వాయుదేవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి మొలక పౌరాణిక వ్యక్తుల మూస తొలగించాను
చి మీడియా ఫైల్ ఎక్కించాను
పంక్తి 10:
 
== బూరుగు చెట్టుకు గర్వ భంగం ==
[[దస్త్రం:Vayu, the god of wind Statue at Gokarneshwor Mahadev Temple Premises, Gokarna, Kathmandu.jpg|thumb|391x391px|గోకర్ణేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని వాయుదేవుడు విగ్రహం, గోకర్ణ, ఖాట్మండు. ]]
నారదుడు ఒకరోజు [[హిమాలయాలు|హిమాలయ పర్వతాలలో]] సంచరించేటప్పుడు ఒక బూరుగు చెట్టు నారదునికి కనపడింది.బలమైన కాండంకలిగి,విస్తారమైన కొమ్మలతో, తన తెల్లటి దూది ఫలసాయంతో మరో మంచుకొండలాగా ఉండటం [[నారదుడు|నారద మహర్షి]] చూసాడు. వేల అడుగుల ఎత్తులో ఉన్న ఇంతటి మహావృక్షం మనుగడ సాగించడం సాధ్యమేనా!’ అని మనస్సులో అనుకున్నాడు.తన మనస్సులోని అభిప్రాయం దాచుకోకుండా బూరుగచెట్టు వద్దకు వెళ్లి “నీవు ఇంత ఎత్తుబాగా విస్తరించి ఉన్నావుకదా! మరి నీకు ఆ వాయుదేవుని వల్ల ఏనాడూ నష్టం వాటిల్లలేదా? వాయుదేవుడు తన పవనాలతో నిన్ను విరిచేందుకు ప్రయత్నించలేదా! నీకూ వాయుదేవునికీ మధ్య ఏమన్నా బాంధవ్యం ఉందా ఏం?’’ అని అడిగాడు నారదుడు.
 
ఆ మాటలకు బూరుగుచెట్టుకు కోపం వచ్చింది.నేను ‘‘వాయుదేవుని స్నేహంతోనో, అతని దయాదాక్షిణ్యాలతోనో నేను జీవనం సాగించడం లేదు. నన్ను కూల్చేంత శక్తి వాయుదేవునికి లేదు. నా బలంతో పోలిస్తే వాయు బలం ఒక మూలకు కూడా రాదు,’’ అంటూ పరుషమైన మాటలెన్నో పలికింది. నారద మహర్షికి ఇటువంటి అవకాశాలు ఎదురుచూడటం అలవాటు.వాయుదేవుడను గురించి “నీవు ఇంత చులకనగా మాట్లాడటం సబబుగా లేదు! అతను తల్చుకుంటే ఎంతటి కొండలనైనా కదిలించేయగలడు.నీవు అన్న మాటలు అతనికి తెలిస్తే నీకు కీడు చేయక మానడు,’’ అని,  బూరుగు చెట్టు గర్వంతో పరుషంగా మాట్లాడిన మాటలన్నింటినీ వాయుదేవునికి చేరవేశాడు.
 
బూరుగు చెట్టు తనని కించపరచడాన్ని వాయుదేవుడు సహించలేకపోయాడు. వెంటనే ఆగమేఘాల మీద బూరుగుని చేరుకుని ‘‘ఒకనాడు బ్రహ్మదేవుడు నీ చెంత సేదతీరాడన్న కారణంగా, ఇన్నాళ్లూ దయతలచి నీ జోలికి రాలేదు. నేను చూపిన కరుణ నీలో కృతజ్ఞతను కలిగించకపోగా, గర్వాన్ని రగిలించింది. రేపు ఈపాటికి నిన్ను ఏం చేస్తానో చూడు!’’ అంటూ విసురుగాకోపంతో వెళ్లిపోయాడువెళ్లాడు. వాయుదేవుడు కోపంతో అన్న మాటలకు బూరుగ గజగజ వణికిపోయింది.ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.తనకు ఎవ్వరి వల్ల ఆపదలేదని దైర్యంతో పరుషంగా మాట్లాడి వాయుదేవునితోనే వైరం తెచ్చుకుంది. నారదుడు చెప్పినట్లు వాయుదేవుడు నిజంగా తల్చుకుంటే ఏమైనా చేయకలిగే సమర్థుడు.అతనికి ఎదురొడ్డి ఎలా నిలబడగలను. ఇప్పుడేం చేయడం! ఇలా పరిపరి విధాలా ఆలోచించిన బూరుగు చివరికి ఓ నిశ్చయానికి వచ్చింది. వాయుదేవుడు తనకు నష్టం కలిగించే లోపుగా తానే తన కొమ్మలనీ విరిచేసుకుంది, రెమ్మలన్నింటినీ తుంచేసుకుంది, పూలన్నింటినీ రాల్చేసింది. చిట్టచివరికి ఒక మోడుగా మారి,ఇప్పుడు వాయుదేవుడు నన్ను “నష్టపరిచేందుకు నా వద్ద ఏమీ మిగల్లేదు’ అన్న నమ్మకంతో వాయు రాక కోసం ఎదురుచూసింది.
 
మర్నాడు వాయుదేవుడు బూరుగ దగ్గరికి రానేవచ్చాడు. మోడులా నిలిచిన బూరుగుని చూసి జాలిపడ్డాడు.అప్పుడు బూరగతో ‘‘నేను విధించాలనుకున్న శిక్షను నువ్వే అమలుచేసుకున్నావు. ఇక మీదనైనా అహంకారాన్ని వీడి నమ్రతతో జీవనాన్ని సాగించు!’’ అంటూ సాగిపోయాడు.ఇందులో ఒక నీతి కూడా దాగుంది. పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా..... ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియచేస్తోంది. గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని పదే పదే వినిపిస్తోంది.<ref>{{Cite web|url=http://www.teluguone.com/devotional/content/vayudevudu-278-37706.html|title=బూరుగు చెట్టుకి గర్వం వస్తే!|date=2020-07-15|website=TeluguOne Devotional|language=english|access-date=2020-07-15}}</ref><ref>{{Cite web|url=https://lit.andhrajyothy.com/mahabharatham/pageno/413|title=మహాభారతం (సరళ వ్యావహారికంలో)|website=lit.andhrajyothy.com|access-date=2020-07-15}}</ref>
"https://te.wikipedia.org/wiki/వాయుదేవుడు" నుండి వెలికితీశారు