శాంతి స్వరూప్ భట్నాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 33:
శాంతిస్వరూప్ భట్నాగర్ గురించి తెలియనివారుండరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (CSIR) వారు ఏటేటా ఇచ్చే శాంతిస్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్ధం ఏర్పరచినదే. [[భారత దేశము|భారతదేశం]] నిండుగా గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్.
 
ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో 1894 ఫిబ్రవరి 21న భట్నాగర్ జన్మించాడు.చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తన తాతగారింట పెరిగాడు. వాళ్ళ తాత ఓ పెద్ద ఇంజనీరు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. [[కవిత్వం]]<nowiki/>లో మంచి ప్రవేశముండేది.
 
ఇప్పటి పాకిస్తాన్లొ ఉన్న రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ [[చమురు]] అన్వేషణా కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పునీటితో కలిసి గట్టిగా రాయిలాగామారి, డ్రిల్లింగ్కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పనిపూర్తిగా ఆగిపోయేది. అపుడు కంపెనీవారు భట్నాగర్ను సలహా కోసం ఆశ్రయించారు. ఎమల్షన్ కొల్లాయిడ్లతో పరిశోధనలు చేసి 1921లో లండన్ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న భట్నాగర్ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి అతిసులభమైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురుకలపమని సలహా ఇచ్చాడు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత (Viscosity) తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటీష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయటపడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు లక్షాయాభై వేల రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మున లాహొరు యూనివర్శిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు. చూశారా! భట్నాగర్ ఔదార్యం.