గుర్రాల వెంకట శేషు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''గుర్రాల వెంకట శేషు''' [[భారత జాతీయ కాంగ్రెస్]] నాయకులు. ఆయన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[మర్రి చెన్నారెడ్డి]] కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆయన రెండు పర్యాయాలు [[ఎమ్మెల్యే]]<nowiki/>గా తన సేవలనందించారు.
==జీవిత విశేషాలు==
ఆయన స్వగ్రామం [[టంగుటూరు (ప్రకాశం జిల్లా)|టంగుటూరు మండలం]] [[జమ్ములపాలెం]]. ఆయన 1945లో జన్మించారు. ఆయన తండ్రి గుర్రాల వెంకటస్వామి. తన ప్రాథమిక విద్యను [[ఒంగోలు]]<nowiki/>లోనే పూర్తి చేశారు. డిగ్రీ, పీజీ [[కావలి]] జవహర్‌ భారతి కళాశాలలో చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎంకామ్‌) విద్యనభ్యసించారు. ఎంకాం పూర్తయిన తరువాత 1979లో ఒంగోలు వచ్చిన శేషు ఏబిఎం [[కళాశాల]] ఎదురుగా శాంతినికేతన్‌ ట్యుటోరియల్‌ సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు విద్యను అందించారు. ఈయన వద్ద విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్‌లుగా, ఐపిఎస్‌లుగా, [[బ్యాంకు]], [[రక్షకభటుడు|పోలీసు]] అధికారులుగా, వివిధ శాఖలలో ఉన్నత పదవులను సాధించారు. [[ఒంగోలు]] మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావుకి జివి.శేషు రాజకీయ గురువు.<ref>[http://www.prajasakti.com/WEBSUBCONT/1820046 జివి.శేషు కన్నుమూత]</ref>
==రాజకీయ జీవితం==
ఆయన 1977లో [[ఒంగోలు]] బ్లాక్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)|1989 శాసన సభ ఎన్నికలలో]] తొలిసారిగా [[సంతనూతలపాడు]] శాసనసభ్యునిగా గెలిచిన<ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1989-election-results.html Andhra Pradesh Assembly Election Results in 1989]</ref> శేషు అప్పటి ముుఖ్యమంత్రి డాక్టర్‌ [[మర్రి చెన్నారెడ్డి]] కేబినెట్‌లో పాడి పరిశ్రమ, జౌళి శాఖ, లిడ్‌ క్యాప్‌ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. 1996-99 మధ్య కాలంలో [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి]] హయాంలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా [[శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం|శ్రీకాకుళం]], [[విజయనగరం శాసనసభా నియోజకవర్గం|విజయనగరం]] ఇన్‌ఛార్జిగా పనిచేశారు. 1994 ఎన్నికలలో సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జివి శేషు సిపిఎం అభ్యర్థి [[తవనం చెంచయ్య]] చేతిలో ఓడిపోయారు.<ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1994-election-results.html Andhra Pradesh Assembly Election Results in 1994]</ref> 1999లో జరిగిన ఎన్నికలలో [[సంతనూతలపాడు]] నియోజకవర్గం నుండి పోటీ చేసి, [[పాలపర్తి డేవిడ్‌రాజు]] చేతిలో ఓటమి చవిచూశారు. 2005-08 మధ్య కాలంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా జివి శేషు మూడేళ్ళ పాటు పార్టీని నడిపించారు. తరువాత కాలేయంలో గడ్డలు ఏర్పడి జివి.శేషు అనారోగ్యం పాలవటంతో స్పందించిన ముఖ్యమంత్రి [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి]] వైద్య చికిత్సలకు సహకరించారు. తరువాత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా జివి శేషుకు అవకాశం కల్పించారు. 2007-09 మధ్య కాలంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శేషు పనిచేశారు. [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)|2009 సాధారణ ఎన్నికలలో]] [[కొండపి శాసనసభ నియోజకవర్గం|కొండపి అసెంబ్లీ ఎమ్మెల్యే]]<nowiki/>గా ఎన్నికై, ప్రజలకు సేవలందించారు.
<ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html Andhra Pradesh Assembly Election Results in 2009]</ref>
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[జూలై 23]] [[2016]] న మరణించారు.<ref>[http://www.andhrajyothy.com/artical?SID=273717 మాజీ మంత్రి జీవీ శేషు మృతి 24-07-2016]</ref> ఆయనకు [[భార్య]], ఇద్దరు [[కుమారులు]], ఇద్దరు [[కూతురు|కుమార్]]<nowiki/>తెలు ఉన్నారు. ఆయన రాజకీయ వారసునిగా కుమారుడు డాక్టర్‌ రాజ్‌విమల్‌ ఉన్నారు.
<ref>[http://www.sakshi.com/news/district/ex-minister-gv-seshu-is-no-more-366991 మాజీ మంత్రి జీవీ శేషు ఇకలేరు Sakshi | July 23, 2016]</ref>
 
"https://te.wikipedia.org/wiki/గుర్రాల_వెంకట_శేషు" నుండి వెలికితీశారు