సిక్కుమతం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 16:
 
==[[గురు గోవింద సింగ్]] ప్రభావం==
[[గురునానక్]], అర్జున్ ల తరువాత శిక్కుమతాన్ని అత్యంతంగా ప్రభావితం చేసినవాడు గురుగోవింద సింగ్. ఇతడు పదవ గురువూ, [[గురువు]]<nowiki/>లలో చివరివాడు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఇతని తండ్రిని ఒక మొగలాయి చక్రవర్తి చంపించాడు. గోవింద సింగ్ శిక్కులను సైనిక శక్తిగా పరివర్తితం చేయాలనుకున్నాడు. అతడు వ్యక్తిగతంగా పెద్ద వీరుడు కాక పోయినా, మొత్తం మీద శిక్కులను వీర సైనికులుగా మార్చడంలో సఫలుడయ్యాడు. తన అనుచరులందరిని "ఇంటి పేరులు" వదిలివేసి, పేరు చివర "సింగ్" (సింహం) తగిలుంచుకోమన్నాడు. స్త్రీలను తమ చివరి పేరుగా కార్ (రాకుమారి) తగిలించుకోమన్నాడు. చాలా మంది హిందూ వీరులకు కూడా ఇంటిపేరు "సింగ్" ఉంది. అందుకని ఇంటి పేర్లును ఎత్తి వేయించాడు. ప్రతి శిక్కూ సింగే కాని, ప్రతి సింగూ సిక్కు కాడని గమనించాలి.
==పంచ "క" కారాలు==
ఇతడు పంచ "క" కారాలను శిక్కులకు ఆవశ్యం చేశాడు. మొదటి "క" కారం కేశాలకు సంబంధించింది. తలపై కాని, గడ్డం పై గాని కేశ ముండన క్రియ జరపరాదు. రెండవది "కంఘ" ధారణ. అంటే జుట్టులో ఎప్పుడూ దువ్వెన ఉంచుకోవాలి. మూడవది రెండు "కభాల"ను ధరించాలి. అభాలంటే పొట్టిలాగులు - డ్రాయర్లు. ఇలా ధరిస్తే తేలికగా కదలడానికి వీలవుతుంది. నాలుగవది కుడి మణి కట్టుకు "కడా" లేదా "కరా"ను (ఉక్కు కడియాన్ని) ధరించాలి. ఇది బలం కోసం, ఆత్మ నిగ్రహం కోసం, ఐదవది "కృపాణ" ధారణ. ఇది ఆత్మ రక్షణ కోసం. ఇంకా ఇతడు ధూమ, మదిరపానాలను నిషేధించాడు. ఈ విధంగా ఇతడు శిక్కులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా మలచాడు. [[తలపాగా]], [[గడ్డం]]<nowiki/>లో వారికి ఒక ప్రత్యేకతను - చూడగానే శిక్కులని తెలిసేట్టు - కల్పించాడు.
==యితర గురువులు==
గురుగోవింద సింగ్ ఇంతా చేసి, తన తరువాత వారసుడెవడో చెప్పలేదు. "ఇక ఇక్కడి నుండి గురువులెవరూ ఉండరు. పవిత్ర గ్రంథం దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది." అన్నాడు. అతడు తన రచనలను అందులో చేర్చలేదు. అతని రచనలను "దశమ గ్రంథ్" అన్నారు. "గ్రంథ సాహిబ్" లాగ దీనిని పవిత్ర గ్రంథంగా చూడరు గాని, బాగా ఆదరిస్తారు. అంతిమంగా, అతడు ముస్లిం ల చేతిలో మరణించాడు. కాని అతడి ప్రభావం శిక్కుమతం మీద అంత ఇంత కాదు.
"https://te.wikipedia.org/wiki/సిక్కుమతం" నుండి వెలికితీశారు