కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషాలు
మూలాలు తెలుగులోకి తర్జుమా
పంక్తి 1:
[[బొమ్మ:Kalamkari.JPG|right|thumb|250px|ఇద్దరు నృత్యకారులు]]
[[బొమ్మ:Gita-kalamkari-painting.JPG|right|250px|thumb|గీతోపదేశం బాగా జనప్రియమైన చిత్రం. ఇది [[కలంకారీ]] శైలిలో వస్త్రంపై అద్దిన చిత్రం.]]
'''కలంకారీ''' అనగా వెదురుతో చేసిన [[కలం]]తో సహజమైన [[రంగు]]లను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక [[కళ.]] ఇది [[చిత్తూరు]] జిల్లా [[శ్రీకాళహస్తి]]లో పుట్టింది. పురాతన [[హరప్పా నాగరికత]]కు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారు. [[అలెగ్జాండర్]] కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడంటారు. <ref>{{cite web|url: http://www.aponline.gov.in/Quick%20links/HIST-CULT/arts_kalamkari.html
|title: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు నుంచి }}</ref>కారీ అనగా [[హిందీ]] లేదా [[ఉర్దూ]]లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.<ref>{{cite web|url http://www.kalamkariart.org/index.php?id=2&type=txt|title కలంకారీ ఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి}}</ref> ఐరోపా వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఉదాహరణకు [[పోర్చుగీసు]] వారు దీనిని '''పింటాడో''' అని అంటారు. డచ్చి వారు '''సిట్జ్ ''' అనీ బ్రిటీష్ వారు '''షింజ్''' అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా [[పెడన]]లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్తుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు ''పెడన'' నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో [[ఆర్యవటం]]లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.
 
 
"https://te.wikipedia.org/wiki/కలంకారీ" నుండి వెలికితీశారు