"శేఖర్ సూరి" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (→‎కెరీర్: AWB తో "మరియు" ల తొలగింపు)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
== వ్యక్తిగత వివరాలు ==
శేఖర్ సూరి [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[తణుకు]]<nowiki/>లో జన్మించాడు. చిన్నతనంలో [[టీవీ]] సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన గాడ్ ఫాదర్ ధారావాహిక అంటే ఇష్టంగా చూసేవాడు. అప్పుడు ప్రారంభమైన ఆ ఆసక్తి అతను గ్రాడ్యుయేషన్ లో చేరే దాకా కొనసాగింది. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేరాడు. చాలా రోజులు [[హైదరాబాదు]]<nowiki/>లో ఉన్నాడు. సినిమా రంగంమీద ఆసక్తితో చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి అవకాశాల కోసం ముంబైకి ప్రయాణమయ్యాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=శేఖర్ సూరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Shekhar-Suri/jum7ev13b3|website=tollywoodtimes.com|accessdate=9 November 2016}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
శేఖర్ సూరి అసలు పేరు ఎస్. ఎస్. చంద్రశేఖర్, అయితే సినిమా పరిశ్రమలో చంద్రశేఖర్ పేరుతో చాలామంది కళాకారులు ఉండటంతో కొత్తగా ఉండటం కోసం శేఖర్ సూరిగా మార్చుకున్నాడు. [[తెలుగు]]<nowiki/>లో మరో ప్రముఖ దర్శకుడైన [[ఇంద్రగంటి మోహన కృష్ణ|ఇంద్రగంటి మోహనకృష్ణ]] ఇతనికి బంధువు.
 
== కెరీర్ ==
సినిమా దర్శకుడు కావాలనే కోరికతో [[ముంబై]] చేరుకున్నాడు. సుమారు 8 సంవత్సరాలపాటు సస్పెన్సు తో కూడుకున్న టీవీ కార్యక్రమాలు, సినిమాలకు ఘోస్ట్ [[రచయిత]]<nowiki/>గా పనిచేశాడు. [[సంజయ్ దత్]] తో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. చివరికి వేరే దారి లేక మళ్ళీ [[హైదరాబాదు]] చేరుకున్నాడు. తరువాత హైదరాబాదులో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఓ స్నేహితుడి సాయంతో హీరో [[తరుణ్ కుమార్|తరుణ్]] తో పరిచయం అయింది. తరుణ్ ఇతనిని సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాతకు పరిచయం చేశాడు. అలా అతనికి మొదటగా తరుణ్ తో [[అదృష్టం (సినిమా)|అదృష్టం]] అనే సినిమా తీశాడు. రోమన్ హాలిడే అనే ఓ హాలీవుడ్ చిత్రం తరహాలో చిత్రాన్ని తీశాడు. కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత కొద్దిగా సమయం తీసుకుని తనకిష్టమైన థ్రిల్లర్ బాణీలో సొంతంగా తనే ఓ కథ తయారు చేసుకున్నాడు. రాజీవ్ కనకాల, రిచర్డ్ రిషి, మోనా చోప్రా ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన [[ఎ ఫిల్మ్ బై అరవింద్]] మంచి [[విజయం]] సాధించింది. బాలనటుడిగా పరిచమై అప్పటి దాకా పెద్దగా అవకాశాలు లేని రిషికి ఈ సినిమా తర్వాత ఏడు సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. దీని తర్వాత అదే బాణీలో త్రీ, అరవింద్ 2 సినిమాలు కూడా తీశాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2988801" నుండి వెలికితీశారు