రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 10:
 
== గల్ఫ్ లో రంజాన్ ==
* భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్ చేస్తారు.గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు ఝామున నమాజ్ చదివి పడుకుంటారు.రంజాన్ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు.బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి. దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు.అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని [[మసీదు]]<nowiki/>లలో రంజాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెలరోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు.
* మసీదుల ముందు బిక్షాటన చేసే వారికి కాకుండా [[ప్రభుత్వం]] ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ బిచ్చగాళ్ల బెడద విపరీతంగా ఉంటుంది. [[భారత దేశము|భారత్]], [[బంగ్లాదేశ్]], [[ఇరాన్]], [[యెమన్]] దేశాల నుంచి వికలాంగులైన పేదపిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వారి చేత బిక్షాటన చేయించి లాభాలు గడించడం కొన్ని యాచక ముఠాల ప్రత్యేకత. అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలూ పనిచేస్తాయి.గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల వివరాలు పేర్కొంటూ ఈ పుణ్య మాసంలో వారికి క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేయాల్సిందిగా ఇక్కడి రాజులకు భారతీయ దౌత్య కార్యాలయాలు ప్రత్యేక అభ్యర్థనలు చేస్తాయి. [[ఖురాన్|ఖురాన్‌]]<nowiki/>ను కంఠస్థం చేసిన ఖైదీలను కూడా శిక్ష తగ్గించి విడుదల చేస్తారు.స్వదేశానికి వెళ్లడానికి విమానం టికెట్లకు డబ్బు లేకుండా జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు మతంతో నిమిత్తం లేకుండా తమ జకాత్ సొమ్ముతో విమాన టికెట్లను అనేకమంది అరబ్బులు అందించడం విశేషం.<ref>{{Cite web |url=http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009%2F20-9%2Fcoverstory |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-02-19 |archive-url=https://web.archive.org/web/20090926075625/http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009%2F20-9%2Fcoverstory |archive-date=2009-09-26 |url-status=dead }}</ref>
 
== తెలంగాణలో ==
పంక్తి 19:
{{ప్రధాన వ్యాసం|జకాత్}}
 
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' [[జకాత్]] ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు [[దానం]] చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు [[పండుగ]]<nowiki/>ను జరుపుకొనడానికి, [[సంతోషం]]<nowiki/>లో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది.
 
== ఫిత్రా ==
పంక్తి 25:
[[File:Ramadan jerusalem kmhad.jpg|thumb|upright|[[జెరూసలెం]] పాతబస్తీలో రంజాన్ పండుగ.]]
[[File:هلال رمضان.jpg|thumb|upright|రమదాన్ [[నెలవంక]].]]
'[[జకాత్]]' తో పాటు ' [[ఫిత్రా]]' దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు [[విజయవంతం]]<nowiki/>గా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.
 
దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో [[హృదయం]]<nowiki/>లో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్‍]] అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.
 
== షవ్వాల్ ==
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు