"సైమన్ కమిషన్" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి , ఊరులో → ఊరిలో using AWB)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
== సైమన్ విచారణ సంఘమునియమించబడిన ఉద్దేశ్యములు, పూర్వోత్తర సంధర్బములు ==
<br>
విచారణ సంఘము నియమించుటలోని ఉద్దేశములు: 1919 [[సంవత్సరము]]<nowiki/>లో బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము (చూడు [[మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము]]) విడుదలచేయు సమయములో తదుపరి 10 సంవత్సరముల తరువాత ఇంకయూ రాజ్యాంగసంస్కరణలు చేయవలసిన అవసరమును నిర్ణయించెదమని బ్రిటిష్ పార్లమెంటులో ప్రకటించబడింది. ఆ సమయపరిధి దగ్గరపడుచున్నందున్న సర్ జాన్ సైమన్ అధ్యక్షతక్రింద ఒక విచారణ సంఘమును (Simon Commission) నియమించారు. ఆర్భాటముగా వెలువడించబడిన బాహ్యోద్దేశ్యము అదే అయినప్పటికీ భారతదేశము బ్రిటిష్ వారి వలసరాజ్యములలోకల్లా అమూల్యమైన ఆభరణమని ఒక శతాబ్ధపునకు పూర్వమే వారి ప్రతినిధి, వంగరాష్ట్రపు గవర్నర్ [[రాబర్టు క్లైవు]] ద్వారా తెలుసుకునటమేగాక తదుపరి 1905 సంవత్సరములో విజ్ఞానకరముగా అధ్యయనముచేసిన గవర్నర్ జనరల్ (వైస్ రాయి) [[లార్డ్ కర్జన్]] యొక్క పునః ఉద్ఘాటనతో భారతదేశానికి స్వతంత్ర పరిపాలననిచ్చు అవకాశము కలుగనీయకుండుటకు చేదోడుగా వంతుపలుకెడి విచారణ సంఘమను పేరట ఉపశమనకార్యముగా భారతయుల కన్నీళ్ళ తుడుపుచేయుట అంతఃరోద్దేశ్యము.
 
పూర్వోత్తర సందర్భములు: సైమన్ కమిటీ [[భారతదేశము]] పర్యాటనకు కొద్దిరోజుల మునుపు 1927సంవత్సరమున మద్రాసులో జరిగిన [[కాంగ్రెస్]] మహా సభలో సైమన్ విచారణ సంఘమును '''అనేకవిధములుగా బహిష్కరించవలెనన్న తీర్మానము చేయబడినది'''. వివిధ జాతి మతములు కలిగియున్న భారతదేశానికి సర్వసమ్మతమైన రాజ్యాంగమును నిర్మాణించుట దుర్లభమని ఆనాటి (1927) ఇంగ్లండులోని బ్రిటిష్ విదేశాంగ ఇండియా రాజ్యమంత్రిగా నుండిన లార్డు బిర్కన్ హెడ్ సవాలుచేసియుండెను. ఆ సవాలుకు జవాబుగా కాంగ్రెస్స అగ్రనాయకులు ఫిబ్రవరి 1928లో అఖిలపక్షములనుండి సభ్యులతో సమావేశములు జరిపి భారతదేశానికి రాజ్యాంగ చిత్తు ప్రతిని నిర్మించుటకు మోతీలాల నెహ్రూ అధ్యక్షతన 10సభ్యులతో ఒక సంఘమునేర్పరచి . ఆ పదిమంది సభ్యులలో ముస్లిమ్ లీగ్ మాజీ అధ్యక్షులైన సర్ అలీ ఇమామ్, షుయాబ్ క్వెరేషి కూడా నుండెను. ఆ కమిటీ తయారుచేసిన నివేదికనే నెహ్రూ నివేధిక అని ప్రసిధ్దిచెందియుండెను. 1928 సంవత్సరములోనే ''' ( సైమన్ కమిటీ వారి పర్యటానంతరము, వారి నివేదిక బహిరంగము కాక మునుపే ) ''' భారతదేశమునందు '''సర్వపక్ష సమావేశ సభ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన చేసిన తీర్మానము''' ప్రకారము భారతదేశానికి డొమీనియన్ స్టేటస్ (కెనడా దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యము ప్రసాదించినట్టి డొమీనియన్ స్టేటస్ వంటి) [[అధినివేశ స్వరాజ్యము]] కావలయునని అపేక్షించబడింది. ఆ తీర్మానము ప్రకారము భారతదేశానికి సుముఖమైన డొమీనియన్ స్టేటస్ [[రాజ్యాంగము]] చిత్తుప్రతి నిర్మాణించబడింది. సైమన్ విచారణ సంఘములో భారతీయప్రతినిదిత్వములేదని తెలియగనే మద్రాసులో 1927లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సైమన్ కమీషన్ ను బహిష్కరించవలయునని తీర్మానించబడింది. అటుతరువాత 1928 లో జరిగిన కాంగ్రెస్సుమహాసభలో డొమీనియన్ స్టేటస్ (అధినివేశ స్వరాజ్యము) కనుక ఇవ్వకపోతే సంపూర్ణస్వరాజ్యము స్థాపించెదమని బ్రిటిష్ సామ్రాజ్యప్రభుత్వమునకు ఇంకా తీవ్రమైన అంత్యహెచ్చెరిక (ultimatum) జారీచేయబడింది. 1929 డిసెంబరు 31 వ తేదీ న కాంగ్రెస్సు మహా సభలో బ్రిటిష్ వారితో సంబంధము లేకనే సత్యాగ్రహము సాధనముగా సంపూర్ణ స్వాతంత్ర్యము సంపాదింపవలెనని తీర్మానము చేయబడింది. 1930 జనేవరి 26 తేదీన ప్రథమ స్వాతంత్ర్యదినోత్సవము దేశములో అన్ని ఊర్లలో జయప్రథముగా జరుపకొన బడింది. దేశము దాస్యమునకు, దారిద్ర్యమునకు బ్రిటిష్ ప్రభుత్వమే కారణమని కూడా తీర్మానించబడింది. దేశప్రజలకు రాజకీయ హక్కులివ్వక భారతదేశమును బానిస రాజ్యముగా పరిపాలించుచున్న బ్రిటిష ప్రభుత్వమునకు కనీసపు ముఖ్య సంస్కరణలు చేయమని పదకొండింటిని గాంధీజీ ప్రతిపాదించెను. కానీ బ్రిటిష్ ప్రభుత్వము అవిత్రోసిపుచ్చి మరింత కఠినవైఖరి అవలంబించి నిర్బంద, నిషేధములు విధించెను. అట్టి పరిస్థితులలో గాంధీ 1930 మార్చి 12 వ తేదీన ఉప్పు-సత్యాగ్రహము, విదేశ వస్తు బహిష్కరణ మొదలగు ఉద్యమములు ప్రారంభించి ఏప్రిల్ 6 వతేదీన దండి మార్చి అనబడిన చారిత్రాత్మక ఉప్పు చట్ట తిరస్కారముచేసి శాసనోల్లంఘనమును చేసెను. ఆ సందర్బన యావద్భారతదేశమున కోకొల్లలుగా దేశ ప్రజలు జైలుకు పంపబడిరి. చూడు [[ఉప్పు-సత్యాగ్రహము]]. శాసనసభా సభ్యులనేక ప్రముఖులు రాజీనామా చేసిరి. అందు [[విఠల్ భాయి పటేలు]] (శాసన సభాద్యక్షుడు) తన అధ్యక్షపదవికి రాజీనామా చేసి చెరసాలకేగెను.<ref name="Siva Rao(1938)">"The British Rule in India" D.v. Siva Rao(1938) ఆంధ్ర గ్రందాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp402-408</ref> ఒకప్రక్క యావద్భారతదేశము సైమన్ కమీషను బహిష్కరించి నల్లజండాలు చూపగా భారతదేశమున ఈశాన్యదిశలోనుండిన (Northeast India) పర్వతపరగణాలు ఏవైతే బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీవారు మొదటి బర్మాయుద్ధం (1824-26) గెలుపొంది (చూడు "బర్మా బ్రిటిష్ బర్మాగా మారిన చరిత్ర" [[డల్ హౌసీ]] ) బర్మారాజుతో చేసుకున్న [[యండబూ సంధి]] ఫలితముగా బ్రిటిష్ ఇండియాలో భాగముగా పరిపాలించబడేవో ఆ పరగణాలోనివసించెడి (ఇప్పటి [[నాగాలాండ్]] రాష్ట్రము) నాగజాతి బహుజనవాసుల నాయకులు కొద్దిమంది నాగాక్లబ్ (Naga Club) అను పేరుతో సైమన్ కమీషన్ ను కలుసుకుని తమ నాగ జాతి పరగణాలకు సైమన్ కమీషన్ వారు చేయబోవు సంస్కరణలు వర్తించకుండునటుల కోరుచూ వినతిపత్రము సమపర్పించిరి.<ref>"Ethnonationalism in India" Edited by Sanjib Baruah(2012) Oxford India Paper Back pp243-252</ref>.<ref>"the longest August" Dilip Hiro (2015) Nation Books pp43-44</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2989211" నుండి వెలికితీశారు