వేలు నాచియార్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 21:
'''రాణి [[వేలు నాచియార్]]''' (3 జనవరి 1730 – 25 డిసెంబరు 1796) [[శివగంగై|శివగంగ]] సంస్థానాన్ని 1780-1790 మధ్యలో పరిపాలించిన [[రాణి]]. ఈమె [[బ్రిటిష్]] అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి [[భారత దేశము|భారతీయ]] మహారాణి. ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా [[తమిళులు]] ఈమెను వీరమంగై ("వీరవనిత") అని పిలుస్తారు.{{మూలాలు అవసరం}}
== జీవితం ==
వేలు నాచియార్ [[రామనాథపురం]] ప్రాంతానికి యువరాణి. ఈమె రామనాడు రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి ,  రాణి సాకందిముత్తల్ ల ఏకైక పుత్రిక. నాచియార్ చిన్నతనం నుండే యుద్ధవిద్యలలో ఆరితేరింది. [[విలువిద్య]],  గుర్రపుస్వారీ,  వలరి, సిలంబం(కర్రసాము) వంటి యుద్ధనైపుణ్యాలలో దిట్ట. అంతే కాదు, చాలా భాషలలో పండితురాలు. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]], [[ఆంగ్ల భాష|ఆంగ్లము]] ఇంకా [[ఉర్దూ భాష|ఊర్దూ]]<nowiki/>భాషలు ఆమెకి కరతలామలకం. ఈమెకు శివగంగై రాజైన మన్నార్ ముత్తువడుగనాథ పెరియవ ఉడైతేవర్ తో [[వివాహం]]<nowiki/>జరిగింది. వీరికి ఒక పుత్రిక కూడా జన్మించింది. ఈమె భర్తను బ్రిటిష్ సైనికులు, ఆర్కాట్ నవాబు కొడుకుకలిసి కైలయార్ కోయిల్ యుద్ధం లో హతమార్చారు. దీంతో నాచియార్ యుద్ధానికిసన్నద్ధమైంది. కానీ సైన్యం లేకపోవడంతో [[దిండిగల్]] వద్ద విరూపాక్షి ప్రాంతంలో పలయకారర్ కొపాల నాయక్కర్ అండలో  తన [[కుమార్తె]]<nowiki/>తో కలిసి ఎనిమిదేళ్లపాటు తలదాచుకోవలసి వచ్చింది.
 
ఈ కాలంలోనే గోపాల్ నాయకర్, సుల్తాన్ [[హైదర్ అలీ]] సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది నాచియార్. బ్రిటిష్ ఆయుధాగారన్ని తన సేనా నాయికురాలైన కుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది  "ఉడైయాల్" అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించింది. తన సాహసంతో రాజ్యాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఎన్నో కష్టాలకోర్చి చివరికి  తన  రాజ్యాన్ని  తిరిగి సంపాదించిన అతికొద్దిమందిలో నాచియార్ ఒకరు. 1970 లో ఆమె తరువాత ఆమె కుమార్తె వెల్లచ్చి [[శివగంగై|శివగంగ]]<nowiki/>సంస్థానానికి రాణి అయింది. హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించింది. వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొంది.
 
[[భారతదేశం]]<nowiki/>లో బ్రిటిష్ వారిపై పోరాటం సాగించిన మొట్టమొదటి రాణి వేలు నాచియార్. ఆమె 1780 లో మురుతు సోదరులకి పరిపాలనాధికారాన్ని ఇచ్చింది. ఆ తరువాత కొద్దికాలానికే, 25 డిసెంబరు 1796లో ఆమె కన్నుమూసింది. ఆమెను "జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు.
== వనరులు ==
* [https://web.archive.org/web/20151127030006/http://sarasabharati-vuyyuru.com/2014/08/11/%e0%b0%9c%e0%b1%8b%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be/]<br>
"https://te.wikipedia.org/wiki/వేలు_నాచియార్" నుండి వెలికితీశారు