వి.కె.ఆదినారాయణ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

→‎జీవిత విశేషాలు: లింకుల క్రమబద్ధీకరణ
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Vkadinarayanareddy.jpg|thumb|right|వి.కె.ఆదినారాయణ రెడ్డి]]
'''[[వి.కె.ఆదినారాయణ రెడ్డి]]''' ( వలిపిరెడ్డి గారి కొండారెడ్డి గారి ఆదినారాయణరెడ్డి) [[అనంతపురం జిల్లా]]<nowiki/>కు చెందిన స్వాతంత్ర్యసమరయోధుడు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు అనంతపురం జిల్లా, [[పెద్దపప్పూరు]] మండలం, చీమలవాగుపల్లిలో [[1917]], [[అక్టోబర్ 8]]వ తేదీన వి.కె.రంగప్ప, వి.కె.రంగమ్మ దంపతులకు జన్మించాడు<ref>స్వాతంత్ర్యయోధుడు వి.కె.ఆదినారాయణరెడ్డి - అనంతనేత్రం - వార్త దినపత్రిక జిల్లా ప్రత్యేకసంచిక - పేజీ 115</ref>. చీమలవాగుపల్లిలో ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత ఇతడూ [[తాడిపత్రి]] హైస్కూలులో సెకండ్ ఫారమ్‌ వరకు చదివాడు. తరువాత [[గుత్తి]]లోని లండన్ మిషన్ హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివాడు. వల్లూరు రామారావు అనే ఆయన ప్రేరేపణతో స్వాతంత్ర్యం కోసం పోరాడే కాంగ్రెస్ రాజకీయాలవైపు ఆకర్షితుడైనాడు. 1937లో జరిగిన [[మద్రాసు]] శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున [[గ్రామాలు]] తిరిగి ప్రచారం చేశాడు. తమ సామాజిక వర్గం నుండి, బంధువుల నుండి [[జస్టిస్ పార్టీ]]ని బలపరచాలని వత్తిడి వచ్చినా స్వతంత్రం కోసం పోరాడే కాంగ్రెస్ కే ప్రచారం చేశాడు.