వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1899 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[File:Vemuri Saradamba.jpg|thumb|Vemuri Saradamba]]
19వ శతాభ్ధములో స్కృతాంద్రములనభ్యసించి, సంగీత సాహిత్యములలో ప్రావీణ్యత సాధించిన మహిళలు బహు కొద్దిమంది. విద్యా రహితులుగ చేయబడిన సాటి మహిళల దుర్భరస్థితిగతులను వెలిబుచ్చి చరిత్ర సృష్టించి స్త్రీలకువిద్యాబోధన అవసరమని ఉద్యమం ఆరంభించి అభ్యుదయ ధృక్పదముతో రచనలు చేసి వెలుగులోకివచ్చినవారు ఇంకా అరుదు. అట్టి మహిళారత్నములలో నొకరు '''వేమూరి (దాసు)శారదాంబ''' (1881-1899). సాంప్రదాయనెపముతో నిబంధనలు, నియమములు విధించి స్త్రీలను గృహబంధితులగ యుంచుట 19వశతాబ్దమునాటి సర్వసాధారణమైన విషయం. అప్పటిసాంఘిక పరిస్థితులలో బాలికలు విద్యనభ్యసించనవసరములేదనీ, సంగీతసాహిత్యములు మొదలగు లలితకళలు స్త్రీలకు తగనివన్న భావనయుండెను. 19 వ శతాబ్దమధ్య కాలములో ప్రవేశించిన సంఘసంస్కరణోద్యమములు తెలుగునాట క్రమేపి ఆదరణపోందెను. సామాజిక నియమ ఉల్లంఘనలకు సంఘబహిష్కరణ, వెలి ప్రాయశ్చిత్తము మొదలగు ఆంక్షలు ఆశతాబ్దపు చివరినాటికింకనూ సాగుచునేయుండెను. స్త్రీలకు విద్యాభ్యాసము, సంగీత సాహిత్యములలో ప్రవేశము అప్పటికింకనూ అరుదుగనేయుండెనని [[చరిత్ర]]<nowiki/>లో కనబడుచున్నది. స్త్రీలపైగల వివక్షత ఆనాడు యుండియున్ననూ తన తండ్రిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్పపలుకుబడిగల్గి పురప్రముఖుడునూ మహాకవి అగు [[దాసు శ్రీరాములు]] గారగుట వలన వారి ప్రోత్సాహముతో ఆమె సంస్కృతాంధ్ర విద్యనభ్యసించగల్గెను. అంతేగాక సంగీత సాహిత్యములలో బాల్యములోనే అతీతమైన ప్రవీణ్యత సాధించెను. చిననాట పిత్రుపరిరక్షణలోనే సంగీత కచేరీలు చేసి గాయకురాలుగా గుర్తింపుపొందినది. తంఢ్రిగారి అపార పాండిత్యానికి తగు వారసురాలు గానుండటకునూ, అఖండ కవయిత్రిగానగుటకు తగిన సర్వసతీ కటాక్షముతోనూ జన్మించిన ఆమె అకాలముగా 19 వ ఏటనే 1899 లో మరణించిన పిదప, ఆమె పాండిత్య-కవితా సామర్ధ్యమును చాటునట్టి ఆమె రచనలు రెండు (మాధవ శతకం, నాగ్నజితీ పరిణయం) కవిసార్వభౌమ [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారి దృష్టికి రావడం సంభవించినది. ఇంటిపట్టుననే యుండి సాధించిన అఖండ పాండిత్యమును చాటు ఆ పద్యములను చూసిన శాస్త్రిగారు ఆశ్చర్యపడి వాటిని 1901లో తాము సంకలనము చేయుచున్న కళావతి అను మాస పత్రికలో మాధవ శతకముగా మూడు భాగములుగ ప్రచురించి కీ. శే. వేమూరి (దాసు) శారదాంబ గారి అపార కవితా కౌశలాన్ని తెలుగునాట వెలుగులోకి తెచ్చారు.<ref name= "మాధవ శతకము">"మాధవ శతకము(స్త్రీ క్షేమార్ధక భగవత్ర్పార్ధన పద్యములు) రచయిత్రి వేమూరి(దాసు) శారదాంబ" (2019). pp1-61 మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి</ref> ఆమె రచించిన నాగజితీ పరిణయ కావ్యమును ఎవరు ఎక్కడ ప్రచురించినదీ ఇప్పటకీ తలియనప్పటికినీ ఆ కావ్యము గూడా బహుశః శాస్త్రిగారే ప్రచురించియుందురని ఊహించవచ్చు. కాని కాల క్రమేణా ఆ ప్రచురణలు కాలగర్భములో కలసిపోయి వాటి ప్రతులు కూడా అలభ్యమైనవి. 1973లో స్తాపించిన [[దాసు శ్రీరాములు స్మారక సమితి]] వారు కూడా ఆ రెండు రచనల ప్రతులకొరకు చాలా కాలం ప్రయత్నంచేసి విఫలురైరి. ఒక శతాబ్దముపైగా (115 ఏడ్లు) కాలం గడచిపోయిన తరువాత అదృష్టవశాత్తు ఈ మధ్యనే వాటి ప్రతులు సంపాదించి ఈ రెండు రచనలనూ పునర్ముద్రణచేసి 2019 జూలైలో ప్రకటించారు. ఇందలి ముందుమాట, పీఠికల లో శారదాంబ గారి అఖండ కవితాశైలి ఘనంగా వర్ణించబడినది. ఈ రెండు వుస్తకముల ప్రతులకు ఆ సమితి ముఖ్య కార్యకాలీన అధినేత డా. దాసు అచ్యుతరావు (9490023947, 04023734864)ను సంప్రతించ వలయును. స్త్రీలపట్లగల వివక్షతకు వాపోయి వారి దుర్భర స్థితిగతులుమెరుగు పరచుటకు విద్యాభ్యాసము అనివార్యమని ఘోషించి ఆనాటి పరిస్తితులకెదురీది మెట్టింటివారి నిరుత్సాహక వాతావారణమునుకూడ భరించి, భగవత్ప్రార్థనా రూపములో మాధవా అను సంబోధనా మకుటముతో 101 పద్యములు గల మాధవ శతకమునూ , నాగ్నజీతి పరిణయము అను కావ్య ప్రబంధమునూ సాహసించి రచించి తన కవితా కౌశలమును చాటిన శారదాంబగారు చిరస్మరణీయులు.<ref>"స్త్రీ జనక్షేమార్ధి శ్రీమతి వేమూరి శారదాంబ" డా. దాసు అచ్యుతరావు(2014) వార్త, హైదరాబాదు శుక్రవారం డిసెంబరు 26, 2014</ref><ref name="అచ్యుతరావు(2015)">అలనాటి అభ్యుదయవాది, స్త్రీ విద్యాహితైషిః శ్రీమతి వేమూరి శారదాంబ డా.దాసు అచ్యుతరావు(2015) కిరణసాహితి మాసపత్రిక 28,29. మే 2015</ref> ఆకాలము గా మరణించిన తన కుమార్తె యొక్క అసాధారణ కవితా సామర్ధ్యమును తెలియజేయుచూ మహా కవి దాసు శ్రీరాములు గారు రచించిన దేవీ బాగవతములో ని రెండు పద్యములు చెప్పవలసియుండెను:
<poem>
సీ. తనతొమ్మిదవయేట ననుపమాన ప్రజ్ఞ నింపుగా వీణ వాయింప నేర్చె
పంక్తి 13:
==జీవిత విశేషములు==
===బాల్యమందే అబ్బిన అపార విద్య===
1881 మే నెల 3 తారీకున ఇప్పటి [[కృష్ణాజిల్లా]]<nowiki/>లోని [[ముదినేపల్లి]] మండలములోని [[అల్లూరు]] గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్థక నామధేయ దాసు శారదాంబ. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రస్స్ అను ప్రముఖ ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, ప్రముఖ న్యాయవాదులైన దాసు నారాయణరావు, మాధవరావు, గోవిందరావు, [[దాసు విష్ణు రావు]], మధుసూదనరావుల సోదరీమణి. వివాహానంతరము సాహిత్యకృషివల్ల వేమూరి శారదాంబగా ప్రసిధ్ధి చెందెను. [[తండ్రి]] దాసు శ్రీరాములు (1846-1908) వృత్తిరీత్యా [[ఏలూరు]]<nowiki/>లో న్యాయవాదేగాక, జ్యోతిశాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యములలో అపారమైన పాండిత్యము కలిగియుండి 'దేవీభాగవతము'రచించి మహాకవిగా ప్రసింధ్దిచెందెను. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘసంస్కరణాభిలాషి. ఆధునికదృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసమనివార్యమని ప్రచారముచేయుటయెగాక ఆనాటి సమాజమందు అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక తన కుమార్తెకు స్వయముగా విద్యాభ్యాసముచేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యెను. ఏలూరులో సంగీత పాఠశాలకూడా నెలకొల్పెను. [[రాజమండ్రి|రాజమహేంద్రవరము]]<nowiki/>లోని సుప్రసిధ్ద సంఘసంస్కరణకర్త, [[కందుకూరి వీరేశలింగం పంతులు]], విజయనగరంలోని మహాకవి గురజాడ అప్పారావు గారు సమకాలీకులు. ఏక సంతాగ్రాహి అయిన శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన [[కోమండూరి నరసింహాచారి]], [[ఈమని వెంకటరత్నం]] వద్ద [[సంగీతము]] నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించెను. తండ్రిగారి పర్యవేక్షణలో సంగీతముతోపాటు విద్యాభ్యాసముచేసి సంస్కృతాంధ్రములో పాండిత్యము గడించెను. [[మైసూరు]], బెంగుళూరు పట్టణములందు జరిగిన సంగీత సమ్మే్ళణములలో వీణా వాయిద్య కచేరీ చే్సెను. ఆనాటి సాంప్రదాయప్రకారము 7వ ఏటనే శారదాంబ [[పెళ్ళి|వివాహం]] 1888 మే నెలలో బందరువాస్తవ్యులు వేమూరి రామచంద్రరావుతో జరిగెను. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహము బహుప్రయత్నానంతరము జరిగినటుల తెలియుచున్నది.
 
==స్వల్పజీవితకాలం, సాహిత్యకృషి==
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు