శ్రీమణి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 12:
 
== వ్యక్తిగత జీవితం ==
శ్రీమణి అసలు పేరు పాగోలు గిరీష్. అతనికి శ్రీ అనే పదం ఇష్టం కావడంతో తల్లిపేరులోని మణితో కలిసి శ్రీమణి అని పేరు మార్చుకున్నాడు. శ్రీమణి పుట్టింది విజయవాడ అయినా అతని స్వస్థలం [[ప్రకాశం జిల్లా]], [[చీరాల]]. తండ్రి పాగోలు వెంకటాచలం అతనికి ఎనిమిదేళ్ళ వయసులో చనిపోయాడు. తల్లి నాగమణి అతనికి పన్నెండేళ్ళ వయసులో మరణించింది. దాంతో శ్రీమణి, అతని తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. ఎనిమిదో తరగతి దాకా చీరాలలోనే చదువుకున్నాడు. తొమ్మిది, పదో తరగతులు నందిగామ లోని పిన్నివాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం అమ్మమ్మ దగ్గరికి వచ్చేశాడు. తొమ్మిదో తగరతి చదివేటప్పటి నుంచి కవిత్వం, రచనలపై మక్కువ పెంచుకున్నాడు. తానే స్వంతంగా సందర్భాలు సృష్టించుకుని పాటలు రాసుకునే వాడు. ఇవి విన్నవారు ఇది ఏ సినిమాలోది అని అడిగేవారు. దాంతో అతనికి సినిమాల్లో పాటల రచయితా ప్రయత్నం చేస్తే బాగుండుననిపించింది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి కాగానే, తాను రాసిన పాటల పుస్తకం తీసుకునని గేయరచయితగా అవకాశాల కోసం [[హైదరాబాదు]]<nowiki/>కు వచ్చాడు. పాటల రచయితగా ప్రయత్నాలు చేస్తూనే హైదరాబాదులోని వనస్థలిపురంలో 2006 జూన్ నుంచి డిసెంబరు దాకా క్రాంతి ట్రాన్స్ పోర్టు కంపెనీలో గుమాస్తాగా పార్ట్ టైమ్ ఉద్యోగం చేశాడు.
 
తరువాత సురేష్ అనే ఒక స్నేహితుడి సలహాతో ఫిల్మ్ నగర్ కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశ్యంతో 2007 లో యూసఫ్ గూడా కి మారాడు. అక్కడ కొద్ది రోజులు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేశాడు. ముహూర్తం అనే సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది. కానీ టైటిల్స్ లో అతని పేరు లేదు. కొంతకాలం ఘోస్టు రైటరుగా పని చేశాడు. ఇలాగైతే గుర్తింపు రాదనే ఉద్దేశ్యంతో బాబాయి సలహాతో అపోలో ఆస్పత్రిలో బీ పాజిటివ్ అనే మ్యాగజీన్ కి మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ గా చేరాడు. అక్కడ ఆగస్టు 2008 నుంచి 2010, ఆగస్టు వరకు పనిచేశాడు. ఆ మ్యాగజీన్ కు రాం చరణ్ భార్యయైన ఉపాసన కామినేని ప్రచురణ కర్త.
"https://te.wikipedia.org/wiki/శ్రీమణి" నుండి వెలికితీశారు