సినిమా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
=== మాటలు నేర్చిన చిత్రాలు ===
 
మొదట 1900 సంవత్సరంలో [[పారిస్|పారిస్‌]]<nowiki/>లో చిత్రాలతో ధ్వని ప్రక్రియ కనుగొన్నారు. 1906లో లండన్‌లో యూజీన్ లాస్టే ఫిలిమ్‌తో ధ్వని విధానానికి పేటెంట్ పొందాడు. 1910లో ఇది ప్రయోగాత్మకంగా "J'entends très bien maintenant" అనే మాటలతో ధ్వనించింది. 1922లో [[బెర్లిన్|బెర్లిన్‌]]<nowiki/>లో ప్రేక్షకులముందు ధ్వనితో కూడిన చిత్రాన్ని ప్రదర్శించారు. 1923 నుండి [[న్యూయార్క్|న్యూయార్క్‌]]<nowiki/>లో ప్రేక్షకులు డబ్బులిచ్చి "టాకీ" (శబ్ద చిత్రం)ను చూడడం ప్రారంభించారు. 1926లో [[వార్నర్ బ్రదర్స్]] వారు "వైటాఫోన్" అనే సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. 1927లో వారి "The Jazz Singer" చిత్రం కొంత మూగ గానూ, కొంత మాటలు, పాటలు కలిపి విజయవంతంగా ప్రదర్శింపబడింది. 1928లో "The Lights of New York" అనే పూర్తి ధ్వనితో కూడిన చిత్రం వచ్చింది. ఆ తరువాత అంతా టాకీల యుగమే.
 
సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.
"https://te.wikipedia.org/wiki/సినిమా" నుండి వెలికితీశారు