రతి అగ్నిహోత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
| tonyawards =
}}
'''[[రతి అగ్నిహోత్రి]]''' ([[హిందీ]]: रति अग्निहोत्रि, [[ఉర్దూ]]: رتِ اَگنِہوترِ) భారతీయ సినిమా నటి. ఈమె [[1960]], [[డిసెంబర్ 16]]న [[బొంబాయి]]<nowiki/>లో ఒక పంజాబీ కుటుంబములో జన్మించింది. ఈమె [[హిందీ-ఉర్దూ]]తో పాటు [[తమిళ]], [[తెలుగు]], [[కన్నడ]] భాషా చిత్రాలలో కూడా నటించింది.
 
==సినీ జీవితం==
రతి సాంప్రదాయ [[కుటుంబము]] నుండి వచ్చినా, 10వ యేటనే మోడలింగ్ చేయటానికి కుటుంబము యొక్క అనుమతి లభించింది.<ref>[http://www.hindu.com/mp/2004/10/26/stories/2004102600360100.htm "`I am where my destiny has brought me'"], Hindu.com</ref> యుక్తవయసులో ఉండగా తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబము మొత్తం [[మద్రాసు]]<nowiki/>కు బదిలీ అయ్యింది. [[మద్రాసు]]లో [[గుడ్ షెప్పర్డ్ కాన్వెంట్ పాఠశాల]]లో చదువుతుండగా రతి [[పాఠశాల]] నాటక ప్రదర్శనలో పాలుపంచుకున్నది. తమిళ సినిమా రంగములో ప్రముఖ దర్శకుడు, తన కొత్త సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్న [[భారతీరాజా]] ఆ నాటక ప్రదర్శన యొక్క ప్రేక్షకులలో ఉన్నాయి. ఈయన రతి యొక్క తండ్రిని కలిసి సినిమా షూటింగు ఒక నెలలో ముగుస్తుందని హామీ ఇచ్చి, తను ప్రారంభించబోయే సినిమాలో రతిని హీరోయిన్గా తీసుకున్నాడు. తండ్రి, తన కూతురు యొక్క సినీరంగ ప్రవేశానికి సంకోచిస్తూనే ఒప్పుకున్నా, పదహారేళ్ళ వయసులో తన మొదటి సినిమా ''పుదియ వర్పుకళ్''లో నటించడానికి ఎంతో ఉత్సాహంగా అంగీకరించింది. ఈ సినిమా 1979లో విడుదలైంది.
 
ఆ సినిమాలో రతి సరసన కథానాయకునిగా నటించిన [[భాగ్యరాజా]]కు కూడా అదే మొదటి చిత్రం. భాగ్యరాజా ఈమెకు [[తమిళము]] నేర్పించి డైలాగులు చెప్పటంలో శిక్షణ ఇచ్చాడు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించడముతో రతి రాత్రికిరాత్రే తమిళ సినిమాలో సంచలనం సృష్టించింది. ఆ వెనువెంటనే భారతీరాజా ఈమెతో రెండవ చిత్రము [[నీరమ్ మారద పూక్కళ్]] (1979) తీశాడు.<ref>[http://www.rediff.com/entertai/2000/mar/10rati.htm "The return of Rati"], Rediff.com</ref> ఈమె జన్మతః పంజాబీ అయినప్పటికీ దక్షిణాది ప్రేక్షకులు ఈమెను తమలో ఒకర్తెగానే ఆదరించారు. ఈ అభిమానానికి స్పందిస్తూ రతి ''హృదయాంతరాల్లో తాను తమిళ వనిత''నని మద్రాసును తన సొంతవూరుగా చెప్పుకున్నది.<ref>[http://www.hindu.com/mp/2004/03/18/stories/2004031800830100.htm " In the spotlight again"], Hindu.com</ref> దక్షిణాదిన ఈమె [[తెలుగు]], [[కన్నడ]] భాషా చిత్రాలలో కూడా నటించింది. సినీరంగప్రవేశము చేసిన మూడేళ్ళలోనే 32 సినిమాలలో నటించి రికార్డు సృష్టించింది.
"https://te.wikipedia.org/wiki/రతి_అగ్నిహోత్రి" నుండి వెలికితీశారు