. ఇది దేశం మొత్తం జనాభాలో 35%. 2016 నాటి అధికారిక అంచనాల ప్రకారం, నగర జనాభా 1,073,700.<ref>[http://www.armstat.am/file/article/nasel_01.01.2016.pdf The official estimate of the population in Armenia as of 01.01.2016]</ref> [[యునెస్కో]] 2012లో యెరెవాన్ అనే పేరును ప్రపంచ రాజధానుల పుస్తకంలో చేర్చింది.<ref name="UN News Centre">{{వెబ్ మూలము|url=https://www.un.org/apps/news/story.asp?NewsID=35242&Cr=UNESCO&Cr1=|title=Yerevan named World Book Capital 2012 by UN cultural agency}}</ref> యూరోసిటీస్‌లో (ఐరోపా నగరాల నెట్‌వర్క్) యెరెవాన్‌కు అసోసియేట్ సభ్యత్వం ఉంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.eurocities.eu/eurocities/members/members_list&country=armen&memcat=|title=Members List|accessdate=8 January 2015}}</ref>
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవాన్ నుండి ప్రవహిస్తున్న [[హ్రజ్డాన్ నది]]]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరారట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవాన్ ఉన్నది ]]
యెరెవాన్ సముద్ర మట్టం నుండి సగటున 990 మీ (3,248.03 అడుగులు) ఎత్తున, కనిష్టంగా 856 మీ., గరిష్ఠంగా 1,390 మీ, మధ్యనా ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]]<nowiki/>ఒడ్డున, ఈశాన్య అరారట్ లోయలో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా పర్వతాలు ఉన్నాయి. దక్షిణాన హ్రజ్దాన్ నది ఉంది. హ్రజ్దాన్ నది ప్రవహించే క్రమంలో ఒక సుందరమైన గండి (కాన్యన్) ని ఏర్పరచింది. ఈ గండి నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. రాజధాని కావడం వలన యెరెవాన్ ఏ  రాష్ట్రంలోనూ భాగంగా లేదు. యెరెవాన్ కు ఉత్తర, తూర్పు దిక్కున కొటాయ్క్, దక్షిణాన, పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్, వాయవ్యాన అరగట్సన్  రాష్టాలు ఉన్నాయి.
 
ఎరెబునీ అభయారణ్యం 1981లో ఏర్పాటు చేసారు. ఇది నగర కేంద్రం నుండి ఆగ్నేయంగా 8 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల ఎత్తున, 120 హెక్టార్లలో ఈ అభయారణ్యం ఉంది. పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో ఈ రిజర్వ్ ఆక్రమించి ఉంది.<ref>{{Cite web |url=http://news.am/arm/news/274751.html |title=Erebuni State Reserve |website= |access-date=2018-06-16 |archive-url=https://web.archive.org/web/20180617065846/https://news.am/arm/news/274751.html |archive-date=2018-06-17 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987983" నుండి వెలికితీశారు