సముద్రాల రాఘవాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (50), typos fixed: → (2), , → , (50)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
 
==జీవిత విశేషాలు==
సముద్రాల వేంకట రాఘవాచార్య [[గుంటూరు జిల్లా]], [[పెదపులివర్రు (భట్టిప్రోలు)]] గ్రామంలో [[1902]], [[జూలై 19]]వ తేదీన పండితవంశంలో జన్మించాడు. ఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. ఇతడు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో "భాషాప్రవీణ" పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని కారాగారశిక్షను అనుభవించాడు. 1918 నుండి అవధానాలను చేయడం మొదలుపెట్టాడు. ఇతని అవధాన ప్రావీణ్యాన్ని గురించి విన్న [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి]] ఇతడిని తన కుమారునికి తెలుగు నేర్పవలసినదిగా కోరాడు. అతని అభ్యర్థనను మన్నించిన సముద్రాల తన మకామును [[గుంటూరు]]కు మార్చాడు. అక్కడ ఇతనికి [[కొసరాజు రాఘవయ్య చౌదరి]], [[గూడవల్లి రామబ్రహ్మం]]లతో స్నేహం ఏర్పడింది. [[కట్టమంచి రామలింగారెడ్డి]] రెడ్ల చరిత్రపై పరిశోధన చేస్తున్నట్టు తెలుసుకున్న కుప్పుస్వామి చౌదరి ఇతడిని, కొసరాజును, గూడవల్లిని మద్రాసు వెళ్లి కమ్మ చరిత్రపై పరిశోధనలు చేయవలసినదిగా ఆదేశించాడు. [[మద్రాసు]]<nowiki/>లో ఇతడు [[ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం]]లో కమ్మచరిత్రపై పరిశోధన చేస్తూ, [[సమదర్శిని]] పత్రికలో కూడా పనిచేశాడు. సమదర్శిని కారణాంతరాల వల్ల నిలిచిపోగా ఇతడు మళ్ళీ గుంటూరుకు చేరాడు. కృష్ణాజిల్లా ప్రజామిత్ర పక్షం వారు [[విజయవాడ]]లో ప్రారంభించిన [[ప్రజామిత్ర]] పత్రికను మద్రాసుకు తరలించి దానికి సంపాదకుడిగా గూడవల్లిని నియమించారు. గూడవల్లి అభ్యర్థన మేరకు ఇతడు తిరిగి మద్రాసు చేరి ప్రజామిత్రలో సహాయ సంపాదకునిగా చేరాడు. ప్రజామిత్ర ప్రచురించే బి.ఎన్.కె ప్రెస్ యజమానులైన [[బి.యన్.రెడ్డి]], [[బి.నాగిరెడ్డి]] సోదరులతో ఇతనికి పరిచయం ఏర్పడింది<ref name="పైడిపాల">{{cite book|last1=పైడిపాల|title=తెలుగు సినీగేయకవుల చరిత్ర|date=2010|publisher=స్నేహ ప్రచురణలు|location=చెన్నై|pages=51-72|edition=ప్రథమ|accessdate=30 November 2016}}</ref>.
 
==తెలుగు చిత్ర పరిశ్రమ==
===సినీరంగప్రవేశం===
వేల్ పిక్చర్స్ అధినేత పి.వి.దాస్‌తో [[గూడవల్లి రామబ్రహ్మం]]<nowiki/>కు ఉన్న పరిచయం వల్ల ఆయనతోపాటు సముద్రాల రాఘవాచార్య తరచూ స్టూడియోకు వెళుతుండేవాడు. ఆ స్నేహంతో [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకళ్యాణం]], [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]] సినిమాలకు ప్రకటనలు వ్రాసియిచ్చాడు. తరువాత వేల్ పిక్చర్స్ వారి [[మాయాబజార్ (1936 సినిమా)|మాయాబజార్]],[[ద్రౌపదీ వస్త్రాపహరణం]] సినిమాలలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమైతే సహకరించాడు. ఆ విధంగా ఇతడు సినిమా రచనలో అనుకోకుండా వేలుపెట్టాడు. తరువాత [[కనకతార (1937 సినిమా)|కనకతార]] సినిమాలో ఇతనికి [[సంభాషణలు]], పాటలు వ్రాసే అవకాశం చిక్కింది. కనకతార నిర్మాణ సమయంలోనే బి.యన్.రెడ్డి, [[హెచ్.ఎం.రెడ్డి]]లు రోహిణీ పిక్చర్స్ అనే సినీనిర్మాణ సంస్థను స్థాపించి [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]] సినిమాకు ఇతడిని రచయితగా పెట్టుకున్నారు. తరువాత బి.యన్.రెడ్డి రోహిణి సంస్థనుండి బయటకు వచ్చి వాహినీ సంస్థను స్థాపించాడు. వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయాడు. ఇతడు దాదాపు 80 చిత్రాలకు పనిచేసి సుమారు 1000 పాటలను రచించాడు<ref name="పైడిపాల" />.
 
===రచయితగా===