శ్రీ పాద వల్లభాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 15:
'''శ్రీ పాద వల్లభాచార్యులూ''' (1479-1531) [[భక్తి]] తత్త్వజ్ఞుడు. [[భారత దేశం]]లోని శుద్ధ అద్వైతాన్ని పాటించే పుష్టి మతాన్ని స్థాపించాడు. ఇతడు [[వైష్ణవ మతం |వైష్ణవ మత]] [[గురువు|ఆచార్యుడు]]. జన్మతః [[తెలుగు]] [[వైదికుల కులం]]లో పుట్టాడు.
==బాల్యం==
శుద్ధాద్వైతి అయిన వల్లభాచార్యుడు 1479 లో కంకరవ గ్రామంలో లక్ష్మణభట్టు, ఎలమగర దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. వారిది వైష్ణవ పండిత వంశం, వైదిక నిష్ఠా [[కుటుంబము|కుటుంబం]]. వల్లభుని బాల్యం, విద్యాభ్యాసం [[కాశీ]]<nowiki/>లో గడిచాయి. యుక్తవయసు వచ్చేసరికే వేదవేదాంగాలు, వివిధ శాస్త్రాలు, అష్టాదశ [[పురాణములు|పురాణాలు]] పఠించాడు.
==దేశాటనం==
పెద్దవాడైన తర్వాత వైష్ణవమత వ్యాప్తిని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. దేశమంతా పెక్కుసార్లు తిరిగి, వివిధ ప్రదేశాలలో వివిధ మతస్థులతో వాదోపవాదాలు జరిపి తన మతానికి మళ్ళించాడు. [[శ్రీ కృష్ణదేవ రాయలు|కృష్ణదేవరాయల]] పరిపాలనా కాలంలో ఆంధ్రప్రాంతమైన విజయనగరం వచ్చి రాజాస్థానంలోని శైవులను వాదంలో ఓడించాడు. అక్కడినుండి ఉత్తరాభిముఖంగా ప్రయాణించి [[ఉజ్జయిని]], [[ప్రయాగ]], [[కాశీ]], [[హరిద్వార్]], [[బద్రీనాథ్|బదరీనాథ్]], [[కేదార్‌నాథ్]] మొదలైన పుణ్యస్థలాలను దర్శించి, చివరికి [[మథుర]]<nowiki/>వద్ద బృందావనంలో కొంతకాలం నివసించాడు.
[[File:Shrinathji discovered.jpg|thumb|220px| [[Vallabhacharya]] discovers [[Shrinathji]], at Mount [[Govardhan]]]]
ఒకనాడు వల్లభునికి [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడు]] కలలో కనపడి, సమీపంలోని గోవర్ధనగిరిపై ఒకచోట శ్రీనాథ విగ్రహం కలదని, దాన్ని త్రవ్వితీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించి, పూజాదికాలు జరిగేటట్టు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విధంగానే అక్కడ వల్లభాచార్యుడు 1520లో శ్రీనాథాలయం నిర్మించాడు. అందుకే వల్లభుని మతాన్ని శ్రీనాథ మతం అంటారు. మథురనుంచి తిరిగి [[కాశీ]] చేరుకుని అక్కడ స్థిరపడ్డాడు.
పంక్తి 26:
[[శంకరాచార్యుడు | శంకరాచార్యుని]] సిద్ధాంతాలతో వల్లభుడు విభేదించాడు. పరబ్రహ్మమును మాయ ఆవరించి మరుగుపరుస్తుందన్న వాదాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే ఈ వాదంలో మాయ ద్వితీయతత్త్వం అయింది. కాబట్టి అది [[అద్వైతం | అద్వైతా]]నికి విరుద్ధం. మాయావృతం కాని పరబ్రహ్మమే పరమసత్యమని ప్రతిపాదించడు. మాయావాదాన్ని తిరస్కరించడంవలన అతని వాదానికి [[శుద్ధాద్వైతం | శుద్ధాద్వైతమ]]నే పేరు వచ్చింది.
==తత్త్వచింతన==
పరమాత్మ సచ్చిదానంద స్వరూపం కాగా, జీవుడు సత్‌చిత్ రూపం మాత్రమే. అతడినుంచి [[ఈశ్వరుడు]] ఆనందాన్ని మరుగుపరిచాడు. అందుచేతనే జీవుడు అజ్ఞానవశుడై, సంసారబద్ధుడై దుఃఖితుడవుతున్నాడు. ఇక జడ జగత్తు సద్రూపం మాత్రమే. దాని నుంచి ఈశ్వరుడు తన చిత్, ఆనంద లక్షణాలను మరుగుపరిచాడు. అయినప్పటికీ పరమాత్మనుంచి పరణమించినవైనందున జీవాత్మలు, [[జగత్తు]] [[పరమాత్మ]]<nowiki/>తో తాదాత్మ్యం కలిగినవే.
==నిర్యాణం==
వల్లభాచార్యుడు 1531లో నిర్యాణం చెందాడు.