రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 13:
'''రాయలసీమ''' అనునది [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( [[కర్నూలు]], [[కడప]], [[అనంతపురం]], [[చిత్తూరు]]) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
 
రాయలసీమ [[విజయనగర సామ్రాజ్యం]]లో భాగాంగా [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]]చే పరిపాలించబడింది. అదేవిదంగా [[కాకతీయులు|కాకతీయ]], ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతని పరిపాలించారు. అది వరకూ [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] పరిపాలనా కేంద్రంగా '''హిరణ్యక రాష్ట్రం'''గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై [[చోళులు|చోళుల]] ప్రభావం పెరిగింది. [[బ్రిటిషు|బ్రిటీషు]] వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన [[హైదరాబాదు]]కి చెందిన [[నిజాం|నిజాం సుల్తాను]]<nowiki/>లు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి '''దత్త మండలం''' అని పేరు వచ్చింది. 1808 లో '''దత్త మండలం''' ను విభజించి [[బళ్ళారి]], [[కడప]] జిల్లాలని ఏర్పరచారు. 1882 లో [[అనంతపురం జిల్లా|అనంతపురం]]<nowiki/>ను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి [[1928]]లో [[చిలుకూరి నారాయణరావు]] "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడినది.
 
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉన్నాయి. [[బళ్ళారి]] కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. [[కోస్తా]], రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను [[ఆంధ్ర రాష్ట్రం]] లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని [[కర్ణాటక]]లో కలిపి వేశారు. [[కన్నడ]], [[తెలుగు]] మాట్లాడేవారు సమానంగా ఉన్న [[బళ్లారి|బళ్ళారి]] నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత [[మైసూరు]]లో చేర్చారు. 1956 లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణలో కలపటంతో అప్పటి నుండి ఇవి [[ఆంధ్రప్రదేశ్]] లో భాగంగా ఉంటున్నవి.
పంక్తి 22:
 
==వ్యుత్పత్తి==
పలు యుద్ధాలలో [[బ్రిటిషు|బ్రిటీషు]] వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో '''దత్త మండలాలు''' లేదా '''దత్త సీమ''' పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ [[శతాబ్దము|శతాబ్ద]]<nowiki/>పు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో [[నంద్యాల]] పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో [[చిలుకూరి నారాయణ రావు]] [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి [[సంస్కృతి]], వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) '''రాయలసీమ''' అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయింది. [[కోస్తా]] ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 1937 నవంబరు 16 లో '''శ్రీబాగ్ ఒడంబడిక''' రూపొందించబడింది.
 
==రాయలసీమ సంస్కృతి==
పంక్తి 44:
[[చిత్తూరు జిల్లా|చిత్తూరు,]] [[కడప]] జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.
===భాష===
రాయలసీమలో శుద్ధమైన [[తెలుగు|తెలుగు భాష]] మాట్లాడే సంస్క్రతి ఉంది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా [[ఉర్దూ భాష]] ఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట, దక్షిణ ప్రాంతాలలో [[తమిళ భాష]] మాట్లాడేవారు ఎక్కువ. [[తిరుపతి]], చిత్తూరు, [[పుత్తూరు]] ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. [[కుప్పం]]<nowiki/>లో ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, [[కర్ణాటక|కర్నాటక,]] తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
===సంగీతం===
[[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన [[త్యాగరాజు]] [[కాకర్ల (అర్ధవీడు)]]కి చెందినవాడు. ప్రస్తుతం ఇది [[ప్రకాశం జిల్లా]] ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
"https://te.wikipedia.org/wiki/రాయలసీమ" నుండి వెలికితీశారు