ప్రబోధానంద యోగీశ్వరులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 69:
 
=== గ్రామ ప్రజలకు, ప్రబోధానంద ఆశ్రమ వాసులకు మధ్య జరిగిన ఘర్షణ ===
2018 సెప్టెంబరు 15న ఆశ్రమంలో అన్ని రాష్ట్రాల భక్తుల సమావేశం, శ్రీకృష్ణాష్టమి వేడుకల సమీక్ష జరుగుతుండగా{{citation needed}}, వినాయక నిమజ్జనం కోసం పెద్ద పొడమల గ్రామస్థులు ఊరేగింపుగా వినాయక విగ్రహాన్ని తీసుకుని ప్రబోధానంద ఆశ్రమం మీదుగా వెళ్తున్న సమయంలో వివాదం తలెత్తి ఘర్షణగా మారింది. వినాయకచవితి పండుగ తమ ఆచారాలకు విరుద్ధమంటూ భక్తులు దాడి ప్రారంభించారు అని ఒక వర్గం పేర్కొనగా,<ref name="బీబీసీ తెలుగు">{{Cite web|url=https://www.bbc.com/telugu/india-45554153|archive-url=https://web.archive.org/web/20180926080050/https://www.bbc.com/telugu/india-45554153 |title=తాడిపత్రి: ప్రబోధానంద భక్తులకు, స్థానిక ప్రజలకు మధ్య హింసాత్మక ఘర్షణ, |publisher=బీబీసీ తెలుగు|archive-date=2018-09-26]}}</ref> రాజకీయ కక్షతో వినాయక నిమజ్జనం పేరుతో ఆస్రమంపై దాడులు జరిపారంటూ ఇంకో వర్గం పేర్కోన్నారు.<ref name="Sakshi Kaksha katti">{{Cite web |url=http://epaper.sakshi.com/1819754/Anantapur-District/17-09-2018 |title=కక్షగట్టి.. చిచ్చు రగిల్చి.. |publisher=సాక్షి|date=2018-09-17}}</ref>. ఆ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఇందుకు నిరసనగా అనంతపురం పార్లమెంటు సభ్యుడు [[జె. సి. దివాకర్ రెడ్డి|జేసీ దివాకరరెడ్డి]] సెప్టెంబరు 16 న సంఘటనా స్థలం వద్ద నిరసన తెలిపాడు. పెద్దపొలమడ గ్రామస్తులు పెద్దఎత్తున ఆశ్రమాన్ని చుట్టుముట్టి రాళ్లు విసిరారు.అక్కడే వున్న ఆశ్రమ వాహనాలపై దాడి చేసారు. ఆశ్రమ నిర్వాహకుల తీరును నిరసిస్తూ గ్రామానికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంలో ఆశ్రమంలోపలి ప్రబోధానంద శిష్యులు ఒక్కసారిగా బయటకు వచ్చి, గ్రామస్తులపై కర్రలు, రాడ్‌లతో ప్రతిదాడిచేశారు. అక్కడివారిని కొట్టుకుంటూ పోగా వారి ధాటికి పోలీసులు కూడా ఆగలేకపోయారు. స్థానికులు తమ వాహనాలు అక్కడే వదిలి పారిపోగా, ఆ వాహనాలకు భక్తులు నిప్పు పెట్టారు.<ref name="బీబీసీ తెలుగు ప్రెస్ రివ్యూ">{{Cite web |url=https://www.bbc.com/telugu/india-45544354 |title=బీబీసీ తెలుగు ప్రెస్ రివ్యూ|date=2018-09-17|publisher=బీబీసి}}</ref> ఈ ఘర్షణలో ఎంపీకి కూడా రాయి తగిలింది, ఎంపీ వాహనం పాక్షికంగా దెబ్బతింది. ద్విచక్ర వాహనాలు, ఒక జీపు అగ్నికి ఆహుతయ్యాయి.<ref name="బీబీసీ తెలుగు"/> <ref name=":0">{{Cite news|url=https://web.archive.org/web/20180917053405/http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=7|title=అట్టుడికిన తాడిపత్రి గ్రామాలు; ప్రబోధానంద శిష్యుల దాడిలో వ్యక్తి మృతి|date=17 September 2018|language=తెలుగు}}</ref> పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జేసీ దివాకరరెడ్డిని అక్కడ నుంచి మద్దతుదారులు పంపించగా అతను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి బైఠాయించాడు.<ref name="బీబీసీ తెలుగు"/>
 
సెప్టెంబరు 16 న తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఎనిమిది మంది గ్రామస్తులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తీసుకెళ్లారు. పెద్దపొలమడకు చెందిన ఫకీరప్ప (వెంకట్రాముడు<ref>{{Cite news|url=https://web.archive.org/web/20180917055008/https://epaper.andhrajyothy.com/1819937/Ananthapur/17.09.2018#page/7/2|title=ప్రబోధానంద ఆశ్రమం వద్ద ఉద్రిక్తత ఒకరి మృతి|date=17 September 2018}}</ref>) అనంతపురంలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆశ్రమాన్ని మూసెయ్యాలని దివాకరరెడ్డి డిమాండు చేసాడు.<ref name=":0" /><ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/one-dead-as-violence-erupts-in-tadipatri-again/article24962936.ece|title=One dead as violence erupts in Tadipatri again|date=17 September 2018|language=ఇంగ్లీషు|archive-url=https://web.archive.org/web/20180918030932/https://www.thehindu.com/news/national/andhra-pradesh/one-dead-as-violence-erupts-in-tadipatri-again/article24962936.ece|archive-date=2018-09-18|publisher=The Hindu}}</ref> మరోవైపు 16 తేదీన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఆశ్రమం సమీపంలో ఆక్టోపస్ దళాలు సహా భారీ బలగాలు మోహరించారు.<ref name="చల్లబడ్డ తాడిపత్రి ఆంధ్రజ్యోతి">[https://web.archive.org/web/20180926112407/http://www.andhrajyothy.com/artical?SID=635668 చల్లబడిన తాడిపత్రి, ఆంధ్రజ్యోతి]</ref> లా అండ్ ఆర్డర్, కర్నూలు ఐజీలు, ఆక్టోపస్ విభాగం, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల ఎస్పీలు, జిల్లా కలెక్టర్ ఆశ్రమం సమీపానికి చేరుకుని ఆశ్రమవాసులతో సంప్రదింపులు ప్రారంభించారు.<ref name="బీబీసీ తెలుగు"/> ఆశ్రమానికి ఏ హానీ జరగదని పోలీసులు హామీ ఇచ్చాకా, అంతవరకూ కదలకుండా భీష్మించిన 600 మంది స్థానికేతర భక్తులను ఇతర ప్రాంతాలకు వెళ్ళడంతో వివాదం సద్దుమణిగింది.<ref>{{Cite news|url=https://web.archive.org/web/20180918061211/http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=8|title=సద్దుమణిగిన వివాదం|date=18 September 2018}}</ref><ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/inmates-evicted-from-tadipatri-ashram/article24971825.ece|title=Inmates evicted from Tadipatri ashram}}</ref>