శ్రీధర్ (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
[[దస్త్రం:Sridhar cartoonist Idisangathi.jpg|250px|thumb|right|శ్రీధర్, చిత్రకారుడు]]
'''శ్రీధర్''' ప్రఖ్యాత [[తెలుగు]] కార్టూనిస్టు. [[ఈనాడు]] దినపత్రిక బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి. ఆయన కార్టూన్ లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. <ref>{{Cite web|url=https://chaibisket.com/eenadu-sridhar-idhi-sangathi-cartoons/|title=ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ఈనాడు శ్రీధర్ గారి ‘ఇది సంగతి!’|last=Uday|first=Samosa|website=Chai Bisket|language=en-US|access-date=2020-07-15}}</ref> ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ప్రయత్నం చేసాడు. కార్టూనిస్ట్ శ్రీధర్ తన కార్టూన్ల ద్వారా తెలుగువారి హృదయాలలో నిలిచిపోతాడు. అతను దాదాపు 40సంవత్సరాలుగా ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పాఠకులు [[ఈనాడు]] పేపర్ లో వచ్చే వార్తల కోసం కోసం ఎంత అతృతగా ఎదురుచుస్తుంటారో ప్రతిరోజు చోటుచేసుకునే పరిస్థితులపై “ఇదీ సంగతీ” లో వచ్చే శ్రీధర్ కార్టూన్ల కోసం అంతే ఆతృతగా ఎదురుచుస్తుంటారు. నిజానికి ఎంతోమంది ప్రముఖ నాయకులపై విమర్శనాత్మకంగా ఎన్ని కార్టూన్స్ వేసినా దాదాపు ప్రతి నాయకుడు కూడా పాజిటీవ్ గానే తీసుకునేవారట. తన 18వ సంవత్సరంలోనే కార్టూనిస్ట్ గా మొదలైన జీవితంలో కేవలం ఈనాడు వరకే పరిమితం అవ్వలేదు దేశ, అంతర్జాతీయ వేదికలపై కూడా తనదైన శైలిలో గళమెత్తాడు. <ref>{{Cite web|url=https://chaibisket.com/sridhar-legendary-comics/|title=These Sarcastic Cartoons Will Prove Why Sridhar Is The Legendary Cartoonist We Will Ever See!|last=Kashetti|first=Srikanth|website=Chai Bisket|language=en-US|access-date=2020-07-15}}</ref>