రాష్ట్రపతి పాలన: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ద్వారా పరిపాలన సాగిస్తుంది. ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. గవర్నరు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రే రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. అయితే, రాష్ట్రపతి పాలనలో ఉండగా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ సమావేశాలను వాయిదా (ప్రోరోగ్) వేస్తారు లేదా రద్దు చేస్తారు. రద్దు చేస్తే కొత్త ఎన్నికలు అనివార్యమౌతాయి.
 
[[జమ్మూ కాశ్మీరు]]<nowiki/>లో గవర్నరు పాలన అనే పద్ధ్తి కూడా ఉంది. అక్కడి ప్రభుత్వం విఫలమైనపుడు, జమ్మూ కాశ్మీరు రాజ్యాంగం లోని 92 వ విభాగం కింద గవర్నరు పాలన విధిస్తారు. రాష్ట్రపతి అనుమతితో గవర్నరు ఈ పాలన విధిస్తారు. ఆరు నెలల తరువాత కూడా గవర్నరు పాలనను ఎత్తివేసే వీలు కుదరకపోతే, అపుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలనకు, గవర్నరు పాలనకూ పెద్ద తేడా లేదు.
 
1994 లో ఎస్సార్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పులో [[భారతదేశ అత్యున్నత న్యాయస్థానం|సుప్రీమ్‌ కోర్టు]], ఇచ్ఛవచ్చిన రీతిలో రాష్ట్రపతి పాలన విధింపుకు అడ్డుకట్ట వేసింది.
"https://te.wikipedia.org/wiki/రాష్ట్రపతి_పాలన" నుండి వెలికితీశారు