సూర్యకాంతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 41:
 
==బాల్యం==
'''సూర్యకాంతం''' [[తూర్పు గోదావరి జిల్లా]] [[కాకినాడ]] దగ్గరున్న [[వెంకట కృష్ణరాయపురం]]లో [[1924]] [[అక్టోబర్ 28]]న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో [[హిందీ భాష|హిందీ]] సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. [[సినిమా]]<nowiki/>ల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక [[చెన్నై]] చేరుకొంది.<ref>http://www.imdb.com/name/nm0839763/bio</ref>
 
==సినీ జీవితం==
మొదట [[జెమినీ స్టూడియోస్|జెమిని స్టూడియో]] నిర్మించిన [[చంద్రలేఖ]] సినిమాలో [[డాన్సర్]]గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 [[రూపాయి|రూపాయలు]] చేశారు. తరువాత [[ధర్మాంగద]] (1949)లో ఆమెది మూగవేషం. [[ధర్మాంగద]] టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత [[లీలా కుమారి]] సాయంతో మొదటిసారిగా [[నారద నారది]] సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక [[జెమినీ స్టూడియోస్|జెమినీ స్టూడియో]] నుంచి బయటకు వచ్చేసింది. మనసులో [[ముంబై|బొంబాయి]]<nowiki/>కి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించు కొంది.
 
ఆ పరిస్థితిలో సహాయ నటిగా [[గృహప్రవేశం]] సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం [[సౌదామిని]] చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత [[సంసారం]] చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
"https://te.wikipedia.org/wiki/సూర్యకాంతం" నుండి వెలికితీశారు