లంక సత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 29:
సత్యానికి మంచి గుర్తింపు, పేరూ తెచ్చిన సినిమా '''[[బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)|బాలనాగమ్మ]]''' ఇందులో ఆయన [[చాకలి]] తిప్పడు వేషం వేసి, బాగా నవ్వించారు. దాంతో హాస్యపాత్రలు బాగా వచ్చాయి. [[గూడవల్లి రామబ్రహ్మం]] [[మాయలోకం]] (1945) తీసినప్పుడు సత్యంగారు సహాయ దర్శకుడిగా పనిచేస్తూ [[కాంభోజరాజు కథ|కాంభోజరాజు]] కొడుకుగా వేశారు. ఒక పక్క వేషాలు వేస్తూ చిత్రాలు కూడా దర్శకత్వం వహించారు సత్యం.
 
'సర్కార్ ఎక్స్‌ప్రెస్ ' (1968) సినిమా లంక సత్యంగారు డైరెక్టు చేసినప్పుడు, అందులో నేను నటించాను. అప్పుడు నేను ఆనాటి విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాను. 'సర్కార్ ఎక్స్‌ప్రెస్ ' నే 'బెంగళూర్ మెయిల్ ' పేరుతో [[కన్నడ భాష|కన్నడం]]<nowiki/>లో తీస్తే అదీ సత్యంగారే డైరెక్టు చేశారు. ఎన్.టి.ఆర్. తీసిన [[గులేబకావళి కథ]], విజయావారి [[జగదేక వీరునికథ]], [[రహస్యం (సినిమా)|రహస్యం]] (1967) మొదలైన చిత్రాల్లో సత్యంగారు హాస్య పాత్రలు చేశారు.
 
''మొదటి రోజుల్లో హాస్యం చేసిన వాళ్ళని 'కామిక్ యాక్టర్స్' అనేవాళ్లు - చులకనగా. తర్వాత నుంచి మంచి హాస్యనటులు రావడంతో, హాస్యానికి ప్రాధాన్యత పెరిగింది. ''కమేడియన్స్ '' అని పేరుపొందారు. సినిమాల్లో హాస్యానికి పెద్ద పీట వేశారు. శివరావు, రేలంగి వంటి వాళ్లు వచ్చిన తర్వాత, మంచి హాస్య పాత్రలు వచ్చాయి. తర్వాత ఎందరో హాస్యనటులు వచ్చి, సినిమా హాస్యానికి విలువ పెంచారు '' అని చెప్పారొక సారి సత్యంగారు.
 
కొన్నేళ్ల క్రితం కాజీపేట దగ్గర రైలు ప్రమాదం జరిగి, చాలామంది మరణించారు. అప్పట్లో మొదటి తరగతి వుండేది. ఆ క్లాసులో ప్రయాణించిన లంకసత్యం కూడా మరణించినట్లు పత్రికలో పేరు వచ్చింది. కానీ, ఆయన [[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లో రైలెక్కి, ఘటకేసర్‌లో మిత్రుల బలవంతంతో దిగిపోయారు. ఈ సంగతి తెలియదు.
 
''పోయిన వాడిని తిరిగి వచ్చేసరికి - బంధువులకీ, మిత్రులకీ కలిగిన ఆనందం - ఎప్పుడూ చూడలేదు. నాకింకా ఈ భూమ్మీద నూకలు చెల్లిపోలేదు కాబోలు - దేవుడు నన్ను బతికించాడూ' అని చెప్పారు సత్యం - ఆ సందర్భంలో.
 
===[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] ===
[[తెలుగు]]<nowiki/>లో మొదటిసారిగా వచ్చిన హాస్యచిత్రం 1940 నాటి '''[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]]'''. [[మొక్కపాటి నరసింహశాస్త్రి]]గారు రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఏమీ తెలియని ఒక పల్లెటూరి యువకుడు, ఓడలో బయల్దేరి [[లండన్]] వెళ్లడం కథ. దారంతా అతని చేష్టలు నవ్విస్తాయి. ఈ పాత్ర ధరించి నవ్వించినది - లంక సత్యం. మోడ్రన్ యునైటెడ్ ఆర్టిస్ట్స్, కంపెనీ పేరు మీద ఆర్.ఎస్. ప్రకాష్ ఈ సినిమా దర్శకత్వం వహించాడు. తెలుగువారిలో మొదటి మూకీ నిర్మించిన [[రఘుపతి వెంకయ్య]]గారి కుమారుడు ప్రకాష్. ఐతే, ఈ సినిమా నిడివి - అంటే, ఆ రోజుల్లో సినిమా మూడుగంటలైనా నడవాలి - చాలనందువల్ల ఇంకో రెండు చిన్న హాస్య సినిమాలు కలిపి విడుదల చేశారు. అవి బొండాం పెళ్ళి, చదువుకున్న భార్య. ఈ సినిమాలకు [[హెచ్.ఎమ్.రెడ్డి]] దర్శకత్వం వహిస్తే [[ఎల్.వి.ప్రసాద్]] నటించారు. తర్వాత ప్రఖ్యాత నటిగా రాణించిన [[జి. వరలక్ష్మికి]]కి బారిష్టరు పార్వతీశం తొలి సినిమా.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/లంక_సత్యం" నుండి వెలికితీశారు