లడ్డు బాబు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
 
== కథ ==
లడ్డు బాబు ([[అల్లరి నరేష్]]) మామూలుగా సన్నగా ఉంటాడు. కానీ అతనికి ఓ విచిత్రమైన [[దోమ]] కుట్టడంతో [[వైరస్]] సోకి కొన్ని నెలల్లో అకస్మాత్తుగా విపరీతంగా లావుగా అయిపోతాడు. దాంతో లడ్డు బాబుకు తొందరగా పెళ్ళి చేసేయాలనుకున్న అతని తండ్రి కిష్టయ్య ([[కోట శ్రీనివాసరావు]])కు అది సమస్యగా పరిణమిస్తుంది. కొడుక్కు పెళ్ళి చేసే వేరు కాపురం పెట్టేస్తే తమ పూర్వీకుల ఇల్లు అమ్మేసి [[గోవా]]<nowiki/>కు వెళ్ళిపోవాలనేది కిష్టయ్య ఆలోచన. కానీ అతని భారీ ఆకారం వలన పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అతని ఆకారమే కాకుండా అతని ప్రవర్తన వల్ల కూడా కొన్ని సంబంధాలు చెడిపోతుంటాయి. అతను తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్నది అతని ఆలోచన.
 
అదే ఊళ్ళో మూర్తి (మాస్టర్ [[అతులిత్]]) అనే పదేళ్ళ అబ్బాయి భర్త చనిపోయిన వాళ్ళ అమ్మ మాధురి ([[భూమిక చావ్లా]]) తో కలిసి నివసిస్తుంటాడు. లడ్డు బాబు మూర్తితో స్నేహం చేయడానికి ఒప్పుకోకపోవడంతో మూర్తి తన స్నేహితులతో కలిసి అతన్ని ఆటపట్టిస్తూ ఉంటాడు. ఇంతలో లడ్డు బాబు మాయ ([[పూర్ణ]]) అనే అమ్మాయిని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అనేకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ప్రయత్నాలన్నింటినీ మూర్తి గ్యాంగ్ అడ్డుకుంటూ ఉంటుంది. ఒకరోజు మూర్తి వాళ్ళు ఆటపట్టించడం వల్ల లడ్డు బాబు తన తండ్రి ఇద్దరు కవల పిల్లలతో ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల సమయానికి ఇంటికి వెళ్ళలేక పోతాడు. దాంతో అతని తండ్రి అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు.
"https://te.wikipedia.org/wiki/లడ్డు_బాబు" నుండి వెలికితీశారు