తంగి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 24:
}}
 
'''తంగి సత్యనారాయణ''' (1931 - 2009) [[శ్రీకాకుళం జిల్లా]]<nowiki/>కు చెందిన శాసనసభ్యుడు.
 
శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనొక్కడే సభాపతిగా చేశాడు . చాలా మంచి స్వభావము కలవాడు . వెలమ కులములో పుట్టి, [[న్యాయవాది]]గా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన శాసనసభ సభాపతిగా ఎన్నికయ్యాడు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకరు తంగి సత్యనారాయణ (78) : శ్రీకాకుళం రూరల్‌ మండలంలో [[కిల్లిపాలెం]] లో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1967-72 మధ్య స్వతంత్ర పార్టీ తరఫున శాసనసభ్యునిగా చేశాడు. 1972లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు. తిరిగి 1983 లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ సభాపతిగా వ్యవహరించాడు. 1984 లో [[నాదెండ్ల భాస్కరరావు]] ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించాడు. తిరిగి 1986 లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. మళ్లీ 2008 లో తంగి సత్యనారాయణ కాంగ్రెసులో చేరాడు. రెండుసార్లు బార్‌ అసోసియేషన్‌కు [[అధ్యక్షుడు]]<nowiki/>గా ఎన్నికైన ఈయన క్రిమినల్‌ [[లాయర్‌]]గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్‌.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగాడు. ఎ.ఐ.సి.సి. సభ్యుడుగా కాంగ్రెసు పార్టీలో కొనసాగేడు.
 
తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో [[అక్టోబరు 25]], [[2009]], ఆదివారం ఉదయం కన్నుమూశాడు. అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు [[హైదరాబాదు]]<nowiki/>లో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.
 
* ఈయన 1967, 1983 సంవత్సరాలలో [[శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/తంగి_సత్యనారాయణ" నుండి వెలికితీశారు